Pages

Friday, July 29, 2016

నా పేరు మొగుడు.!



బడి పిలగాల్ల కత!

నా పేరు మొగుడు.!


ఒక ఊళ్లె ఒక ముసలమ్మ ఉండేటిది. ఆమెకో మనవడుండేటోడు. ఆడు మస్తు తెలివిగల్లోడు. మాటలతోని యెదుటోల్లని బోల్తాగొట్టిచ్చేటోడు!
ఒకనాడు ఆడు ముసలమ్మని చారానా అడుక్కొని మిటాయి దుకానానికివొయ్యిండు. దుకానపాయ్నె అప్పుడే లడ్డూలు జేసి అమ్ముతందుకు వెట్టిండు. పిలగాడు పైసలిచ్చి ఒక లడ్డూ గొన్కోని తిన్నడు. తిన్నంక దుకాన్ల ఉన్న అన్ని లడ్డూల్ని పొట్లంగట్టమన్నడు. పెద్ద గిరాకే వొచ్చిందని దుకానపాయ్నె సంబూరవడ్డడు.
నీ పేరేందిర పిలగా అని అడిగిండు పొట్లంగట్టుకుంట.
నా పేరు అప్పులోడు అనిజెప్పి పొట్లం దీస్కొని ఉర్కిండు ఆడు!
అయ్యో.. అయ్యో ఆడు నా లడ్డూలెత్కపోతుండు అంటూ దుకానపాయ్నె ఒక్కతీర్గ మొత్తుకుండు. జనమంత వొచ్చిండ్రు.
ఎవలెత్కపోయిండ్రని అడిగితే అప్పులోడని చెప్పిండు బుడ్డోడు!!
నువ్వు బాకీ ఉన్నవ్ గావట్టె ఆడు ఎత్కపోయిండు. దానికి ఎవలేంజేస్తరు? అన్కుంటా అందరూ ఆడికెల్లి పోయిండ్రు. పాపం దుకానపాయ్న నొత్తినోరు కొట్టుకుండు!

ఆ పోరడు పక్కూరికి పోయిండిగ.  శెరువుకాడ ఓ శెట్టుకింద గూసొని లడ్డూలు తినుడు మొదల్వెట్టిండు. శెరువుల బట్టలుతికేటోల్లు ఆన్నిజూసి.. గిన్ని లడ్డూలెక్కడివిరా బుడ్డోడా అని అడిగిండ్రు.
పక్కూల్లె మిటాయి దుకానపాయ్న పంచిపెడ్తుండు అని చెప్పిండు ఆడు!
ఇంతకూ నీ పేరేందిరా అని అడిగిండ్రు ఆ బట్టలుతికేటోల్లు.
నా పేరు గాలిదేవుడు అని చెప్పిండు ఆడు.!
జెర మా బట్టలు జూస్తుండు. మేంవొయ్యి ఆ లడ్డూలు దెచ్చుకుంటం అన్కుంట ఆల్లంతా పక్కూరికి ఉర్కిర్రు!
ఆల్లువోంగనే ఆ పోరడు ఉతికేసిన బట్టలన్నీ మూటగట్టుకొని అక్కడ్నుంచి ఉడాయించిండు!
ఎంతో ఆశతో పక్కూరికిపోయిన ఆల్లు అంత వట్టిదే అని అర్థంగాంగనే పిలగాని మీద కోపంతోని యెన్కకు మల్లిండ్రు!
తీరా వొచ్చి సూస్కుంటే యేవుందిగ?
అయ్యో అయ్యో మా బట్టలెత్కపోయిండ్రా దేవుడా అని యేడ్సుకుంట గూసుండ్రు!
ఆల్లీల్లు వొచ్చి ఎవలెత్కపోయిండ్రు అని అడిగితే గాలిదేవుడు అని చెప్పిండ్రు!
గాలొచ్చి బట్టలెగిరిపోతే ఎవలేంజేస్తరు? అన్కుంట వొచ్చినోల్లంతా పోయిండ్రు.
బట్టలుపోయినోల్లకు మొత్కునుడు తప్ప ఇంకేం మిలగలే!

ఆ పోరడు ఇంకో ఊరికి పోతుంటే నడ్మ కాల్వ అడ్డమొచ్చింది. అప్పట్కే ఆడ ఒక ముసలమ్మ ఆమె మన్మరాలు నిలవడి ఉన్నరు.
జెర నన్నూ.. నా మన్మరాలిని కాల్వ దాటియ్యవా పిలగా అని బతిలాడింది ముసలమ్మ.
ముందు మీ మన్మరాలిని దాటిస్త. ఆటెన్క నిన్ను దాటిస్త అని పల్కిండు ఆ బుడ్డోడు!
సరేలే యెట్లయితేంది? అన్కుంది ముసలామె!
ఇంతకూ నీ పేరేంది పిలగా అని అడిగింది ఆ పోరన్ని.!
నా పేరు మొగడు అని చెప్పి పిల్లని దీస్కొని కాల్వదాటి అట్లనే పొయ్యిండు ఆడు!
ఒడ్డుకాడ ఉన్న ముసలమ్మ జరిగింది అర్థం చేస్కొని.. నా పిల్లనెత్తుకపోయిండ్రో దేవుడా అని యేడ్సుకుంట గూసుంది.
జెనాలొచ్చి ఎవలెత్కపోయిండ్రని అడిగితే మొగుడు అని చెప్పింది.
ఆ పిల్లని ఆమె మొగుడేగా తీస్కపొయ్యింది. ఇంకెవడో ఎత్కపోయినట్టు ఏడుస్తవేంది? అన్కుంట ఆడికెల్లి పోయిండ్రు అందరూ!
ముసల్దానికి ఏంజెయ్యాల్నో తోయలేదు!
పిలగాడు ఆ పిల్లని యింటికి తీస్కపోయి పెండ్లిచేస్కొని సంతోషంగా ఉండవట్టిండు!!

Human body energy clock

Human body energy clock


ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా???

ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌ల‌గుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే స‌మ‌యాల్లో యాక్టివ్‌గా ప‌నిచేస్తాయో, అవి ప‌నిచేసేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య

 ఈ స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు.

ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య

 ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి.

ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య

ఈ సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది.

ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య

 ఈ స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందుతుంది.

మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు

 ఈ స‌మ‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి.

మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు

 ఈ స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు

 ఈ స‌మ‌యంలోనూ మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి.

రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య

 ఈ స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది.

రాత్రి 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య

 ఈ స‌మయంలోభోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి.

రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య

ఈ స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది.

రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య

 ఈ స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు.

ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్య

 ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.------KY

శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

 శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
 అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
 ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
 అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..

 మళ్ళీ చెప్తున్నా.....!
కన్నీళ్ళు కారిస్తే కాదు....
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో ..!

చదివితే ఇవి పదాలు మాత్రమే,
 ఆచరిస్తే...
 అస్త్రాలు.

గురు, శిష్యులు ఇద్దరూ ఒక బీచ్ కి వెళ్ళారు..

గురు, శిష్యులు ఇద్దరూ ఒక బీచ్ కి వెళ్ళారు..

అక్కడ ఒక నోటిస్ బోర్డ్ మీద ఇలా వ్రాసి ఉంది.. " సముద్రం లో మునిగిపోతున్న వాళ్ళాని కాపాడిన వాళ్ళకి రూ. 500 బహుమతి.."
అది చూసిన గురువు : అరేయ్, నేను సముద్రం లోకి దిగి, మునిగిపోతున్నట్లుగా అరుస్తాను. నువ్వు నన్ను కాపాడినట్లు నటించు. అప్పుడు మంకు రూ. 500 వస్తాయ్. అందులో నీకు 100 రూ. ఇస్తాను..
శిష్యుడు: మరీ 100 ఏంటి గురూ గారూ, కనీసం సగం అయినా ఇవ్వండి...
గురువు: నోర్మూసుకో.. నేను గురువుని.. అయినా అయిడియా నాది...
అనుకుంటూ, సముద్రం లోకి దిగి చాలా దూరం లోపలకి వెళ్ళిపోయి, అరవడం మొదలెట్టాడు..
ఆ అరుపులు వింటూ, శిష్యుడు పాటలు పాడుకుంటూ ఒడ్డున కూర్చుని ఉన్నాడు...
సముద్రం లోకి కొట్టుకుపోతూ గురువు గారు చివరిగా అరిచాడు..
" ఒరేయ్ వెధవా, నీకు సగం ఇస్తాలేరా.. ముందు నన్ను కాపాడు..."
శిష్యుడు: గురూజీ, మీరు బోర్డు పూర్తిగా చదవలేదు... " ఈ సముద్రం నుండి
' శవాన్ని ' బయటకి తీస్తే 5000 రూ. ఇస్తామని వ్రాసి ఉంది కింద...

స్ఫూర్తినిచ్చే సూక్తులు...

భారతరత్న అబ్దుల్ కలాం  వర్ధంతి సందర్భంగా... స్ఫూర్తినిచ్చే సూక్తులు...
బుధవారం, 27 జూలై 2016

1. వర్షం వస్తే పక్షులన్నీ వాటివాటి గూళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది.

2. మానవుడికి కష్టాలు కావాలి ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి.

3. నీ భాగస్వామ్యం లేనిదే నీ విజయం సాధ్యం కాదు. నీ భాగస్వామ్యం లేనిదే నీ అపజయానికీ తావులేదు.

4. మనం కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము. అపజయాల పై నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.

5. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.

6. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది.

7. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.

8. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.

9. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.

10. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతడి నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తియ్యలేవు. 
11. హృదయాలతో పనిచెయ్యని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప చేస్తుంది.

what is TMC

నీళ్లు-నిజాలు
-నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు.
-ఒక సెకనులో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అంటే ఒక క్యూసెక్ అంటే 28.3 లీటర్లు.
-ఒకరోజంతా 11000 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది.
-టీఎంసీ అంటే శతకోటి ఘనపుటడుగుల నీరు(థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్).
-ఒక టీఎంసీ అంటే రెండు కోట్ల 80 లక్షల క్యూబిక్ మీటర్లు.
-ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల 68 లక్షల 46 వేల 592 లీటర్ల నీరు.
-అంటే 2831 హెక్టార్లలో ఒక మీటరు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అదొక టీఎంసీఅవుతుంది.
-22,956.8 ఎకరాల్లో ఒక అడుగు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అది ఒక టీఎంసీ అవుతుంది.

జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట

జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట. వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదలేసి రావడానికి తన బుజాలపై మోసుకుని బయలు దేరాడు.
దారిలో బుజం పై ఉన్న తల్లి ఎదో చేస్తున్నట్టు అనిపించి గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపడం గమనించి చాలా దూరం వెళ్ళిన తరవాత తల్లిని దించి నువ్వు ఎందుకు ఆకులు తెంచుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పుకొచ్చింది… నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని, నన్ను వదిలెయ్యాలని పైగా నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వస్తున్నావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను. అని చెప్పింది ఆ తల్లి. అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, దేవతతో సమానురాలు అని అందుకే అంటారు. ఆమె మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగి తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లి చక్కగా చూసుకోవడం మొదలు పెట్టాడు.అప్పటి నుంచి అందరూ ఆ ఆచారం వదిలేసారంట.
మనం కన్న పిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగా చేసాను, ఇలానే చేసాను ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని మురిసిపోయే మనం… మన తల్లి తండ్రులు వ్రుద్దులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తరవాత ఇలా ఉంటాను అన్న మాట అని ఎందుకు అనుకోము. నేటి తరం అయిన మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి, మన స్థాయికి మించిన చదువులు వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటు పడే మనము, మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మరచిపోతాము.
ఒక్కసారి ఆలోచిద్దాం… అందరికి తెలియజేసి, ఒకరిలోనైనా మార్పుకు కారణం అవుదాం, ఆ విషయాన్ని మన వృద్దాప్యంలో మాన మనమలు, మనవరాల్లతో  కూడా షేర్ చేసుకుందాం." తెలంగాణ కోకిల" మాస పత్రిక ఎడిటర్ mv రమణ దన్యవాదాలు .

help .

కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.

' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను........

" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు
  500 రూ.  ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........

ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ.
ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు
వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.

పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినా
సరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని
చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.

వృద్ధాశ్రమంలోకి వెళ్ళి  ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని
అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే

" నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు
  బోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు
  చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి
  మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి
  మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.

సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు
అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో
మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....

భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా
దీవించింది.......

" మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని
   ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే
   కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు
   మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా
   ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని
   విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి "

నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో
సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న
తృప్తితో ఇంటికి వచ్చాను...........
.............విజయపథం...






కోపం దాని పర్యావసనం 😡  ఒక ఆఫిసర్ 👨 చిరాకుగా ఉన్నప్పుడు అతని కింద పనిచేసే గుమాస్తా 👴🏻 ఒక ఫైలు 📂 తీసుకొచ్చాడూ    ఆ ఫైలులో చిన్న తప్పుంది దానికి ఆఫిసర్ 👨కోపంగా😡 ఏ..మయ్యా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నావు ఈ మాత్రం చాతగాదూ..? నీతో పని చేయించుకునే బదులు ఏ అడ్డగాడిది 🐴తో చేయించుకున్నా నాకింత సుఖం దక్కేది అన్నాడు.. గుమాస్తా 👴🏻 భాధపడుతూ ఇంటికి 🏡వెళ్ళీ హాల్లో కుచున్నాడు అతని భార్య 💁🏻 కాఫీ తెచ్చి ఇచ్చింది దాంట్లో చెక్కర🍚 వేయడం మర్చిపోయింది వెంటనే అతడు కోపంగా 😡 ఒసేయ్... 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు కాఫీలో పంచదార వేయడం రాదూ..? నీతో కాపురం చేసేకన్నా... అడ్డగాడిద🐴తో కాపురం చేస్తే  కాసింత సుఖం దక్కేది అన్నాడు... దాంతో అతడి భార్య 💁🏻 చిరాకుగా లోపలికి వెళ్ళింది లోపల హోంవర్క్ చేయకుండా టీవీ 📺 చూస్తూ కూర్చున్న పిల్లవాడిని 🙇🏻 ఒక్కటి పీకింది👋 ఆ పిల్లవాడు కోపంగా  బెడ్రూంలోకి వెళ్ళి అక్కడ వున్న కుక్కను 🐕 ఒక్క తన్ను తన్నాడు ఆ కుక్క అరుస్తూ బయటికి పరుగెత్తుతూ మధ్యలో హాల్లో కాళ్లు చాపుకునీ కూర్చున్న గుమాస్తాను👴🏻 కరిచిందీ.... కుక్క 🐕 కరవడం వల్ల గుమాస్తా👴🏻 2రోజులు ఆఫీసుకి వెల్లలేకపోయాడు... దాంతో ఆఫిసరే 👨🏻 2రోజులూ మొత్తం పని చేసుకోవాల్సి వచ్చింది.....                           ...............నీతి.................... తనకోపమే😡తనశత్రువు....  తనశాంతమే😌తనకురక్ష....
 

లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్.

దయ చేసి దీన్ని తప్పక షేర్ చేయండి నలుగురికి సహాయం చేయండి
 "లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు.

సంజీవ్ :- సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?

డాక్టర్:- ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే !!

సంజీవ్:- వేపుళ్ళు మంచివి కావంటుంటారు..

డాక్టర్:- ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?

సంజీవ్:- వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.

డాక్టర్:- అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?

సంజీవ్:- పోనీ మద్యం మానేయాలంటారా?

డాక్టర్:- ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.

సంజీవ్:- మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..

డాక్టర్:- లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!

సంజీవ్:- వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?

డాక్టర్:-ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది !!

సంజీవ్:- అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..

డాక్టర్:- చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!

సంజీవ్:- పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?

డాక్టర్:- ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?

సంజీవ్:- మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?

డాక్టర్:- రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?

సంజీవ్:- ??????

ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు._

ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు._

అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బ్యాగులో రెండు జతల బట్టలు, కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు.
అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు.

దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలవ్వ ఆకలిగా చూస్తూ కనబడింది . ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు .

ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది. ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వు మళ్ళీ చూడాలనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది

ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలనిపించింది . మధ్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు .
సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది .

ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ అడిగింది .
కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని

“నేను ఇవాళ దైవం తోకలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు

అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు
: అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు .

“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” .

“ దేవుడు నేను అనుకున్న దానికంటే చాలా చిన్నవాడేరా!”

ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ?

ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు .

మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు .

జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు .

ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం !
.
ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం

"అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..

ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........

మీ పిల్లలకు ఉపయోగపడే పోస్ట్

మీ పిల్లలకు ఉపయోగపడే పోస్ట్

(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα

1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α
🍄🍄🍄🍄🍄
» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
👇👇👇👇
9th,10th,11th,12th వరకు గణితంలో అన్ని ఫార్ములాలు ఉన్నాయి...
దయచేసి అందరి పిల్లల పేరెంట్స్ కి share చేయండి...

మీరు Vehicle ను అమ్ముతున్న లేదా కొంటున్న తప్పకుండా చదవండి

పౌరులారా మేల్కొండి:

  మీరు Vehicle ను అమ్ముతున్న లేదా కొంటున్న తప్పకుండా చదవండి
 1). ఒక రొజు ఉదయమే Excise Constable. వచ్చి Chandra Reddy డోర్ కొట్టి మీరు ఈరోజు ఒకసారి కోర్టుకు రావలసి ఉంది అని అన్నాడు. షాక్ నుంచి తేరుకున్నాక ఎందుకు అని అడిగాడు Chandra Reddy. దానికి అంత కంగారు పడవలసింది ఏమి లేదు మీ Car లో నాటు సారాయి సప్లై చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు, వెజకల్ మీది కావట్టి కోర్టుకు రావలి అని చావు కబురు చల్లగా చెప్పాడు, దానికీ Chandra Reddy నేను నా Carను 05 సం||క్రిదటే Mechanic షాఫ్ లో అమ్మాను, ఇప్పుడు నా మీద కేస్ ఎలా అవుతుంది అని ఆవేదనగా అడిగాడు.
అదంతా నాకు తరలియదు ఏమైన ఉంటె కోర్టులో తేల్చుకో అని ఆ Constable చెప్పి వెళ్ళి పోయాడు, కోర్టుకు అటెండ్ అయిన Chandra Reddy Rs.10,000/-Surityకి అడ్వోకేట్ Rs.5000/- తో Remand కాకుండా కోర్టు వాయిదాలకు 18 Months నుండి తిరుగుతూనే ఉన్నాడు.

2). కేంద్రప్రభుత్వంలో గుమస్తాగా పనిచేస్తున్న Kishan Rao లోన్ లో ఒక Car కొని ,మంచి రోజని ఏకాదశినాడు RTA ఆఫీస్ కు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన అతనికి నీవు ఇంకా 2% లైఫ్ ట్యాక్స్ కట్టాలి నీ పేరు మీద ఇంత ముందే ఒక వెహికల్ ఉంది అని ఆఫీస్ నుండి సమాదానం విన్న అతను నేను 02 సం|| క్రిందటే వెహికల్ అమ్మి దానికి సంబంధించిన forms మీద కూడా Sign చేసి ఇచ్చాను మరి ఎందుకు నా పేరు మీద నుండి అతనికి ట్రాన్స్ఫర్ కాలేదు అని అడిగితె, దానికి క్లర్క్ నుండి నీవద్ద వెహికల్‌ కొన్న అతనిని అడుగు అని చెప్పాడు, ఎంత try చేసిన Kishan Raoకు ఆ వెహికల్‌ ఎక్కడుందో trace out కాలేదు. ఎందుకంటె ఆ వెహికల్‌ ఇప్పటికీ చాలా మంది చేతులు మారింది.

3). Rs. 80,000/- లకు ఒక ఆటో కొన్న Mallaiahకు ఏ ఇబ్బంది లేకుండా తన పేరు మీదకు మారింది. ఒక రోజు traffic పోలీసులు ఆపి తమ వద్ద ఉన్న ఆన్ లైన్ లో చెక్ చేసి ఈ ఆటోమీద సిగ్నల్ జంఫ్, రాంగ్ పార్కింగ్ కేసులున్నాయి. ఇప్పుడు డబ్బులు కట్టలేక పోతె ఆటోను sieze చేసి చార్జ్ షీట్ వేస్తాము అని చెప్పారు. Mallaiahకు కాళ్ళ కింద భూమి కదలినట్టు అయింది. అప్పుచేసి ఆటో కొన్న అతనికి ఏమి చెయాలొ అర్థం కాలేదు.

4)మీ వెహికల్ ఎవరికైనా ఇస్తే వారూ చేశా తప్పులకు owner గా మీరే బాద్యత వహింఛ వలసి వుంటుంది  దానికి ఉ!! ఇటీవలనే పంజాగుట్ట లో తప్ప తాగి రమ్య వాళ్ల బాబాయి ,తా తయ్య ల  మరణాలకు కారణం అయినా మైనర్ ల పాశవిక సంఘటన

ఇటువంటి అనుభవాలు చాల మదికి ఉంటాయి కాబట్టి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.

1). వెహికల్‌ అమ్మిన వెంటనే మీ పేరు నుండి కొన్న అతని పేరు మీదకి మార్చుకొమ్మని వత్తిడి తెండి మరియు తెలిసిన వాళ్ళ వద్ద నుండి మాత్రమే అమ్మటం లేదా కొనటం చేయండి.
2). మీరు వెహికల్ కొంటె వాటిమీద ఏమైన challans పెండింగ్ ఉన్నాయా అని వెబ్ సైట్ లో traffic e-challans చూడండి.
3). New vehicle  కొంటె మీ  పేరు, తండ్రి పేరు  address మొదలైనవి Showroom డీలర్ సరిగాenter అయ్యిందో లేదో చూసుకోండి ముఖ్యంగా Engine No.,Chassis No. సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొవాలి

Sunday, July 10, 2016

మైదా పిండి ఎలా వస్తుంది ?

గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి,
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది........? ఎప్పుడైనా ఆలోచించారా.........?

మైదా పిండి ఎలా వస్తుంది........

అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ........

ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.

బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.

మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.

క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

 ప్రశ్న: క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: చలనంలో ఉన్న ప్రతీ వస్తువుకు కొంత శక్తి ఉంటుంది. వేగంగా ప్రవహిస్తున్న నీటికి, వేగంగా వీస్తున్న గాలికి ఉన్న శక్తి మనకు తెలిసిందే. ఈ శక్తిని గతిజ శక్తి అంటారు. బొంగరంలాంటి వస్తువు వేగంగా తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆ భ్రమణ వేగం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి అంటారు. ఇప్పుడు క్రికెట్‌ బంతి విషయానికి వద్దాం. ఈ బంతి వేగంతో ముందుకు వెళ్లడం వల్ల గతిజ శక్తి కలిగి ఉంటుంది. బౌలర్‌ బంతిని తిప్పుతూ విసరడం వల్ల అది తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళుతుంది. అందువల్ల దానికి భ్రమణ గతిజ శక్తి కూడా ఉంటుంది. ఈ రెండు గతిజ శక్తులతో బంతి పిచ్‌పై పడుతుంది. అపుడు బంతికి పిచ్‌కు మధ్య కలిగిన ఘర్షణవల్ల భ్రమణ గతిజ శక్తిలోని స్వల్పభాగం ఉష్ణశక్తి రూపంలోకి మారినా మిగతాదంతా గతిజశక్తిగా మారి బంతికి అంతకుముందున్న గతిజ శక్తికి తోడవుతుంది. ఇలా గతిజ శక్తి పెరగడం వల్ల పిచ్‌పై పడే వేగంకన్నా ఎక్కువ వేగాన్ని సంతరించుకుని బంతి వికెట్‌లవైపు దూసుకుపోతుంది.

Saturday, July 9, 2016

మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి

భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా..

మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.

- మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.

- స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.

- ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.
- సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం,
సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

- ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.

- వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి... వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.

- భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే.... వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని. తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

- సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది.

- అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
- ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
- పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి .

- మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.

- కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి.

- భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి.
ఆ... ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదనలు చేసేవారిని వదిలేయండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదు కదా? కొంచెం శ్రద్ధ కావాలి అంతే.

వాట్స్ఆప్ మెసేజస్ లో నిజాలతో పాటు అబద్దాలు కూడా చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి.

మిత్రులారా..................
చిన్న మనవి
 వాట్స్ఆప్ మెసేజస్ లో
నిజాలతో పాటు
అబద్దాలు కూడా
చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి.
వార్త వాస్తవమా కాదా
అని పరిశోధించే టైం లేక
అమాయకంగా అబద్దాలను
నిజాలుగా భావించి
ఫార్వార్డ్  చేయటం జరుగుతోంది.
అందువల్ల
రెండు ప్రమాదాలు...
ఒకటి వార్తలోని వ్యక్తి
"అభాసు"పాలు కావడం.
రెండు వార్తను చదివేవాళ్ళు
"ఫూల్స్" కావడం.
ఉదాహరణకు
మనిషిని మింగిన అనకొండ",
"ఒకే కాన్పులో 11 మంది బిడ్డలు",
"అతి పెద్ద అస్థిపంజరం", లాంటివి...
కొన్ని అయితే....
ఈ మెసేజ్ ను పంపితే ఫ్రీ,
ఫలానా వాళ్లకు ఫలానా  రోగం
మీరు ఈ మెసేజ్ ను
ఫార్వర్డ్ చేస్తే 10 పైసల లెక్కన డబ్బులు వస్తాయి.
ఈ ఫోటో లో వ్యక్తి దొంగ జాగ్రతగా ఉండండి.
లేదా పోలీసులకు పట్టి ఇవ్వండి.
ఫలానా హాస్పిటల్ లో ఉచిత వైద్యం..
ఈ మెసేజ్ పంపితే
బ్యాటరీ 100% చార్జింగ్.... ఇలా ఎన్నో వందల వార్తలు ఫార్వర్డ్ అవుతూనే వున్నాయి.
క్రాస్ చెక్ చేసుకునే
టైం లేక ఆ వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి
కనుక వెంటనే అతి త్వరగా ఫార్వర్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల ఇంకొంత మంది ఫూల్స్ అవుతున్నారు.
"దయచేసి కొంచం హేతుబద్దంగా" మనం ఆలోచించాలి.
"శాస్త్రీయంగా" విశ్లేషించాలి. వార్తలో నిజానిజాలు అంచనా వేయాలి.
"పరిశోధన" తరువాతే ఫార్వర్డ్ చేయాలి.
మనం అందరం చదువుకున్న వాళ్ళం .
లోక జ్ఞానం తెలిసిన వాళ్ళం.
ఇక మీద అందరు సభ్యులం ఒకటికి రెండు సార్లు ఆలోచించి
మెసేజస్ ఫార్వర్డ్ చేద్దాం.
మెసేజస్ లో నిజం  ఉందా లేదా అని ఆలోచించిన తరువాతే ఫార్వర్డ్ చేద్దాం.!
దయచేసి ఆలోచిద్దాం....
మ‌న‌కు స‌మ‌వ‌ర్త‌న‌ము,
తార్కిక‌ ఆలోచ‌న‌,
శాస్త్రీయ‌ దృక్ప‌థ‌ము,
స‌మ‌య‌స్పూర్థి అవ‌స‌ర‌మైన‌ ల‌క్ష‌ణాలు.
కాని కొంద‌రు అవివేకులుగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌రు..
1  ఒక‌ దేవుని పొటోను పోస్ట్ చేసి ఇత‌రులకు , గ్రూపుల‌కు పంపాల‌ని ..
పంపితే శుభ‌వార్త , పంప‌క‌పోతే దుర్వార్త వింటార‌ని బ్లాక్ మేయిల్ .చేస్తాడు
2 ఒక‌ పోటో ఉంటుంది..దాన్ని గ్రూపుల‌కు పంపాల‌ని..
మ్యాజిక్ చూడండి  అంటాడు.
3 ఒక‌ మెస్సేజ్ ...రెండు గ్రూపుల‌కు పంపిస్తే బ్యాట‌రీ రీచార్జ్ అవుతుంద‌ని...
ఒక‌ స్టూడెంట్ త‌యారు చేసాడ‌ని..వివ‌రాలుంటాయి..
4 ఒక‌ పోలీసు ఒక‌ పాప‌ను ఎత్తుకుని రైల్వేప్లాట్ ఫాం పై ఉన్న ‌ పోటో...
ఈ పాప‌ త‌ప్పిపోయింది...ఫార్వ‌ర్డ్ చేయ‌మ‌ని..
5 వాట్స‌ప్ డిలీట్ చేస్తే ఏదో కంపెనీ వాడు మ‌న‌ అకౌంట్లో డ‌బ్బులు వేస్తాడ‌ని...
6 న‌రెంద్ర‌మోదీ గారు..హైక్ వారి మెసెంజ‌ర్ వాడితే మ‌న‌కు డ‌బ్బులు ఇస్తాడ‌ని...
7 హీరో నాగార్జున‌ పేరుతో..
విదేశీ వ‌స్తువులు 120 రోజులు కొన‌క‌పోతే మ‌న‌దేశం ప్రపంచంలోనే ధ‌నిక‌ దేశం అవుతుంద‌ని..
ఇవ‌న్నీ మ‌న‌ మూర్ఖత్వానికి నిద‌ర్శనాలు
 గ్రూపుల్లో ఇలాంటి ప‌నికిమాలిన‌ సందేశాలు..
క‌నీస‌ సామాజిక‌ స్ప్రుహ‌ లేని వారు పంపే ఇలాంటి వార్తలను మ‌న‌ము మోస్తూ...
ఇత‌రుల‌కు సెండ్ చేస్తున్నామ ?
ఆలోచించండి...
         దయచేసిఉపయోగపడేవి మాత్రమే గ్రూప్ లో పంచుకోండి/
     అనవసర సమస్యలు వద్దు.
 మంచి విషయాలు పంచుకుందాం.
 అసత్యములైన విషయాలు  షేర్ చేయకండి.
నిజానిజాలు తెల్సుకొని తర్వాత పలువురికి ఉపయోగపడుతుందనుకుంటేనే షేర్ చేయాలి.                      

జీవితంలో ఎప్పుడైనా ఎవరి నైనా పనికి రాని

1. జీవితంలో ఎప్పుడైనా
       ఎవరి నైనా పనికి రాని వారిగా
         పరిగణించవద్దు ఎందుకంటే
           చెడిపోయిన గడియారం
             కూడ రోజుకు రెండు సార్లు
               సరైన సమయం
                  సూచిస్తుంది

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
      అన్వేషించే వ్యక్తి అందమైన
         పుష్పాల పరిమళాలను
           వదలి పుండు మీద వాలే
             ఈగ లాంటి వాడు

3. పేదరికం ధరిచేరినప్పుడు
      ఆప్తమిత్రులు కూడ
        దూరమైతారు అదే
          ధనవంతులైనప్పుడు
            తెలియని వారు కూడ
               మిత్రులవుతారు

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
      ప్రపంచంలో ఉండే అందాలన్ని
        నీ సొంతమవ్వుతాయి కానీ
          తడిసిన కనురెప్పలతో
             చూసే అద్దంకూడ మసక
                బారి పోతుంది

5. తొందరగా దొరికేది ఏదైనా
       ఎక్కువకాలం మన్నికరాదు
         ఎక్కువకాలం మన్నిక
           వచ్చేది అంతతొందరగా
              దొరకదు

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
      కూడా మన మంచి కొరకే
        అనుకోవాలి అప్పుడే
          తెలుస్తుంది నిజమైన
            స్నేహితులు ఎవరైనది

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
      వస్తాయి తాబేలు లాగా
        వెళ్లుతాయి కానీ డబ్బులు
          తాబేలు లాగ వస్తాయి
             కుందేలు లాగా
                వెళ్లుతాయి

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
       వెతకటం అలవాటు
         చేసుకోవాలి ఎందుకంటే
           పెద్ద పెద్ద మాటలు
             జీవితంలో చాలా
                అరుదుగా చోటు
                   చేసుకుంటాయి

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
      నాకు ఏమి ఇవ్వలేదని
        బాధపడకు ఎందుకంటే
          నీకు అక్కడ ఇవ్వక
            పోయినా నీకు నచ్చిన
              చోట నీకు ఈశ్వరుడు
                నచ్చినవిధంగా ఇస్తాడు

10. నిత్యము ఎదురయ్యే
        అపజయాలను చూసి
          నిరాశ చెందకు కానీ
            ఒక్కోసారి తాళంచెవి
              గుచ్చంలో ఉండే ఆఖరి
                తాళంచెవి కూడ తాళం
                   తెరుస్తుందని
                      గమనించు

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
         ఎంచేయగలననీ ప్రతి మనిషి
           నిరాశ చెందుతుంటాడు
             కానీ ఒక్క సారి తలపైకెత్తి
               చూడు ప్రపంచానికి
                వెలుగునిచ్చే సూర్యుడు
                   కూడ ఒక్కడేనని 

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
         సరే వదులుకోవద్దు
           ఎందుకంటే మురికి నీరు
             దప్పిక తీర్చలేక పోయిన
               కనీసం అగ్గి మంటలు
                 ఆర్పటానికి పనికి
                    వస్తాయి

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
        దురాశపరుడు సన్నిహితుడు
          మిన్న మట్టితో చేసిన
            మనుషులు కాగితాలకు
               అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
         రాక పోయినా కనీసం
           పశువుల మౌనంగా
             ఉండటమే ఉత్తమం

15. మనకు మాటలు రాక ముందు
       మనముఎంచెప్పబోతున్నామో
         అమ్మకు అర్థమయ్యేది కాని
           మనము మాటలు అన్ని
             నేర్చిన తరువాత ఇప్పుడు
                మాటమాటకు ప్రతిసారి
                   అమ్మా నీకు అర్థం
                      కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
          దూరమైనారని బాధపడకు
            ఎందుకంటే నీవు ఒక్కనివే
               జయించగలవని వారు
                 నమ్మినందుకు నీవు
                     సంతోషించు

17. సిగ్గు మర్యాద లేని
        ధనవంతుడు ఎల్లయ్య కన్నా
          మంచి మానవత్వం ఉన్న
            పేదరికం సుబ్బయ్య మిన్న

18. జీవితంలో హెచ్చుతగ్గులు
         రావటంకూడ మనమంచి
           కోసమే అనుకోవాలి
             ఎందుకంటే ECG లొ
               వచ్చే సరళరేఖా కూడ
                  మృత్యువును
                     సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు
         రొట్టె తొ సమానమైనవి
           ఎందుకంటే కొద్దిగా మంట
             ఎక్కవైందొలెదో రొట్టె
               మాడిమసి కావటం
                   ఖాయం

20. జీవితంలో మంచి వారి కోసం
         అన్వేషించ వద్దు ముందు
            నీవు మంచిగా మారు
              బహుశా నిన్ను కలిసిన
                వ్యక్తికి మంచి మనిషి
                   అన్వేషణ పూర్తి
                      కావచ్చు నేమో

వృక్షో రక్షిత రక్షితః

ఓ గుడి కడితే హిందువులే వెళతారు....👣
ఓ మసీదు కడితే మహ్మదీయులే వెళతారు...👣
ఓ చర్చి కడితే క్రైస్తవులే వెళతారు...👣
అదే
ఓ మొక్క నాటితే

అది చెట్టయితే....

దాని నీడకు కుల, మత, జాతి బేధాలు లేకుండా సకల జీవజాతులతో పాటు మనషులందరం వెళతాము.....

☘కనుక ప్రార్థనాలయాలతో పాటు

☘ ప్రాణవాయువునిచ్చే....
☘కాలుష్యాన్నినివారించే ..
☘భూతాపాన్ని తగ్గించే ...
☘గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ..
☘చల్లని వాతావరణాన్నిచ్చే
☘వర్షాలు కురిపించే ......
☘భూగర్భ జలాల్ని పెంచే ..
☘భూ సారాన్ని పెంచే .....
☘ఔషధాలనిచ్చే ........
☘నేల కోతను అరికట్టే .....
☘ఆహారాన్నందించే .....
☘స్వాంతననిచ్చే .......
☘సుగంధ ద్రవ్యాలనిచ్చే ..
☘కలప నిచ్చే .........
☘ఓజోన్ ను రక్షించే ..
☘జీవ వైవిధ్యాన్ని కాపాడే .
☘సకల జీవులకు ప్రాణాధారమై
☘ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ నిచ్చే
☘కరువు కటకాల నుండి రక్షించే
☘సంపదలను సమకూర్చే ..
☘ మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్నిచ్చే .


మన ప్రాణాధారమైన చెట్లను కనీసం ఒక్కటైనా నాటుదాం,

వాటిని సంరక్షిస్తూ,పుడమి తల్లి ఒడిలో  మనల్ని , మన భావి తరాలను,సకల జీవ రాశులను మనం సంరక్షించుకుందాం ....


             వృక్షో రక్షిత రక్షితః

వేరే వాళ్ల పెళ్ళి కి వెళ్ళే ముందు

వేరే వాళ్ల పెళ్ళి కి వెళ్ళే ముందు

face wash
face stick
conceler
eye shadow
mascara
eye liner
lipstick
lipgloss
lip pencil
face cream
face powder
blush on
kaajal
nail polish
body spray
perfume

దానితో పాటు బాగా Dress చేసుకుని Friends కి చెబుతారు " అయ్యేు Urgent లో సరిగ్గా Ready అవ్వలేదు"

&

What is a boy????
వేరే వాళ్ల పెళ్లి కి వెళ్ళే ముందు
Friends కి Phone చేసి
 " ఏరా స్నానాలు చేసి రావాలా??? "😁

Friends Reply- " ఏరా నీకు పిచ్చా,  పెళ్ళి నీకు కాదు, మోహం కడుకూనీ రా రా చాలు "

మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... పి ఎం నాయర్

మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... పి ఎం నాయర్

.
కలాం గారి సెక్రెటరీ గ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ పోదిగై వారు చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు యొక్క తెలుగు అనువాదం నా తెలుగు మిత్రుల కోసం :
.
.
1 . డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయన కు ఆ యా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు . ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు . ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు
.
.
2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో కాబోసు వచ్చింది . రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం మన దేశం లో . ఒక రోజు కలాం గారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు . దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను . “ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవుసరం . ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు , బట్టలు , ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు . అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు . అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు . ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి “ ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన , నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి “ అన్నారు . నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు . తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు . ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం !
.
.
3. ఆయనకీ తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు .
ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు .
“ నో సర్ ! “ అన్నాను . ఆయన మౌనంగా ఉండిపోయారు . మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయ మూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేమిటండి అన్నారు . ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్ ! విని అవుసరం అయితే తన అభిప్రాయం మార్చుకుంటారు సర్ “ అన్నాను . ఆయన ఆశ్చర్య పోయారు .
.
.
.
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు . వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు . దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు . ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు . వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు . అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు . ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు . ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు . ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు . ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీ ని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు
.
.
.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిశాము . అందరినీ పేరు పేరునా పలకరించారు . నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది . ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని .
.
చెప్పాను .
.
మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు . ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు .
.
ఇంత వరకూ ప్రపంచం లో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు .
.
చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
.
.
1) 3 పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Bangalore Flat handed over to scientists community long time ago
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
.
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు . ఈ విషయాలు తెలియని వారికి అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే ! నా పేరుతో ఉండడం కన్నా ఒక గొప్ప మహానుభావుడిని మనం కళ్ళతో చూశాము అనీ ఆయన నివసించిన కాలం లో మనమూ నివసించామనీ అందరికీ తెలియచేయ్యడం ప్రధానం . ...

సీసిరో

 సీసిరో  , తత్వవేత్త ,* క్రీ।।పూ।। 43 లో * ఇలా ఉటంకించారు :


1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
2. ధనికులు వారిని వాడుకుంటారు.
3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా
    విశ్రాంతి తీసుకుంటాడు.
6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని
    దోపిడి చేస్తుంటాడు.
8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ
    పట్టిస్తుంటాడు .
9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి
     డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ
       పాతపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా
     హాయిగా జీవిస్తాడు
______
  ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి , క్రీ।।పూ।। 43 నాటివి !

Govt. Employee

ప్రభుత్వ  ఉద్యోగి ,సోమరిపోతు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ

ఊద్యోగి : ఒరే ఇలా సోమరిపోతులా ఏ పని చేయకుండా, ఊరికే తిరిగితే నీ కుటుంబం ఏమవ్వాలి రా.

 సోమరిపోతు : ఒరే నా కుటుంబానికి ఏమి కాదు రా, ఎందుకంటే నాకు తినడానికి రూపాయికి కిలో బియ్యం ఉన్నాయి,ఉపాది హామి పైసలు  ఉన్నాయి, ఉండడానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉంది. Mainten cheyadaanikiనా భార్యకు Dwacra లోన్. మా చిన్న కొడుకుకు మోడల్‌ స్కూలు, పెద్ద కొడుకుకు ఫీజు రీ ఎంబర్స్మెంట్‌ , కూతురుకు  బంగారు తల్లి,కళ్యాణ లక్షిమి,ఆపై రోగమొస్తె ఆరోగ్యశ్రీ, ఏజ్ బారయితే నాకు ఆసరా ,నా భార్యకు అభయ హస్తం పింఛన్..ఇక నామాటంటావా ..ఏ నాయకునికి జై కొట్టినా బిర్యానీ ,మందు ఫ్రీ.. ఇంకెందుకురా నేను పనిచేసేది.

ఉద్యోగి:  ఒక్క నిమిషం ఆగురా. నేను ఉద్యోగం మానేసి నీతో వస్తాను

సైబర్ మోసాలు తస్మత్ జాగ్రత్త,

సైబర్ మోసాలు తస్మత్ జాగ్రత్త,

చాలా మంది చాలా సరదాగా
3G ఫ్రీఅని ,  4G ఫ్రీ అని , పెన్ డ్రైవ్ ఫ్రీ అని, 1GB Data ఫ్రీ , 10000 రూపాయల ఫోన్ ఫ్రీ అని పోస్ట్ చేస్తున్నారు.  ఏదో చిన్న ఆశ ఏమైనా రాకపోతుందా?. . . అని.అది మానవ సహజం.కాదనడం లేదు.

కాని మనం ఆలోచించ వలసిన విషయం ఇక్కడ ఒకటుంది.మీరు ఈ ఆఫర్ పోందాలంటే ముందు మీరు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబరు ,మీ ఈ మైయిల్ అడ్రస్ ను వారి వెబ్ సైట్ లో నమోదు చేయవలసి ఉంటుంది.

ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసారో మీ పూర్తి వివరాలు అంటే మీ పూర్తి పేరు , అడ్రస్ , ఆధార్ వివరాలు తదితరమైన అన్ని వివరాలు ఆ వెబ్ సైట్ లో చేరిపోతాయి.

అంటే మనకు మనంగా దొంగలకు మన సమాచారాన్ని మనం వారికి అందజేసినట్టే.
మీరు సైబర్ నేరాలు అనే మాట వినే ఉంటారు. వారి పనంతా రకరకాల వ్యక్తుల నుండి వారి విలువైన సమాచారాన్ని దొంగిలించడం.అంటే మన వివరాలతో మరింత మన రహస్య సమాచారాన్ని కూడా తెలుసుకొని వారు వారికి నచ్చిన విధంగా వినియోగించుకుంటారు.
అంటే మన ATM కార్డ్ యొక్క నకలు తయారు చేయడం,
మన బ్యాంకులకు సంబందించిన సమాచారాన్ని దొంగిలించడం.
ఆన్ లైన్ వ్యాపారానికి సంబందించిన సమాచారాన్ని దొంగిలించి మీ అకౌంటు ద్వార విలువైన కొనుగోళ్ళు చేయడం
కాబట్టి జాగ్రత్త పడండి.మోసపోయిన వాళ్ళలో మొట్ట మొదటి వారం మనమే అవుతాం.
.