Pages

Monday, September 26, 2016

Ethical stories in Telugu

నాన్న కు ప్రేమతో👌👌👌
 ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
 వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
 ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
 నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
 సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
 నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
 అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని
 ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
 ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
 మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
 ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !
బంధాన్ని గౌరవించండి !!
మనసారా ప్రేమించండి !!!
కథ.👍🍀

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు. అందుకాయన… “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.” వాళ్ళిద్దరూ భయంతో… “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.”ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. “బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా “ఎక్కడ?” అని అడిగారు.

“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. “ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.

“అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. “ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… “వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. “పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. “సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.😤😤

🌸గమనిక: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.



:@2::
---
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాin యంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు.

త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ,
తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ,
 అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.

platelets in blood

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.


రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు


1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.


2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .


3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.


4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.


5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.


6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.


7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.


8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.


9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.


*ఈ ఉపయోగకరమైన సమాచారం మీ మిత్రులకి షేర్ చేయండి.


ప్రశ్న: ఇనుప వస్తువులు గుచ్చుకుంటే సెప్టిక్‌ ఎందుకు అవుతుంది?🐔🗜

🕹జవాబు: పాత ఇనుప వస్తువులే కాదు, చాలా కాలం నేలమీద, మురికి ప్రదేశాల్లో ఉన్న ముళ్లు గుచ్చుకున్నా, పాత కర్రముక్కలు గుచ్చుకున్నా కూడా సెప్టిక్‌ అవుతుంది. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, చెక్క ముక్క సందుల్లో, ముళ్ల పొదల మూలల్లో నీటి ఆవిరి, దుమ్ము పేరుకుంటాయి. వీటి మీద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరుచుకుని వేలాదిగా పెరిగిపోయి ఉంటాయి. ఆయా వస్తువులు మన శరీరానికి గుచ్చుకున్నప్పుడు ఆ గాయం ద్వారా సూక్ష్మజీవులు మన రక్తంలో కలుస్తాయి. రక్తంలో పోషక విలువలు కలిగిన జీవకణాలు ఆహారంగా లభించడంతో సూక్ష్మజీవుల వృద్ధి మరింతగా పెరుగుతుంది.

🗜🐔 అందువల్ల పుండు (septic) అవుతుంది. నిజానికి చెత్త కుండీల్లో ఉన్న కాగితాలు, మురికి రోడ్డు మీది మట్టికణాలు రక్తాన్ని చేరుకున్నా ఇలాగే సెప్టిక్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే అవి గుచ్చుకోవు కాబట్టి ప్రమాదం ఉండదు. పాత పడిన మురికి పరికరాలు ఏవి గుచ్చుకున్నా వైద్యుని సంప్రదించి టెట్నస్‌ టీకా తీసుకోవడం మంచిది.టెటనస్ క్రిములవలన ధనుర్వాతము అనే జబ్బు వచ్చే ప్రమాదము ఉంటుంది

విమానం లో భోజనం

విమానం లో భోజనం
.
విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
(Soumendra Bandopadhyay గారి పోస్టు అనువాదం)
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
          


Wednesday, September 21, 2016

పెరుగు

పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి.

1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.RK

2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.RK

3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.RK

4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.RK

5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.RK

6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.RK

7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.RK

8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.RK

9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.RK

10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి

"అంతర్జాతీయ శాంతి దినోత్సవం

ఓ తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు. జీవితంలో ఎప్పుడూ ఎవరినీ హర్ట్ చేయొద్దు అని..
ఆ తండ్రి కొడుకుకు ఒక సంచిలో కొన్ని మేకులు ఇచ్చి నీకు కోపం వచ్చిన ప్రతిసారీ ఒక మేకును గోడకు కొట్టమన్నాడు.
మరుసటి రోజు కొడుకు.. తండ్రి చెప్పినట్టుగానే చేశాడు. రాత్రికి గోడకు కొట్టిన మేకులులెక్కచేయగా 34 ఉన్నాయి. మరుసటి 30, అలా ఒక వారం తర్వాత మేకులన్నీ అయిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు తండ్రి కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకును గోడ నుంచి తీసేయమన్నాడు. పది రోజుల తర్వాత గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు. ఆ విషయాన్ని మళ్లీ తండ్రికి చెప్పాడు.
అప్పుడు తండ్రి కొడుకుతో ఇప్పుడు గోడ దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించి రమ్మన్నాడు.
కొడుకు తిరిగివచ్చి తండ్రితో.. గోడకు రంధ్రాలున్నాయి అన్నాడు.
చూశావా? నీ కోపం వల్ల గోడకు కొట్టిన మేకులను తీసి వేయగలిగావు. కానీ రంధ్రాలను చేశావు. అలాగే ఎవరినైనా హర్ట్ చేస్తే అతని మనసుకు ఇలాగే రంధ్రం పడుతుంది. ఒకవేళ నీవు సారీ చెప్పి అతని మనసుకు కొట్టిన మేకులను తీసి వేయగలవేమో కానీ రంధ్రాలను కాదు కదా! అన్నాడు. 



"అంతర్జాతీయ శాంతి దినోత్సవం" సందర్భంగా సమాచారం🍋

🕌అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటాయి.

🕊 అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

🐔ఎటువంటి అల్లర్లు , ఘర్షన్లు కేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచుపుతుంది . శాంతి కపోతాలు ఎగరవేసి శాంతిపట్ల తమకు గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు .

🐌ప్రపంచ శాంతికోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేసాలు జరుపుతారు . వ్యక్తులు , సంస్థలు ,దేశాలు ప్రపంచశాంతికోసం తమవంతు ప్రయత్నాలు , ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజు ఇది .

🚂60 దేశాల ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో ఒక పెద్ద "శాంతి గంట "ను తయారుచేసి "యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్" వారు ఐ.రా.స.కు బహూకరించారు. న్యూయార్క్ లోని ఐ.రా.స. కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్ కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు.

🐌ప్రతి సంవత్సరం శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట మ్రోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు

🌹ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి. ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి .

🐔కాలం గడిచేకొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంరంభంగా జరుపుకుంటున్నారు.

🍇ఆవిర్భావము🍇

🍥1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది.
సర్వత్రా శాంతియుత భావాలను బలోపేతం చేయడానికి గాను ప్రపంచ శాంతి దినం అంకితమవుతుంది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 సెప్టెంబర్ లో నిర్వహించారు . 2002 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21 వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవ్ నిర్వహణకు శాశ్విత తేదిగా ప్రకటిండం జరిగింది .
ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరంగా కూడా 2008 సెప్టెంబర్ 21 చరిత్రలో నమోదవుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పునస్కరించుకుని మహాత్మా గాంధీ అహింసా పురస్కారానికి ప్రపంచ స్థాయిలో తొలిసారిగా రెవరెండ్ ఆర్చ్బిషప్ డెస్మండ్ టూటూ ఎంపికయ్యారు.
ప్రపంచ శాంతిని పాదుకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన అవిరాళ కృషిని గుర్తించిన ' ది జేమ్స్ మాడిసన్ యూనివర్శిటి (జేఎమ్యూ)' లోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందచేయాలని నిర్ణయించారు.
జరుపుకునే విధము📚
ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రజలు గుంపుగా ఓ చోట చేరాలనేం లేదు . ఎరైనా , ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు . ఏ మధ్యాన్న వేళైనా సరే ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు .. లేదా మౌనం గా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు ... లేదా సహొ్ద్యోగులు , వివిధ సంస్థలు , ష్థానిక ప్రభుత్వాలు భారీ కార్యక్రమాన్ని జరిపి శాంతి అవస్యకతను గురించి ప్రజలకు చక్కగా వివరించవచ్చు .                       

అంజలి

 అంజలి

శతృవు
చిటికెన వేలంతే
అయినా అనాదిగా
సరిహద్దులు రక్తంతో తడుస్తునే ఉన్నాయి!

పెద్దరికమా
ఇకనైనా నీ ఓపికను
బేరీజు వేసుకో!

కవ్వింపు చర్యలతో
కాగల కార్యాలేవీ లేవు
శతృవు మన ఉప్పుతిన్న
విశ్వాస ఘాతకుడు!

నిరంతర అనుమానాల మధ్య
వానితో చేసే చెలిమేదైనా
భ్రమే!

అవసరాలకోసమే
మిత్ర కూటాలేర్పడుతున్నప్పుడు
మన వాళ్ళంటూ
ఎవరూ ఉండరు
అంతా పగవాళ్ళే!

కడుపులో కత్తులు దాచుకున్న వానితో
ఎంత కాలం కౌగిలించుకుంటావ్?

హద్దు మీరినప్పుడే కదా
సరి హద్దుల్ని చెరిపే మోకా
దొరికేది!

యుద్ధం వాంఛనీయం కాకపోవచ్చు
అనివార్యమైనప్పుడన్నా
విజయంతోనే అమరులకు
అంజలి ఘటించాలి!
అంజలి ఘటించాలి!!





Tuesday, September 20, 2016

కథలు,

 కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా  నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. -ఏమంటారు?                        




కథ


🎯స్వశక్తి🎯

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.
 అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు.
ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి.
ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు.

 😘 రాము పెద్దవాడు.
 ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు.

 సోము సోమరిగా 😴 ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు.
 ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు.
 కొంతకాలము గడిచింది.

ఆ ఊరికి  🎩 ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు.
 చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది.
🎩 మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పిదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు.
అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు.

అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బసచేసి మరుసటి రోజు
"సొంతముగా నీవు నీ భార్యా కలసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది.
 నీకు బంగారము తయారయ్యాక నీ భార్యకి నగలు చేయించాలి సుమా!
అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలసి పనులు చేయాలి.
 పగలు నిద్రించరాదు"
అని చెప్పాడు.

బంగారము తయారు చెయ్యాలనే ఉద్దేశముతో తండ్రితో చెప్పి తనవాట పొలము తీసుకొని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యము పండించాలని కృషి చేశాడు.
అతని అదృష్టము వలన పంటలు బాగా పండాయి.
ధాన్యరాసులు ఇంటికి వచ్చాయి. మెజీషియన్ కొరకు ఎదురుచూడసాగాడు.

ఒకరోజున మెజీషియన్ వచ్చాడు.
అందరికీ సహాయపడుతూ ఉన్న సోమూని చూసి ఆనందించి
 "నీ భార్యకి నగలు చేయించావా? "
అని అడిగాడు.

ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది.
"మీరు మాకు బంగారము తయారుచేయిస్తానన్నారుకదా!"
అని అమాయకంగా అడిగాడు.

ధాన్యపు బస్తాలను చూపుతూ
"ఇవి బంగారము కాదా!" అన్నాడు.
అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క, బంగారము వలెనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ

" నీ గురించి విని, నీ పగటికలలకు స్వస్తి చెప్పాలనే, నాచెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తువేశాను.
నేను నీకు బావని.
మీ పెళ్ళికి రాలేకపోయాను.
 ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను.
 మాచెల్లెలు నన్ను గుర్తించింది. నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా.
 మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకొని అందరికీ నీవు బాగుపడటమే ఆనందమని తెలిసి మౌనం వహించారు"
అని చెప్పాడు.

 ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు.
 అన్న గారితో పొలము పనులలో సహాయము చేస్తూ సుఖసంతోషాలతో గడిపాడు.

💝 కలసి వుంటే కలదు సుఖం


👉మంత్రికి
          తెలివుండాలి,
     

బంటుకి
       భక్తుండాలి...


గుర్రానికి
       వేగముండాలి


ఏనుగుకి
        బలముండాలి...


సేనాధిపతికి
     వ్యూహముండాలి,


సైనికుడికి
           తెగింపుండాలి...


యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
     
కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు...


కానీ మనమే,
రాజులా ఆలోచించడం
           

ఆడపిల్ల


 ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని ముక్కు కుట్టేస్తారు.
చంచలస్వభావం ఎక్కువ కాబట్టి కాలిమెట్టెలు వేస్తారు.
అహంకారంతో చెవులు వినబడవని చెవులు కుట్టించి చెవిపోగులు వేస్తారు.
నీటిలో చేపల శబ్ధం వినిపిస్తుందిగాని అమ్మాయి నడుస్తున్నశబ్దం వినబడదని (కాళ్ళపట్టీలు) గజ్జెలు వేస్తారు.
అమ్మాయి మనసు అహంకారంతో అతిశయఒతో ప్రవర్తించకూడదని పెళ్ళి, మంగళసూత్రం, కుంకుమ, బంధువులు అనేవాటితో బంధిస్తారు.
మగవారికి ఇవన్నీ అవసరమేలేకుండా
"భార్య అనే ఒకేఒక్క ఆభరణం మగాడికి కట్టబెట్టి భర్త అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు".
మగాడి లైఫ్ ఖేల్ ఖతం దుకాన్ బంద్




Monday, September 12, 2016

చమత్కారచంద్రికలు



చమత్కారచంద్రికలు


గణిత సార్వభౌమం
ఇంతకూ చివరికేమైంది..?’
ఏదీ.. ఆ చదరంగపు లెక్కేనా..?’
అదే.. ఆ బ్రాహ్మణుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..
ఆఁ.. ఆఁ.. అయితే..
అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి బ్రాహ్మణుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..
అలా తీసెయ్యకూ.. ఆ బ్రాహ్మడేమీ వెర్రిబాగులవాడు కాదు.. అలా అనుకున్న వాళ్లు వెర్రిబాగుల వాళ్లు..
ఎంచేత..?’
లెక్క కట్టి చూసుకో.. ఆ బ్రాహ్మడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!
ఎలా..? నాకు ఆ లెక్కలేమీ తెలియవు కానీ ఇంతకూ ఎవరైనా ఎన్నిధాన్యపు గింజలో లెక్క కట్టి చెప్పారా..?’
లక్షణంగా.. మరేమనుకున్నావు మనవాళ్ల గణిత పరిజ్ఞానం.. చివరి గింజవరకూ లెక్క కట్టి మనం మరచిపోతామేమో నని ఒక చంపకమాల పద్యంలో బిగించి ఉంచారు..
అలాగా.. ఏదీ..?’
ఇదుగో.. విను
శర శశి షట్క చంద్ర శర
                సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
                తర్క పయోనిధి పద్మజాస్య కుం     
జర తుహినాంశు సంఖ్యకు ని
                జంబగు తచ్చతురంగ గేహ వి      
స్తర మగు రెట్టికగు
                సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి, కొండలు తప్ప..
అదే నోయ్ మనవాళ్ల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..
సరేసరే.. విప్పి చెప్పవూ..
 ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు.. అలాగ, విమర్శించుకుని వివరించుకుంటే,
శర, సాయక, - 5 మన్మథుని పంచసాయకములు తెలుసుగా.
గగన, వియత్ - 0 ఆకాశం గగనం శూన్యం
శశి, చంద్ర, తుహినాంశు - 1 చంద్రుడొకడేగా భూమికి ఉపగ్రహం..
షట్కము - 6 స్పష్టమే కదా
రంధ్ర - 9  నవరంధ్రపురే దేహే.. తోలుతిత్తి యిద్ది తొమ్మిది తూటులు.. విన్నావుగా ఆ పాట..
నగ, గిరి, భూధర - 7 సప్త కులపర్వతాలు
అగ్ని - 3 మూడగ్నులు; గార్హపత్యాగ్ని(తండ్రికై), దక్షిణాగ్ని(తల్లి), ఆహవనీయాగ్ని(గురువు)
మనుస్మృతి వాక్యం ,
పితా వై గార్హపత్యాగ్ని ర్మాతగ్ని ర్దక్షిణః స్మృతః
గురు రాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసీ (మనుస్మృతి 2-331)
అబ్ధి, పయోనిధి - 4 చతుస్సముద్రముద్రిత ధరావలయంబును.. చదువుకున్నావుగా
వేద -4 చతుర్వేదములు
తర్క - 6 తార్కికులు చెప్పిన షట్ ప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి
పద్మజాస్య - 4 పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడేగా
కుంజర - 8 అష్ట దిగ్గజములు కదా భూమిని భరించేవి
ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూడు..
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
                సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
                      5       9       0         7  3 
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
                తర్క పయోనిధి పద్మజాస్య కుం
                   6         4           4        
జర తుహినాంశు సంఖ్యకు ని
8       1 
                జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు
                సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
ఇంతా చేస్తే వచ్చిన సంఖ్య ఎంతా..! చూడు..
అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సంప్రదాయ సూత్రం మరచిపోకూడదు సుమా.. అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి.. అలా చేస్తే తేలిన సంఖ్య..
1,84,46,74,40,73,70,95,51,615
ఒక కోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల
73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615
ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
విడమరచుకుంటే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు..
పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే,
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి కేవలం 58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతిఅదేమిటి.. నోరలా వెళ్లబెట్టావ్..
వేదపండితులతో వేళాకోళం తగదు సుమా
ఇంతకూ ఇంతపరిమాణాన్ని పాదానికి 21 అక్షరాలు గల నాలుగుపాదాల చంపకమాలలో అదీ రెండుపాదాలపైన రెండుగణాలలోపే.. అంటే కేవలం 48 అక్షరాలలో సంగ్రహించి చెప్పారు చూశావా.. ఈ పద్యం నోటికి వస్తే చాలు.. చదరంగం లెక్క వచ్చినట్టే.. అదీ పద్యసౌందర్యం..!

Telugu Stories



కథ


అబద్దం తెచ్చిన అనర్థం
జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు.
 వాసు కొంటెకుర్రవాడు.
 అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.
 తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు.
 ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు.
 అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది.
ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్ను షాపు యజమానికి ఇచ్చాడు.
 ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని
బాబూ!
నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది.
 నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్కు చూపించుకో అని సలహా ఇచ్చాడు.
 ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి
 ఏంటిరా! కాలికి ఏమి అయింది?
 ఎందుకు అలా కాలు కుంటుతున్నావు?
అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి.
బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు.
 బడికి ఎగనామం పెట్టి సైకిల్పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.
చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది.
అలా రెండు రోజులు గడిచిపోయాయి.
 వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు.
అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు.
అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు.
బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది.
అని మరలా అబద్దం చెప్పాడు వాసు.
 నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు.
చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు.
ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది.
 అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు.
 ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది.
నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది
అందుకే పెద్దలు
అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు.
ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో.
ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు.
 బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు.
చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది.
.