నోబెల్ కు నామినేట్ కాబడ్డ ప్రముఖసాహితీవేత్త.."గుంటూరు శేషేంద్ర శర్మ" గారివర్దంతి నేడు..
"జన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచు తులైన గుంటూరు శేషేంద్రశర్మ, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత".ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి."నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది..
రచనలు...
1951-"సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచన నుండి)1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం1974 - మండే సూర్యుడు,1974 - రక్తరేఖ,1975 - నా దేశం - నా ప్రజలు,1976 - నీరై పారిపోయింది ,1977 - గొరిల్లా నరుడు ,- నక్షత్రాలుషోడశి - రామాయణ రహస్యములు,స్వర్ణ హంస, ఆధునిక మహాభారతం ,జనవంశం, కాలరేఖ (సాహిత్య అకాడమీ అవార్డు) కవిసేన మేనిఫెస్టో , మబ్బుల్లో దర్బార్...1968 - సాహిత్య కౌముది,ఋతు ఘోష ,ప్రేమ లేఖలు.
ఆయన కవిత్వం..
కోపం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూసారా ?
బాధ కన్నీరు పెడితే ఏమవుతుందో తెలుసా?
ఆవేశం అరుపు ఎప్పుడైనా విన్నారా?
భావావేశం బులెట్ లా మారుతుందని కలగన్నారా ?
పోనీ… కనీసం
రక్తం మరిగి రచనలా పలుకుతుందని,
హృదయం కరిగి కవితలా మారుతుందని,
ప్రేమ పొంగి పద్యమై పాడుతుందని,
ద్వేషం పెరిగి దండయాత్ర చేస్తుందని మీరెప్పుడైన అనుకున్నారా. కనీసం ఎవరైనా అంటుంటే విన్నారా. లేదు కదా. అయితే ఈ వ్యాసం చదవాల్సిందేనండి(తెలిసినా చదవండి తప్పు లేదు కదా).
పదండి…
పైన చెప్పిన వాటిని అన్నిటిని అనుభవించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన గురించి ఇప్పటివరకు మనం వినకపోయుండొచ్చు, మన పెద్దోళ్ళు చెప్పకపోయుండొచ్చు, వాళ్ళ పెద్దొళ్ళకి తెలియకపోయుండొచ్చు.కాని, అలాంటి వ్యక్తి గురించి మన తరానికి తెలియాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది.
ఆయన తను అనుభవించిన ప్రతీది ప్రజలందరికి పంచాలని కవితలు ,పద్యాలూ, వ్యాసాలు, కథలు ఇలా ఉన్న పద్దతులు అన్నిటిలో ప్రయత్నించారు. కనుక, ఆయన రచనలలోని కొన్ని ముఖ్య పంక్తులు అయినా మనకి తెలిసుంటే బావుంటుంది అనే ఉద్దేశంతో…
తామే గొప్ప, తాము చేసిందే వేదం,తాము లేకపోతె అసలు సృష్టే లేదు అన్నటు ప్రవర్తించే వారిని ఉద్దేశించి…
రాహువుపట్టిన పట్టు
ఒక సెకండు ఆఖండమైనా
లోక బాంధవుడు అస్సలే
రాకుండా పోతాడా ?
మూర్ఖులు గడియారంలో..
ముళ్లు తిరగనీయకుంటే
ధారాగమనం అంతటితో
ఆగిపోతుందా..?
కుటిలాత్మతుల కూటమికొక
తృటికాలం విజయము వస్తే
విశ్వస్రుష్టి పరినామం
విచ్చిన్నమౌవుతుందా..?
తాము చెప్పినట్టు జరుగుతుంది, తమకు ఎదురు నిలిచే వారే లేరు అన్నట్టు ప్రవర్తించే వారిని ఉద్దేశించి…
సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర
కూర్చొని మొరగదు
తుఫాను ఒకడికి ఛిత్తం
అనటం ఎరగదు
పర్వతము ఎవ్వడికి వంగి
సలాం చేయదు..
జరుగుతున్నా పరిణామాలకు ఏమి చేయలేక…
గడిచిన చరిత్రలో నాకు తావు లేదు
నడుస్తున్న చరిత్రకు నీతి లేదు..
డాములెందుకు కడుతున్నారో..
భూములెందుకు దున్నుతున్నారో..
నాకే తెలీదు ....నా బ్రతుకొక సున్నా
కానీ నడుస్తున్నా..
ప్రకృతిలో తానూ ఒక భాగం అంటూ…
"కొండలతో సముద్రాలతో కలసిబ్రతికేవాడికి తుఫానులో లెక్కా?
తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి
ఈగల్లా ఎగిరే ఈ క్షుద్ర బాధలో లెక్కా..?"
నీకెందుకింత అశాంతి, నీకెందుకింత ఆవేశం అంటే…
సముద్రాన్ని అడుగు..
నీకెందుకింత అశాంతి అని
ఝుంఝుమారుతాన్ని అడుగు
నీకెందుకింత ఆవేశం అని"
ఏది లేకపోయినా…
కాలాన్ని నా కాగితం చేసుకుంటా..
దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా!!
ఎందుకు ప్రజలకు జ్ఞానం భోదపడదు అన్నప్పుడు…
తిండిలేని వారి ఆకలి
తియ్యటి కావ్యాలు తీరుస్తాయా?
దేశం సుబిక్షంగా ఉన్నపుడే
విద్య వికాసమౌతుంది..
పట్నం జీవితంలో ఇమడలేక…
"ఈ చెట్లుందుకు పూలే పూస్థాయి
ఈ నికృష్టపు నాగరికత విడిచే
బొగ్గుపులుసు వాయువు పీలుస్తూ..
ఇవి బుల్లెట్లెందుకు పూయవు?"
జీవితం గురించి ఒక్క మాటలో…
"ఇక్కడ జీవితం ఎవడిని వదిలిపెట్టదు
మనిషి నించి మనిషికి నిప్పింటిస్తుంది.."
మీరెలా ఇలా కవితలు రాయగలరు అన్నప్పుడు…
"కవిత్వం ఎర్రరంగు గుర్రంలా వస్తుంది
రక్తంలో ముంచిన బాణంలా..
...వీరుడు విడిచిన ప్రాణంలా..!
నిజంగా కోల్పోవటం అంటే…
"వసంతం అంటే అందరికి తెలీదు
కోకిలను కోల్పోయిన కొమ్మలకి తెలుసు
పాటలను కోల్పోయిన పక్షులకు తెలుసు
ఈ దేశంలో బ్రతకటం గురించి…
నా దేశపు పగలు రాళ్ళుకు తగిలి
పగులుతున్న పడవలు
నా దేశపు రాత్రులు గుండెకు
తగిలి రగులుతున్న గొడవలు..
దేశం లోని దౌర్జన్యాలు చూడలేక…
"అరే , ఈ కొండలు ఆరవవెం..
ఈ రాత్రుల కాపాలాలు పగలవేం..
ఈ నక్షత్రలు చచ్చి నెలకు రాలవేం..
ఈ గుంపు వినరే నా మాట..
నా దేశంలో నా గొంతు
పరాయిదైపోయింది..!
ఆత్మాభిమానం గురించి…
"నాఅవయవాలకు నీచంగా వంగే
భంగిమలు తెలియవు..
-నేను సత్యాగ్రహి
సత్యం
నా గుండెల్లో బడ్డలవుతున్న అగ్నిపర్వతం
నా గొంతులో గర్జిస్తున్న జలపాతం..
రవీంద్ర నాథ్ టాగూర్ తర్వాత నోబుల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన సాహితీవేత్త… గుంటూరు శేషేంద్ర శర్మ గారు!
అవార్డులు..
1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
1999 -సాహిత్య అకాడమీ అవార్డు
రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ .
విశేషాలు..
శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గు లో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట.
మరణం..
శేషేంద్రశర్మ మే 30, 2007వ తేదీ రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ కార్యక్రమానికి అనేకమంది సాహితీప్రియులు, అధికారులు, రాజకీయవేత్తలు, సామాజిక సేవాసంస్థల ప్రతినిధులు హాజరైనారు.
ఆయన, జనం మేలుకొని ప్రభంజనం అవ్వాలని కోరుకున్నారు. నేల విడిచి సాము చేయటం మాని, నేల సాగు చేయటం తెలుసు కోవాలన్నారు. పట్నం లో ఇనుప గోడల మధ్య బందీగా ఉండటం కన్నా, పొలంలో దుక్కి దున్నటం గొప్పని ఆయన అభిప్రాయం. ఆయన రచనలు చదివితే ఉత్తెజితులు అవ్వటం ఖాయం. కుదిరితే ప్రయత్నించండి,
(జ:అక్టోబర్ 20,1927-మ:మే 30, 2007)
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends