Pages

Saturday, June 17, 2017

పెట్రోల్ ధరలు రోజూ ఛేంజ్..తెలుసుకోండిలా!

పెట్రోల్ ధరలు రోజూ ఛేంజ్..తెలుసుకోండిలా!


న్యూఢిల్లీ : ఇక నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ వారీ మారతాయి. మారుతున్న ధరలకు అనుగుణంగా వినియోగదారులు రోజుకో ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇంధన సంస్థలు ఈ మార్పులు చేపడతారు. ఇన్ని రోజులు అంతర్జాతీయ ఇంధన ధరలు, డాలర్ తో రూపాయి మారకం రేటుకు అనుగుణంగా 15 రోజులకు ఒకసారి ఇంధన సంస్థలు  ఈ రేట్లలో మార్పులు చేపట్టేవి. కానీ నేటి నుంచి రోజువారీ మార్పునకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటే, వాటిని తెలుసుకోవడం ఎలా? ప్రాంతానికి బట్టి కూడా ధరల మార్పు ఎలా ఉంటుంది? వీటన్నింటిన్నీ తెలుసుకోవడం కొన్ని మార్గాలున్నాయంట. అవేమిటో ఓ సారి చూడండి...

*మొబైల్ యాప్*
మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా  ఓ యాప్ ను రూపొందించారు. అది Fuel@IOC - IndianOil. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే, నగరాల్లో రోజూవారీ మారుతున్న ధరల అప్ డేట్ ను ఇది అందిస్తోంది. బీపీసీఎల్ కూడా ఇదే తరహాలో SmartDrive, అలాగే హెచ్పీ కూడా  MYHPCL యాప్ లను తీసుకొచ్చాయి. ఈ యాప్స్ ద్వారా కూడా మీరున్న ప్రాంతంలోని పెట్రోల్ బంకుల్లో ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

*అప్ డేట్ కోసం ఎస్ఎంఎస్...*
పెట్రోల్ బంకుల్లో ధర తెలుసుకోవడం కోసం 9224992249 నెంబరుకు (రిటైల్ సేల్ ప్రైజ్)RSP< SPACE >DEALER CODEగా మెసేజ్ పంపితే చాలు. వెనువెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలిసిపోతాయి. భారత పెట్రోలియం కూడా ఇదే ఫార్మాట్ లో 9223112222 నెంబర్ ను తీసుకొచ్చింది. హిందూస్తాన్ పెట్రోలియం కస్టమర్లు అయితే  9222201122 నెంబర్ కు HPPRICEDEALERCODE  అని మెసేజ్ చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తాయి.

వెబ్‌సైట్‌ ద్వారా..
ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ www. iocl.comలో ఆర్‌ఓ లొకేటర్‌ ద్వారా మీరు ఏ ప్రాంతంలోని పెట్రోల్‌ బంకులో ధర తెలుసుకోవాలనుకుంటున్నారో చూసుకోవచ్చు. అయితే దేశంలోని మొత్తం పెట్రోల్‌ బంకుల్లో 20 శాతం వరకూ మాత్రమే ఆటోమేటెడ్‌ విధానంలోకి మారాయని తెలుస్తోంది. రేట్లను చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. కొన్ని బంకుల యజమానులు వీటిని ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా రోజువారీ ధరల మార్పులను తెలుసుకోవచ్చని తెలుస్తోంది.

మెసేజ్ బాగుంది చదవండి

మెసేజ్ బాగుంది చదవండి


*భక్తుడి తపస్సుకు మెచ్చి *దేవుడు* ప్రత్యక్షమయ్యాడు...

 *దేవుడు* = ఏమి వరం కావాలి భక్తా . . . ?
 *భక్తుడు* = ఈ ప్రపంచం లో ఉన్న వాళ్ళందరకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి!
 *దేవుడు* = ఒకే ఇస్తాను. అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు . . . ?
 *భక్తుడు* = డబ్బు వుంటే ఏదైనా చెయ్యొచ్చు. ముందుగా ఒక ఇల్లు కట్టుకొంటాను.
 *దేవుడు* = ఎవరు కడతారు . . . ?
 *భక్తుడు* = ఎవరేమిటి డబ్బు పారేస్తే ఈ వూళ్ళో ఎవరినా కడతారు
 *దేవుడు* = ఎవరికీ పారేస్తావు . . . ?
వాళ్ళ దగ్గర కుడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా, వాళ్ళే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్విమని.
 *భక్తుడు* = ఈ ఊళ్ళో ఎవరు కట్టకపోతే ప్రక్క ఊరినుంచి కూలిలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి.
 *దేవుడు* = ఆ పక్క ఊరిలో వాళ్ళందరి దగ్గర కుడా 100 కోట్లు వుంటాయి కదా . . . ?
 *భక్తుడు* = ఎవరు కట్టటానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను నాకు డబ్బుకు లోటు లేదు కదా.
 *దేవుడు* = ఎవరు అమ్ముతారు . . . ?
ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది . . . ?
అందరి దగ్గర 100 కోట్లు వుంటాయి కదా . . . ?
 *భక్తుడు* = సరే ఇదే పాకలో ఉంటాను. రోజు మంచి తిండి తింటాను.
 *దేవుడు* = ఎక్కడా . . . ?
 *భక్తుడు* = ఈ వూళ్ళో అనేక హోటల్ వున్నాయి తిండికి లోటేమిటి ?
 *దేవుడు* = ఎవరు వండుతారు . . . ?
 *భక్తుడు* = హోటల్ కాకపొతే మంచి బియ్యం కొనుక్కొంటాం !
 *దేవుడు* = ఎవరు పండిస్తారు . . . ?
అందరి దగ్గరా డబ్బులు వుంటాయి కదా . . . ?
 *భక్తుడు* = అసలు నీ ఉదేశ్యం ఏమిటి స్వామి . . . ?
 *దేవుడు* = అందరి దగ్గరా అవసరానికి మించి డబ్బులు వున్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు ? అందరు కూర్చొని తిన్దామనుకొంటారు కదా ?
 *భక్తుడు* = నిజమే సామి నాకు అర్ధం అయ్యింది.
 *దేవుడు* = అందుకే కష్టే ఫలి అన్నారు.
కష్టానికి తగ్గ ఫలితమే రావాలి కాని అంతకు మించి వస్తే అనర్ధమే.
 *భక్తుడు* = సామీ నా కళ్ళు తెరిపించావు . . .
నాకు ఒక్కడికే 100 కోట్లు ఇవ్వు సామి . . . ! ఇంకెవరికి ఇవ్వకు . . .!
 *దేవుడు* = మీరు మారరురా . . . ! మారరు గాక మారరు . . . !
: భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాల్లని భార్యలుగా మీరు చేసుకున్నారు....
అది మీ ఖర్మ..

ఉచితం గా ప్రభుత్వారంగ సేవలు...

ఉచితం గా ప్రభుత్వారంగ సేవలు...

ఈ నెంబర్లకు కాల్ చెయ్యండి.. ఖర్చు లేకుండా సేవలు పొందండి...... సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదనో.. సంబంధిత విభాగానికి ఫోన్‌చేస్తే డబ్బులు అయిపోతాయామోనని భయపడాల్సిన పనిలేదు..
 155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
 100: ఎక్కడైనా ఏదైనా కొట్లాట జరుగుతున్నదా.. శాంతిభద్రతలను కాపాడాలి అంటే.. ఇలా పలు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే ఎంతో ఉపయోగం.
 101: ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సంబందిత స్థలం, వంటి వివరాలతో ఫోన్‌ చేయాల్సిన నెంబరు
📞 104: గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలను అందించేందుకు మొబైల్‌ వైద్య సర్వీసులను పిలిచేందుకు.
📞 108:  ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాంటే వైద్యసేవలకోసం.🏥🏥
📞 1090:  శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సరిగా పని చేయడంలేదా, దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలో తెలియదా, అయితే ఫిర్యాదు కోసం.
📞 1091: మీకు ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌ దృశ్యాలు కనిపించాయా? వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? ఇటువంటి వాటితో పాటు అత్తమామల హింసలను, అకతాయిల అగడాలను గురించి సమాచారం కోసం.
📞 1098:   6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా తప్పి పోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు. 
📞 1100:  మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా? దరఖాస్తు చేసుకున్న ధృవ పత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు కోసం.
📞 1500:  బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం
📞 133355:  విద్యుత్‌ సమస్యలకు సంబంధించి సమాచారం కోసం
📞 155321:  ఉపాధి హామీ పధకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా? కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే..
📞 155361:  ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
📞 1800-180-5232:  తపాల బీమాలో చేరాలనుంకటే వివిధ వివరాలకు..
📞 1800-200-4599: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోయినా, బస్సులలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా.. 
 1800-425-3536:
 రైతులకు పంటసాగులో సమాచారం కోసం
జాబ్స్ కి సంబందించిన సమాచారం అయిన,
హాస్పిటల్స్ కి సంబందించిన సమాచారం అయిన,
మంచి స్కూల్ కి సంబందించిన సమాచారం అయిన మీకు ఎలాంటి సమాచారం అయిన ఈ యాప్ ద్వారా మీరు పొందవచ్చు. 

మానవజన్మ విలువ ఎంత.?

మానవజన్మ విలువ ఎంత.?

రాళ్ళు కొట్టుకుని జీవించే రమేశ్ ఒక
రోజున తన పని చేసుకుంటూ ఉండగా
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని
గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు.

ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది
తరువాత ఆ రాయిని అదే పనికి
చాలా సార్లు వాడుకున్నది.

ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రఘు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ
రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే ప్రసాద్
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి
చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు
చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను
బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ
(పల్లీపట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు
సంతోషంతో ఆ రాయి ప్రసాద్ కి  ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు గోపీ  చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని
ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ
స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.

అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే నారయణ వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి
అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా
అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది
కదా అని వ్యాపారి నారయణ దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.

కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి పాండు ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ
రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి రాజు వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.💦💥💦

💦💥నీతి :-💦
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు
కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ
ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ
కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.
ఒకళ్ళు దాన్ని
పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని
గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ
రాబట్టుకున్నాడు.

అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో
అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి
అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి
ఉంటుంది. మానవ జీవిత పరమార్థం
తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ
జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
జీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం - జీవన గమనాన్ని
సాగిద్దాం.

అందరూ తప్పక,తప్పక చదవాల్సిన విషయం ఇది.
Everyone must read.....it inspires you most.

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.
కానీ ...ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.
ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.
చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.
తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.
కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు. వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.
పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము. మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను,మన సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై...వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......
ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు......పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే...... ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి
రాముడి గురించి చెప్పండి......వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే...ఇలాగేIIT ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి... పనికిమాలిన దద్దమ్మల్లా తీర్చి దిద్దకండి.

మన జాతికి కావాల్సింది...మార్కులు కాదు...మంచి పౌరులు.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అన్నము .... ధాన్యాలు

అన్నము .... ధాన్యాలు


మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో దేశం మొత్తం మీద ఒక్క తెలుగు వాళ్ళేఅన్నాన్ని తింటున్నారు. ఉత్తరాది వారికి రోటీలే అన్నం. దక్షిణాదిలో తమిళ, కన్నడ మళయాళీలు సాంబారు ప్రధానంగా ఉండే సాపాటు తీసుకుంటారు. వరి అన్నం తెలుగు వారికి ప్రధాన ఆహారం. వరి అన్నానికి కేలరీలు ఎక్కువ కాబట్టి, వరికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, ఆరికెలు ఇలాంటి ఆహార ధాన్యాలతోనూ అన్నం వండుకోవచ్చు.

అన్నాన్ని తినాల్సిన పద్దతి ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా ఉంది. కఠినంగా అరిగే పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తినాలని భావప్రకాశ వైద్యగ్ర౦థ౦లో పేర్కొన్నారు. తెలుగు వారి అన్నం తినే పద్ధతి ఇలానే ఉంటుంది. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుసలోనే మనం భో౦చేస్తున్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రా౦తాల ప్రజలు నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ము౦దు తిని, ఆ తరువాత అన్నంతో మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తింటారని కూడా ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ కనిపిస్తుంది. ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ము౦దు పూరీ లేదా పుల్కా ఇచ్చి ఆ౦ధ్రాభోజనం అని పిలవటం మొదలు పెట్టారు. ఇది అన్యాయ౦. తెలుగువాళ్ళకు పూరీ చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే లేదు.
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తెలివి తేటలు ఆధారపడి ఉన్నాయి.

అన్నం వలన ఆయువు, వీర్యపుష్టీ, బలం, శరీరకాంతి, పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక, అలసట తగ్గుతాయి. ఇంద్రియాలన్నీ శక్తిమంతం అవుతాయి. బియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. జ్వరంలో కూడా హోటల్ టీఫిన్లకన్నా జావ, లేదా మెత్తగా ఉడికించిన అన్నమే మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో జ్వరం వస్తే అన్నానికి బదులు ఇడ్లీ పెట్టాలని చెప్పలేదు. ఉదయం పూట మెతుకు తగలకూడదంటూ రోజూ టిఫిన్లను తినటం జీర్ణకోశాన్ని దెబ్బ కొట్టుకోవటమే అవుతుంది.

రాత్రిపూట వండిన అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు. తిన్నది వంటబట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధి తగ్గుతాయి. వేయించిన బియ్యాన్ని వండిన అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే, విరేచనాల వ్యాధిలో ఔషధంగా పని చేస్తుంది.వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉ౦టు౦ది. ఆయా ధాన్యాలను బట్టి కొద్దిగా హెచ్చు తగ్గులున్నప్పటికీ రాగి, జొన్న సజ్జ, గోధుమలతో వండిన అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉ౦టాయి.

అల్ల౦+ఉప్పు గానీ, మిరియాలు+ఉప్పుగానీ, ధనియాలు+జీలకర్ర+శొ౦ఠి గానీ మెత్తగా నూరిన పొడిని మొదటి ముద్దగా తినటం తెలుగు వారి సా౦ప్రదాయ౦. విందుభోజనాల్లో మొదట లడ్డూని వడ్డించినా దాన్ని మధ్యలో గానీ చివరికి గానీ తినడం మన పద్ధతి. వడ్డనంతా పూర్తయ్యాకే తినడం మానేసి, వడ్డించింది వడ్డించినట్టుగా తినే అలవాటు వలన స్వీటుతో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా సంక్రమించింది మనకి! భోజనం చివరి భాగంలో కఫం పెరుగుతుంది కాబట్టి,కఫాన్ని తగ్గించే పచ్చకర్పూరం, లవంగం వగైరా వేసిన తాంబూల సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగుస్తుంది. తమలపాకులకు ఔషధంలోని సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శరీర ధాతువులకు అందించే గుణం ఉంది. దీన్ని సర గుణం (వ్యాపించటం) అంటారు.

DONT WASTE FOOD.
GOOD NIGHT FRIENDS.

రాష్ట్రపతి ఎన్నిక విధానం

రాష్ట్రపతి ఎన్నిక విధానం


ఎమ్మెల్యే ఓటు విలువ = మొత్తం రాష్ట్ర జనాభా/రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యx1000
ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యే ఓట్ల విలువ/మొత్తం ఎంపీల సంఖ్య
ఈ ఫార్ములా ప్రకారం…ప్రతి ఎంపీ ఓటు విలువ 708గా లెక్కించ బడింది. అదే ఒక ఎమ్మెల్యే ఓటు విలువను ఆ రాష్ట్రంలోని జనాభా, రాష్ట్ర అసెంబ్లీ బలాన్ని బట్టి లెక్కిస్తారు. ఉదాహరణకు, యుపి లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ 208. సిక్కిం రాష్ట్రంలోనైతే ఎమ్మెల్యే ఓటు విలువ 7

గణాంకాలను బట్టి చూస్తే…

ఎన్‌డిఎ తన సంఖ్యా బలాన్ని నిలుపుకుంటే ప్రధాని మోడీ తనకు నచ్చిన వ్యక్తిని రాష్ట్రపతిగా ప్రకటించడానికి ఆయనకు 17404 (549441-532037) ఓట్లు మాత్రమే అవసరమవుతాయి.
2.ఆరు తటస్థ పార్టీలు గనుక విపక్షంతో జతకడితే, అపుడు వాటి మొత్తం ఓట్ల శాతం (391739+144302) ఎన్‌డిఎని మించిపోతుంది

Sunday, June 11, 2017

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ..

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ..


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో..

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞత కలిగ ఉండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.  నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక విచిత్రమైన భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి మారగలిగే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. అవి పెద్ద విషయాలే అయినా, మలుపులు జీవితంలో సహజమని గుర్తించు. ఇంకా పెద్ద సమస్యలు ఉంటాయని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో  ( Damn crazy movies! )

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!
... నాన్న

SHAR గురించి తెలియని విషయాలు

SHAR గురించి తెలియని విషయాలు


* అసలు SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHAR అంటే శ్రీహరికోట అని అర్ధం.....

* శ్రీహరికోట, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలుమార్గం లో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్లు దూరం లో ఉంది.

* శ్రీహరికోట అనేది చెప్పాలంటే ఒక ద్వీపం. ఒక పక్క సముద్రం, ఒక పక్క పులికాట్ సరస్సు ఉంటుంది. మనం ఎప్పుడూ వింటూ ఉండే Buckingham కెనాల్ కి ఒడ్డున ఉంటుంది.

* శ్రీహరికోట అనే ద్వీపం వైశాల్యం 44000 ఎకరాలు ఉంటుంది. అంటే మనం కట్టబోయే అమరావతి కన్నా కొంచెం పెద్దది. ఎక్కువ భూభాగం అడవులు ఉంటాయి. ఈ అడవులలో అడవి దున్నలు, పాములు, జింకలు వంటి వన్యప్రాణులు ఉంటాయి. ఎక్కువ ఆడవులు ఉండడం వల్ల వేసవి లో కూడా చల్ల గా ఉంటుంది.

* ఒకానొక సమయంలో రాకెట్ ను సైకిళ్ళ మీద ప్రయోగానికి తీసుకునివెళ్లే వారు. మొదటిగా సౌండింగ్ రాకెట్స్ ను ప్రయోగించేవారు.

* ఈ ప్రాంతం సముద్రం ఒడ్డున కోల గా ఉండడం వల్ల ఏమైనా అనుకోని పొరపాటు వల్ల రాకెట్ విఫలం అయితే సముద్రంలో పడిపోయేలా ఉంటుంది. సముద్రం లోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఉండదు.

* ఇక్కడ సముద్రం చాలా అందం గా ఉంటుంది. మన గోవా లో ఉన్నట్టు బాగా నీలం రంగు లో ఉంటుంది. అందులో పని చేసే వాళ్ళకి అప్పుడప్ప్పుడు వెళ్ళే అవకాశం ఉంది.

* సామాన్యులకు లోపలి కి వెళ్లే అనుమతి దొరకడం చాలా కష్టం. మన దేశ సరిహద్దు లో ఉండే CRPF, BSF జవానులు నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. మన దేశానికి గర్వకారణం అయిన రహస్యాలు వల్ల.....

* లోపలికి ఫోన్ కాదు కదా, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కూడా తీసుకువెళ్ళనియరు. మూడు చోట్ల CRPF జవానులు సోదా చేశాకనే లోపలికి పంపిస్తారు.

* ఇక్కడ ప్రస్తుతానికి రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వాటి చుట్టూ హై వోల్టాజ్  ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ నిత్యం ఉంటుంది. ఇంకొకటి నిర్మాణం లో ఉంది. అది పూర్తి అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది.

* ఒక లాంచ్ ప్యాడ్ నందు అసెంబ్లీ హాల్ (రాకెట్ ను తయారు చేసే చోటు ) కిలోమీటర్ దూరం లో ఉంటుంది. అసీంబ్లీ హాలు నుంచి రైల్వే ట్రాక్ వంటి వాటి మీద రెండు పెద్ద లారీలు రాకెట్ ను పాడ్ కు తరలిస్తారు.

* ఇంకో లాంచ్ పాడ్ నుంచి అసెంబ్లీ హాలు కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది. అంటే అసెంబ్లీ హాలు కదిలేలా తయారు చేశారు.

* సాధారణం గా మనం లాంచ్ పాడ్ చూసి దానికింద ఏమి ఉండదు అనుకుంటాం. కానీ దాని కింద త్రిభుజం బోర్లించినట్టు ఆకారం లో 200 అడుగులు లోతు  ఉంటుంది. కింద నీరు వచ్చేలా హై స్పీడ్ నాజిల్సు ఉంటాయి.  200000 లీటర్లు సరిపడా నీరు ఒకొక్క నాజిల్ నుంచి వస్తుంది. రాకెట్ వేడిని తట్టుకునేందుకు....

* ప్రయోగం జరుగుతున్నప్పుడు 7 కిలోమీటర్లు చుట్టు పక్కల ఏ ప్రాణి ఉండదు. ఉన్నా బ్రతకదు. లాంచ్ పాడ్ పక్కన రెండు భారీ లైటినింగ్ అరెస్ట్లు ఉంటాయి. అంటే పిడుగులు పడినా ప్యాడ్ కి ఏమి కాకుండా అవి తీసుకుంటాయ్.

* వాటికీ కెమెరాలు అమర్చబడి  ఉంటాయి. సాధారణ కెమెరా తో ఆ చిత్రాలను బంధించడం కుదరదు. ISRO సౌజన్యం లేనిదే ఆ చిత్రాలు బయటకి రావు.

* శాస్త్రవేత్తలు కూర్చుని ఉండే స్థలాన్ని కంట్రోల్ సెంటర్ అంటారు. అక్కడ VVIP కి మాత్రమే అనుమతి. ప్రయోగం పూర్తి అయిన వెంటనే ఒక అగ్నిమాపక దళం వచ్చి పరిస్థితులు అన్ని సక్రమం గా ఉన్నాయి అని తేల్చిన తర్వాతే అక్కడకి మనుషులను అనుమతిస్తారు.

* లాంచ్ ఆయిన ప్రతి సారి ప్యాడ్లకు పెయింట్ వర్క్ చేస్తారు. అంత వేడి వల్ల పెయింట్ అంత కరిగిపోతుంది.

* స్పేస్ మ్యూజయం లో అన్ని మోడళ్లను ప్రదర్శన కు ఉంచుతారు. అక్కడికి మొబైల్ ఫోన్ లను అనుమతిస్తారు. చాలా అబ్బురపరిచే విషయాలు ఆ ప్రదర్శన శాల లో ఇన్నాయి.

* చెప్పాలంటే ISRO సాటిలైట్ ను మాత్రమే తయారు చేస్తుంది. ఇక్కడ ISRO కింద దాదాపు 800 కంపెనీలు పని చేస్తాయి. ఒకొక్క పార్ట్ ఒక దగ్గర తయారు అవుతుంది. ISRO వాటి అన్నింటికీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది....

* దాదాపు 150 అడుగుల వెడల్పు లో ఒక భారీ antenna ఉంటుంది. అంటే మన డిష్ టీవీ కి ఉండే డిష్ లాగా అన్నమాట. దాని నుంచే రాకెట్ ట్రాకింగ్ అవుతుంది. అది కొంత దూరం వరకే పని చేస్తుంది. ఆ పరిధి దాటితే అండమాన్ దీవుల్లో ఇంకో ట్రాకింగ్ సిస్టం ఉంది. అక్కడి నుంచి సంకేతాలు అందుతాయి. అది కూడా దాటితే Antarctica సముద్రం లో ISRO కి ట్రాకింగ్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి కూడా సమాచారం అందుతుంది.

* ట్రాకింగ్ స్టేషన్ ఎపుడూ చాలా చల్ల గా ఉంచడానికి నిత్యం AC లు రన్ అవుతూనే ఉంటాయి. SHAR లోపల  ఒక చివర నుంచి ఇంకో చివరకి 40 కిలోమీటర్లు దూరం ఉండే రోడ్లు ఉంటాయి.

* అత్యంత భారీ దున్నపోతులు ఇక్కడ ఉంటాయి. ఒకసారి రాకెట్ ను తీసుకు వెళ్లే లారీ గోతి లో పడితే దున్నపోతులు పెట్టి లాగించారట...... సాయంత్రం 5 దాటితే ఇక్కడ ఎవరు ఉండరు ఒక్క ఎస్కార్ట్ పోలీస్లు తప్ప

ఇదండీ SHAR విశేషాలు. ఉపయోగం అనిపించేలా ఉంటె అందరికి Share చేయండి



Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

కార్తెలపై సామెతలు

కార్తెలపై సామెతలు

1.అశ్వని (ఏప్రిల్ – 14) '

అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
అశ్వని కురిస్తే అడుగు తడవదు.
2'.'భరణి' (ఏప్రిల్ – 27)

భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
భరణి ఎండకు బండలు పగులుతాయి.
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
3.కృత్తిక (మే – 11)

కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.
4.రోహిణి (మే – 25)

రోహిణి ఎండకు రోళ్ళు పగులును
రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.
5.మృగశిర (జూన్ – 8)

మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.
మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.
మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.
మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
మృగశిర కురిస్తే ముంగాలి పండును.
మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.
6.ఆరుద్ర (జూన్ – 22)

ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
ఆరుద్రతో అదనుసరి.
ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
ఆరుద్ర వాన ఆదాయాల బాన.
ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
ఆరుద్ర వాన అరుదు వాన
ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి
7.పునర్వసు (జులై – 6) :-

పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.
8.పుష్యమి (జులై – 20) :-

పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు
9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-

ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.
ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.
ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం
ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.
ఆశ్లేష వర్షం – అందరికి లాభం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
10.మఖ (ఆగస్టు – 17) :-

మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.
మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.
మఖా పంచకం సదా వంచకం.
మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.
మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.
11.పుబ్బ (ఆగస్టు – 31) :-

పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.
పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.
పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు
పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు
పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు
పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-

ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.
ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.
ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
ఉత్తర పదును ఉలవకు అదును.
ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం
ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు
13.హస్త (సెప్టెంబరు – 27) :-

హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.
హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.
హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
హస్తలో చల్లితే హస్తం లోకి రావు.
హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.

14. చిత్త (అక్టోబరు – 11) :-

చిత్త కురిస్తే చింతలు కాయును
చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.
చిత్తి ఎండకు బట్టతల పగులును.
చిత్తలో చల్లితే చిత్తుగా పండును.
ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.
చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.
చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.
15.స్వాతి (అక్టోబరు – 27) :-

స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
స్వాతి కురిస్తే భీతి కలుగును.
స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
స్వాతి వానకు సముద్రాలు నిండును.
స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.
స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.
16.విశాఖ (నవంబరు – 16) :-

విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.
విశాఖ కురిస్తే పంటకూ విషమే.
విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
విశాఖ విసురుతుంది.
17.అనూరాధ (నవంబరు – 20) :-

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది
అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.
18.జేష్ట్య (డిసెంబరు – 3) :-

జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును
19.మూల (డిసెంబరు – 16) :-

మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
మూల ముంచుతుంది
మూల కురిస్తే ముంగారు పాడు
మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
మూల మంటే నిర్మూల మంటాడు
మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.
మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.
20.పూర్వాషాడ (డిసెంబరు – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాబాధ్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాబాధ్ర ( మార్చి - 4 )

27.రేవతి ( మార్చి - 31 )

రేవతి వర్షం రసమయం – రమణీయం
రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే.
రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం
Satyavarapu Varalakshmi
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!


హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు.

*ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S*

*S-Silence( నిశ్శ‌బ్దం)....*

మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .

*A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)*

 అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్ర‌తి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.
1) నేనేమి కావాల‌నుకుంటున్నా.??
2)దాని కోసం నేను ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌??
3) అనుకున్న‌ది సాధించ‌డం కోసం నేను వేటిని వ‌దిలివెయ్యాలి? వేటిని కొత్త‌గా ఆహ్వానించాలి? ఇలా ప్ర‌తి రోజూ మ‌న‌లో మ‌నం మాట్లాడుకుంటూ….మ‌న‌లోని మార్పును మ‌న‌మే లెక్కించాల‌న్న మాట‌.!

*V-Visualization ( ఆత్మ సాక్షాత్త్కారం)…*

 మ‌నలోని భావాలకు మ‌న‌స్సులో దృశ్య‌రూపం ఇవ్వ‌డం. కాన్సియ‌స్ తో క‌ల‌లు క‌న‌డం అన్నమాట‌! ఉద‌యాన్నే మ‌న ల‌క్ష్యం అలా క‌ళ్ళ ముందు క‌న‌బ‌డితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌య‌త్నం చేస్తాం.

*E-Exercise–*

ఇది ప్ర‌తి ఒక్క‌రికి తెల్సిన విష‌య‌మే… కండ‌రాలు, న‌రాలు ఉత్తేజిత‌మై…కొత్త శ‌క్తిని ప్రేరేపిస్తుంది.


*R-Reading–*

రోజుకు 10 పేజీలు చ‌ద‌వడాన్ని అల‌వాటు చేసుకోవాలి..ఇది మ‌నలోని అంత‌ర్గ‌త శ‌క్తిని ప్రేరేపిస్తుంది. ఫ‌లానా బుక్ చ‌ద‌వాల‌ని లేదు..మీకు తోచిన బుక్ ను చ‌దువుతూ పోండి.

*S-Scribing( రాయ‌డం)-*

 ఉద‌యం లేవ‌గానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియ‌ని పాజిటివ్ వేవ్స్ వ‌స్తాయ్.

*సో….ఈ ప‌నుల‌న్నీ ఉద‌యం 8 లోపే చేయాలి! ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మ‌ల్ని నిద్ర‌లేపండి.*
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఏకాగ్రతా రహస్యం

ఏకాగ్రతా రహస్యం :


భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరణకు  వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం – ఇదీ మనస్సు స్వభావం. ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు.

ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.

స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

మేకపోతు గాంభీర్యం

మేకపోతు గాంభీర్యం

“అహమేకశత వ్యాఘ్రాన్/ పంచ వింశతి కుంజరాన్
ఏక సింహం నభక్ష్యామి/ గడ్డం వపనముత్యతే”

ఈ సంస్కృత చాటువు మనందరికి తెలిసిన “మేక పోతు గాంభీర్యం” అనే తెలుగు సామెతకు సంబంధించిన కథ. ఈ కథ తెలుగువారి ఇంటింటి సరస్వతి అయిన  “పెద్దబాలశిక్ష” లో  ఉంది.  లోపల బెరుకు,బైట కరుకు,కలిగి డాంబికంగా మాట్లాడేవారి విషయంలో ఈ సామెతని ఉపయోగిస్తారు. “వాడు చూడండి ఎలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడో” అని.
ఇదీ కథ :
ఒక కొండ పరిసరాలలో మేస్తున్న తెలుగు మేకల మందలోంచి ఒక మేకపోతు వేరుపడిపోతుంది. తెలుగు మేక  అని ఎందుకన్నానంటే ఆ శ్లోకంలో గడ్డమనే తెలుగు పదం ఉండుటవల్ల. అదే సమయంలో వాన వస్తుంది. వాన నుంచి తప్పించుకోవాలని అది ఒక గుహలోకి వెళ్తుంది. వెళ్ళిన తరువాత తెలిసింది అది సింహపు గుహ అని.బహుశా జంతు కళేబరాలనుచూసివూహించుకొనివుంటుంది . అదృష్టవశాత్తు అప్పుడు సింహం గుహలో లేదు. కొంత సమయం గడిచిన పిదప సింహం గుహలోనికి  వచ్చింది. లోపల వేరే జంతువు వున్నట్లు తెలుసుకొని ప్రాణభయం తో గుహ  బైటే నిలిచింది . లోపల ఉన్న మేకపోతు సింహాన్ని చూసి భయాన్ని దిగమ్రింగి  గడ్డం మాత్రం సింహానికి కనబడేటట్టు గుహ బైటికి పెట్టి ద్వారము వద్ద నున్న సింహంతో వచ్చీ రాని సంస్కృతం లో  పై శ్లోకం  చెప్పింది.  దాని అర్థం ఈ క్రిది విధంగా వుంది :(తాత్పర్యం వ్రాస్తున్నాను)
నేను ఇప్పటికి ఒక నూరు పెద్ద పులులను ఇరవైఐదు ఏనుగులను తిన్నాను ఇంకా ఒక సింహాన్ని తిని గాని ఈ గడ్డం గీయించుకోనని ప్రతిన బూనినాను. సమయానికి నీవు వచ్చినావు అని అన్నది.
ఆ మాటలు విన్న సింహం  భయపడి తోక ముడుచుకొని పారి పోయింది . “బ్రతుకుజీవుడా” అనుకొని మేకపోతు కూడా అక్కడి నుంచి పారిపోయింది .
కాబట్టి మేకపోతు గాంభీర్యము మనిషికి అవసరమే కానీ ఆచరణలో దానిని ఉంచేటపుడు తగిన ధైర్యము సమయస్పూర్తి ఎంటొ అవసరము. అందుకే భర్తృహరి (ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత)
ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్
భూప సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ మాజి బా
హాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాం
ఛాపరివృత్తియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్  

అన్నాడు. ఇది నేడు వ్యక్తిత్వ వికాసమునకు (personality Development) అన్నపేరుతో చెప్పే ఎన్నోసూత్రములు ఈ పద్యములో ఇమిడి వున్నాయి.
ఆపదలో ధైర్యము, అన్యసంపద మీద ఆశ, సభాగోష్ఠులలో వాక్చాతుర్యము, యుద్ధములైతే బాహుబలము  అంటే ఇక్కడ వాగ్యుద్ధాలే కాబట్టి తార్కిక వాదనాపటిమ, ఋజుమార్గములో కీర్తి గాంచవలెనను తపన, నిరంతర జ్ఞాన సముపార్జన సజ్జనుల లక్షణము .
ఇంతకన్నా స్పూర్తి దాయకమైన మాట ఏముంటుంది చెప్పండి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

టన్నుల కొద్దీ బరువుండే విమానం ఆకాశంలో ఎలా ఎగరగలదు?

ప్రశ్న : టన్నుల కొద్దీ బరువుండే విమానం ఆకాశంలో ఎలా ఎగరగలదు?


జవాబు : ప్రయాణికులు లేని సమయంలో సాధారణ బోయింగ్‌ 787 తరహా విమానం దాదాపు 130 టన్నుల బరువుంటుంది. అందులో ఇక ప్రయాణికులు, సిబ్బంది, బ్యాగేజీ ఇతర వస్తు రవాణాను కలుపుకుంటే ఇలాంటి విమానాలు సుమారు 250 టన్నుల బరువుంటాయి. ఇంత వరకు తయారైన ప్రయాణికుల లేదా రవాణా సంబంధ విమానాల్లో యాంటనవ్‌ మ్రియా అన్నింటికంటే బరువైంది. దీని బరువు సుమారు 650 టన్నులు. ఇలాంటి విమానాలయినా, ఇంతకంటే ఎక్కువ బరువుండే సాటర్న్‌-వి లాంటి అత్యంత బరువైన విమానాలు, ఇంకా పైకి దూసుకెళ్లే రాకెట్లు... అన్నీ భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాల్లోకి వెళ్లేందుకు ఇంధనంలో ఉన్న రసాయనిక శక్తిని, యాంత్రిక శక్తిగా మార్చుకోవడమే కారణం. ఇందుకు తగిన విధంగా విమానాల్లో రెక్కలు, టర్బోజెట్‌ ఇంజన్లు, విమాన రూపు రేఖలు సహకరిస్తాయి. బెర్నౌలీ సూత్రాలు, న్యూటన్‌ మూడో సూత్రపు సర్దుబాట్లు విమానాల గగన విహారాలకు తోడ్పడతాయి. అలాగే రాకెట్‌ విషయంలో కూడా రాకెట్‌ ఇంధనం మండటం ద్వారా విడుదలైన వాయువులు కిందున్న గొట్టం ద్వారా విపరీతమైన ద్రవ్య వేగంతో రావడం ద్వారా రాకెట్‌ పైకెగురుతుంది. ఇందులో కూడా న్యూటన్‌ గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. భూమ్యాకర్షణను అధిగమించేందుకు శక్తి కావాలి. ఆ శక్తి విమానాల్లో, రాకెట్లలో వాడే ఇంధనాల్లో ఉంటుంది.



ప్రశ్న: విశ్వం ఉష్ణోగ్రత పెరుగుతూ ఉందా?
జవాబు: విశ్వంలోని నక్షత్రాలన్నీ వెలుగుతోపాటు అంతరిక్షంలోకి కోట్లాది సంవత్సరాల నుంచీ వెలువరిస్తున్న ఉష్ణశక్తి వల్ల విశ్వం యొక్క ఉష్ణోగ్రత తప్పకుండా కొంతమేర పెరిగిందని అనుకోవడం సహజం. కానీ ఈ విషయంలో విశ్వం వ్యాపనం చెందుతుందనే సత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నక్షత్రాలు విడుదల చేస్తున్న ఉష్ణశక్తి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. 14 బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వం ఏర్పడడానికి కారణమైన బిగ్‌బ్యాంగ్‌ వల్ల ఏర్పడిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. 2008వ సంవత్సరంలో నక్షత్ర శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కెల్లా అతి పెద్దవి, సమర్ధవంతమైనవి అయిన టెలిస్కోపుల ద్వారా పదకొండు బిలియన్‌ (బిలియన్‌ = ఒకటి తర్వాత 9సున్నాలు) కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కార్బన్‌మోనాక్సైడ్‌ అణువుల ప్రవర్తనను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఆ అణువుల పరిసరాల ఉష్ణోగ్రత మైనస్‌ 264 డిగ్రీల సెంటిగ్రేడ్‌ అని తెలిసింది. అంటే ప్రస్తుతం విశ్వం ఉన్న ఉష్ణోగ్రత కన్నా 72 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఎక్కువ అని. అంటే విశ్వం వ్యాపనం చెందే కొలదీ దాని ఉష్ణోగ్రత తగ్గుతుందనే కదా!

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Friday, June 9, 2017

గొట్టపు మాత్ర వెజ్జా?నాన్‌వెజ్జా?

గొట్టపు మాత్ర వెజ్జా?నాన్‌వెజ్జా?


సుస్తీ చేసినపుడు డాక్టరు రకరకాల మాత్రలు ఇస్తుంటారు. ఇందులో గొట్టపు మాత్రలు కూడా ఉంటాయి. మనం ఎన్నోసార్లు వేసుకున్నాం కూడా. అయితే మనం వేసుకొనే గొట్టపు మాత్రలు వెజ్జా? నాన్‌వెజ్జా? ఇదెక్కడి ప్రశ్న అనుకుంటున్నారా... మీరు చదివింది కరెక్టే. పారదర్శకంగా ఉండే క్యాప్యూల్స్‌ (గొట్టాల్లో) లోపల మందు మిశ్రమం నింపుతారు. అల్లోపతితో పాటు ఆయుర్వేదంలోనూ ఈ గొట్టాల వాడకం విరివిగా ఉంది. ఈ క్యాప్యూల్స్‌ను ‘గెలాటిన్‌’తో తయారు చేస్తారు.

గెలాటిన్‌ ఎలా తయారు చేస్తారంటే.

గెలాటిన్‌లో కొలాజెన్‌ ఉంటుంది. ఇది ఎముకల్లో, మృదులాస్థిలో ఉంటుంది. భారీ జంతువుల ఎముకలను, కీళ్లను, ఇతర భాగాలను ఉడికించడం ద్వారా గెలాటిన్‌ తయారుచేస్తారు. అందుకే ఇది నాన్‌వెజ్‌. రోగకారక వైరస్‌లు గెలాటిన్‌లో ఉండే అవకాశాలుంటాయని, విరేచనాలు, కడుపుబ్బరం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తు న్నారు. పైగా మతపరమైన విశ్వాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గెలాటిన్‌ క్యాప్సూల్స్‌కు బదులుగా... పూర్తి వెజ్‌ క్యాప్సూల్స్‌ను వాడకంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చెట్ల నుంచి తీసిన ‘సెల్యులోజ్‌ (గుజ్జు)’ద్వారా క్యాప్సూల్స్‌ను వాడేలా నిబంధనలను మార్చే సమగ్ర విధాన రూపకల్పన నిమిత్తం ఔషధ పరిశ్రమ, ఇతర నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడానికి కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కమిటీని కూడా వేసింది. గెలాటిన్‌ను సౌందర్య సాధనాల్లో అధికంగా వాడతారు*            

గెలాటిన్‌ చవక అయినప్పటికీ ఆరోగ్యపరంగా, మతపరమైన విశ్వాసాల దృష్ట్యా ఇక కొనసాగించకూడదని కేంద్రం భావిస్తోంది
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!

మరణించిన వారిని మళ్లీ బతికిస్తారట!


‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః..
ధ్రువం జన్మ మృతస్య చ..’’    – భగవద్గీత

👉పుట్టినవాడు మరణించక తప్పదు.. మరణించిన వారు మళ్లీ ఇంకో రూపంలో ఎక్క డో ఒకచోట పుట్టక తప్పదు అంటుంది భగవ ద్గీత. అయితే ఇది 21వ శతాబ్దం. గతకాలపు నమ్మకాలను, ప్రకృతి సహజమని భావించే అంశాలనూ టెక్నాలజీతో సవాల్‌ చేస్తున్న కాలమిది. దీనికి చావు ఎందుకు అతీతంగా ఉండాలని అనుకుందో ఏమో.. ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తున్న బయోక్వార్క్‌ సంస్థ. చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తామని ప్రక టించింది. ఇది కూడా ఎప్పుడో భవిష్యత్తులో కాదు. ఏడాది తిరక్కముందే ఈ ప్రయోగం పూర్తవుతుందని అంటోంది.

చనిపోయిన వాళ్లు మళ్లీ లేచి వచ్చేస్తే.. ఇది కలికాలం కాక మరేమవుతుంది?

బయోక్వార్క్‌ ఏం చేస్తుందో..? దాని ఫలి తాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు అసలు చావు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. వైద్య శాస్త్ర నిఘంటువు ప్రకారం.. గుండె కొట్టుకోవడం మొద లుకుని మెదడు పనిచేయడం వరకూ అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవ డాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మిగిలిన అవయవాల మాట ఎలా ఉన్నప్పటికీ మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవ డాన్నే చావు అని నిర్ణయిస్తారు.

ఇలా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేంచేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించామని అంటోంది బయోక్వార్క్‌. దక్షిణ అమెరికా దేశాల్లో ఒకదానికి చెందిన వ్యక్తిపై 6 నెలల్లో ఈ ప్రయో గం జరుగుతుందని బయోక్వార్క్‌ సీఈవో ఇరా పాస్టర్‌ అంటున్నారు. సాధారణ ప్రయోగాల మాదిరిగా జంతువులపై ప్రయోగాలేవీ జరపకుండా నేరుగా మానవులపైనే ఈ ప్రయోగం జరగనుండటం విశేషం.

మూలకణాల చికిత్స.

👉బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేలా చేసేందుకు బయోక్వార్క్‌ చేస్తున్న ప్రయోగంలో మూలకణాలదే కీలకపాత్ర. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పించడంతో బయోక్వార్క్‌ పద్ధతి ప్రారంభమవుతుంది. రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్‌టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్‌ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్‌ నాడిని లేజర్‌ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజులపాటు చేస్తే అతడి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుం దని బయోక్వార్క్‌ అంచనా.

భారతీయ వైద్యుడి సహకారం..

👉బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తులను మళ్లీ బతికిస్తామన్న బయోక్వార్క్‌ ప్రయత్నానికి హిమాన్షు బన్సల్‌ అనే భారతీయ వైద్యుడు సహకారమందిస్తున్నాడు. గత ఏడాది మేలో హిమాన్షు భారత్‌లోని ఉత్తరాఖండ్‌లోనే ఈ ప్రయోగాలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తామని, అనుమతివ్వమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు దరఖాస్తు చేశారు కూడా. అయితే ఈ విజ్ఞప్తిని ఐసీఎంఆర్‌ నవంబర్‌లో తోసిపుచ్చింది. హిమాన్షు ప్రయోగాలకు అవసరమైన పెప్‌టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లో బయోక్వార్క్‌ ముందుకు రావడం గమనార్హం. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడు. కాకపోతే కళ్లు కదపడం.. లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు. కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందన్నది మాత్రం చెప్పలేం!  

రెగ్యులర్ గా రక్త దానం చేయడం వలన కలిగే అధ్బుతమైన ఫలితాలు
ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు. సాధారణంగా రక్తదానం చెయ్యడం వలన ఒంట్లో శక్తి పోయి నీరసం వస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకే రక్త దానం అనగానే దూరంగా ఉంటారు. కాని దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా తప్పక రక్త దానం చేస్తారు.

రక్తం పోయి కొత్త రక్తం రావడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువుగా ఉంటుంది.

రెగ్యులర్ వ్యవధిలో రక్త దానం చేయడం వలన శరీరంలో ఇనుము యొక్క శాతం క్రమబద్దం చేయబడతుంది.

గుండె పోటు నుంచి దూరంగా ఉంచుతుంది.

కొవ్వు తగ్గి… బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

శరీరం ఫిట్ గా ఉంటుంది.

కాలేయ, ఊపిరితిత్తుల, జీర్ణాశయ సంబందించిన క్యాన్సర్లను దూరం చేస్తుంది.

ముక్యంగా సాటి మనిషికి రక్తదానం వలన ప్రాణం నిలబడితే… మనం ప్రాణ దానం చేసినట్టే కదా…

రెగ్యులర్ గా రక్త దానం చేయడం వలన కలిగే అధ్బుతమైన ఫలితాలు తెలుసుకున్నాము కాబట్టి, ఇది అందరికి తెలియజేసి ఈ మంచి పనిలో ఒక చేయి వెయ్యండి..

రాగి చెంబులో నీరు ఎందుకు తాగాలంటే

రాగి చెంబులో నీరు ఎందుకు తాగాలంటే.. 12 కారణాలు ఉన్నాయ్...*


మన దేశంలో శతాబ్దాలకు మునుపే నీరును శుభ్రపరిచేందుకు రాగిప్రాతలు వాడేవారు. రాగి చెంబులతో నీరును త్రాగేవారు. మరి పురాతన కాలం నుంచి రాగి చెంబులు వాడటానికి కారణాలు లేకపోలేదు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం..........

సూర్యకిరణాలు రాగిపాత్రలపై పడినపుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయి. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు దాదాపుగా దూరంగా ఉండొచ్చు. శరీరంలో కాపర్‌ నిల్వలు తగ్గిపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య వస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్‌ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్యలను నివారించవచ్చు.

అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితముంది. అలాగే మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలీన్‌ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది. పైగా నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

నీటి ద్వారా వ్యాపించే డయేరియా వంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్‌ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గిస్తుంది. ఎముకలు పటిష్టత ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను నివారించడంలో రాగి పాత్రలో నీళ్ళు ఎంత గానో ఉపయోగపడతాయి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ప్రశ్న: వర్షం ఇతర గ్రహాల మీద కూడా పడుతుందా?

ప్రశ్న: వర్షం ఇతర గ్రహాల మీద కూడా పడుతుందా?


జవాబు: ఒక గ్రహం మీద వర్షం పడుతుందా, లేదా? అన్న విషయం ఆ గ్రహం పరిభ్రమణ కాలంపై ఆధారపడి ఉంటుంది. భ్రమణాక్షం పరిభ్రమణ కక్ష్య ఉపరితలానికి చేసే కోణాన్ని బట్టి, ఆ గ్రహం మీదున్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రుతువులకు కారణం కేవలం భ్రమణాక్షానికి, పరిభ్రమణ కక్ష్యోపరితలానికి మధ్య కోణమే. ఇది సున్నాగా ఉన్నా లేదా 90 డిగ్రీలు ఉన్నా రుతువులు తక్కువ. మన భూమికి ఉన్న కోణం సుమారు 23 డిగ్రీలు. అందువల్లే భూమికి ఆరు రుతువులు ఉన్నాయి. బుధగ్రహానికైతే అసలు రుతువులే లేవు. రేయింబవళ్లు, ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాలున్నాయి. ఆక్సిజన్‌ వర్షం, సోడియం వర్షం సంధ్యా సమయంలో వస్తాయి. శుక్రగ్రహం మీదైతే పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం అవుతాయి. ఇక్కడ కూడా భ్రమణాక్షానికీ, కక్ష్యా ఉపరితలానికీ ఉన్న కోణం చాలా స్వల్పం. కానీ రేయింబవళ్లు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల దాని పగలు, రాత్రి విస్తారం దాదాపు ఆరు నెలలు ఉంటుంది. అందువల్ల సంధ్యా సమయాల్లో అక్కడ కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ వర్షాలు పడతాయి. కుజ గ్రహం మీద నీటి ఆవిరి లేదు. అనేక ఉష్ణోగ్రతల్లో దాని వాతావరణంలో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌లు వాయురూపంలోనే ఉంటాయి. మిగిలిన సుదూర గ్రహాల ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉండటం వల్ల వాతావరణం వాయురూపంలోనే ఉంటుంది. అది ధ్రవీభవించి వర్షాలుగా మారటం కుదరదు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends



వర్షాకాలంలోనే జలుబెందుకు?

జలుబు, దగ్గులాంటివి వర్ష, శీతకాలాల్లోనే ఎందుకొస్తాయి. మిగిలిన కాలాల్లో ఎందుకు రావు?

 జలుబు సాధారణంగా వైరస్‌ వల్ల వస్తుంది. వాతావరణంలోనూ, తాగే నీళ్లలోనూ, దుమ్మూధూళి కణాలపైన వైరస్‌ ఉంటుంది. బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్‌లు వృద్ధి కాలేవు. మరో మాటలో చెప్పాలంటే జీవ కణాల లోగిట్లో కాకుండా బయట ఉంటే వైరస్‌లు దాదాపు నిర్జీవ పదార్థాల కోవకే చెందుతాయి. ఎండా కాలంలో విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు వాటిపై ఆధారపడే వైరస్‌లు కూడా తక్కువగానే ఉంటాయి. నీటి ఎద్దడీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడపడితే అక్కడ తడి ఉండదు. అందుకే వేసవిలో వైరస్‌ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ. కాబట్టి జలుబు కలిగించే రైనో వైరస్‌ల ప్రభావం తగ్గుతుంది. వర్షాకాలంలో వర్షపు నీరు వివిధ పదార్థాల్ని మోసుకెళుతుంది. అవి తాగునీటి వనరుల్నీ కలుషితం చేస్తాయి. వైరస్‌ల వ్యాప్తికి దోహదపడతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా, దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది. తద్వారా వైరస్‌ల వ్యాప్తీ ఎక్కువే.

గణితం అంటే ఆలోచనా పద్ధతి


గణితం అంటే ఆలోచనా పద్ధతి

గణితం అన్ని సబ్జెక్టుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రక్రియకు మూలం అంటారు. గణితం మనం ఏ విధంగా క్రమబద్ధంగా ఆలోచించాలో చెబుతుంది. ఈనాడు గణాతాన్ని సమస్యా పరిష్కారానికి వేదిక అంటున్నారు. గతంలో కన్నా ఇప్పటికి తేడా ఏమిటంటే?
గతంలో గణితాన్ని ఎక్స్‌ర్‌సైజ్ కోసం ఉపయోగించారు. సమస్యను ఎలా పరిష్కరించాలో నియమితమై ఉంటుంది. ఆలోచనలో కలిసిన సమస్యా పరిష్కారం వల్లనే ఈనాడు సమస్యలకు విరుగుళ్లు దొరుకుతాయి. ఈనాడు దీన్ని కాల్పనికమైన సమస్యా పరిష్కారం అంటున్నారు. అంటే ఆలోచన కలిసిన సమస్యా పరిష్కార విధానం కాబట్టి విద్యార్థి తనదైన కొత్త ఆలోచనలు చేయటం జరుగుతుంది.
ఒక కొత్త ఆలోచనతో సమస్యను పరిష్కరించటాన్ని క్రియేటీవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఇదివరకు నలుగురు నడిచిన బాటపైన కాకుండా కొత్త బాటను వేసుకుని దానిపై నడుచుకుంటూ గమ్యాన్ని చేరాలి. కొత్త బాటను ఎలావేయాలి.. దానిపై ఎట్లా నడవాలి? గమ్యాన్ని ఎట్లా చేరాలి?
గమ్యాన్ని చేరుతున్నప్పుడు అది సరైన బాట అవునా? కాదా? అని నిశితంగా మూడు రకాలుగా పరీక్షిస్తాడు. ఒకటి- ఎత్తుగడ సమస్య పరిష్కారానికి దారి చూపుతుందా? లేదా? రెండవది- ఆ ఎత్తుగడ కొన్ని లాండ్‌మార్క్‌లను నిర్ణయించగలుగుతుందా? లేదా? మూడవది- అనుకున్న గమ్యానికి చేరుకున్నామా? లేదా? క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే- ఆలోచనను కూడా అది క్రమంగా చేసేస్తుంది. ఇది మ్యాథమ్యాటికల్ థింకింగ్. ఈనాడు క్రియేటీవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తరగతి గదిలో ఎందుకు చెబుతున్నారంటే ప్లాన్ వేయటం ఎంత ప్రధానమో, మధ్యలో దాన్ని చూసుకోవాలి. అది అయిన తర్వాత దాన్ని ఫైనల్ అవాల్వింగ్ చేస్తారు. అంటే అది అనుకున్న మనిషికి చేరిందా? లేదా?
అందుకే
మ్యాథ్స్‌ను- 'అన్ని సబ్జెక్టులకు మూలం' అని అంటారు. ప్రతి సబ్జెక్టుకు ఈ మూలాలను అన్వయించవచ్చు. దానికి ఆరు అడుగులు వేయాలి.
1. సమస్యను అర్థం చేసుకోవటం
2. సమస్యను అర్థం చేసుకోవటానికై ఎత్తుగడలను నిర్ణయించాలి
3. కనుక్కోవలసిన విషయానికి తక్కువ స్టెప్స్ ఉండాలి అంటే మార్గం దీర్ఘంగా ఉండకూడదు
4. వచ్చిన సమాధానం సమాజంలో ఒప్పించబడాలి
5. దీనికి కావాల్సిన క్యాలిక్యూలేషన్స్, సాధనాలు ఏమిటి?
6. దీనిలో ఎక్కడ క్రాసింగ్స్ ఉంటాయి? ఎన్ని క్రాసింగ్స్ ఉన్నాయి? ఈ సమయంలో కరెక్ట్ ఛాయిస్ ఎట్లా తీసుకోవాలి? అందుకే గణితం ఆలోచించే పద్ధతిని చూపిస్తుంది.

మధ్యతరగతి మా రాజులం ! GOVT.కి గొర్రెలం

మధ్యతరగతి మా రాజులం ! GOVT.కి గొర్రెలం

ఎందుకంటే...
రూపాయి బియ్యం తినలేం.
50 రూపాయలకి బియ్యం కొనలేం
 మున్సిపల్ నీళ్ళు తాగలేం.. మినరల్ వాటర్ కొనలేం
 ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..
కలల ఇల్లు కట్టుకోలేం
 ప్రభుత్వ బడికి పంపలేం..
కార్పొరేట్ ఫీజులు కట్టలేం
 సర్కారు దవాఖానా కు పోలేం..
కార్పొరేట్ బిల్లులు కట్టలేం
 సిటీ బస్సుల్లో వెళ్ళలేం..
బండికి పెట్రోలు కొనలేం
ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!
కులం పోవాలని చెప్పేది మనమే..
కులం చూసి ఓటు వేసేది మనమే
అవినీతి పోవాలనేది మనమే..
అవకాశం వస్తే అవినీతిని సమర్ధించేది మనమే.
ఇంటికో భగత్ సింగ్ పుట్టాలని చెప్పేది మనమే..
మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే.

మార్పు రావాలని చెప్పేది మనమే.. అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే.
అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే వెర్రి గొర్రెలుగా మిగిలిపోతున్నాం..!
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఏరువాక_పూర్ణిమ

ఏరువాక_పూర్ణిమ


  • వ్యవసాయం ప్రదానం అయిన మన దేశంలో అన్న దాతలు ఆనందముగా జరుపుకునే పండగ..
  • ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం లో (మే- జూన్) పౌర్ణమి తిది నాడు దీనిని జరుపుతారు.. కృషి పూర్ణిమ (కృషి అంటే వ్యవసాయం), హాల పూర్ణిమ (హలం అంటే నాగలి), అని కూడా అంటారు.*
  • రైతులు వ్యవసాయం భూముల్లో, వ్యవసాయ పనిముట్లలో, పశు సంపద లో దైవత్వం చూసుకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది..
  • ఏరు అంటే నాగలి, ఏరువాక అంటే దుక్కిదున్నడం ప్రారంభం చేసే రోజు అని.. జ్యేష్ఠ మాసం లో (మే-జూన్) గ్రీష్మ ఋతువు లో (సమ్మర్) పౌర్ణమి రోజున తొలకరి వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ప్రారంభం ఆవుతాయ్..*
  • మన శాస్త్రాలు జ్యేష్ఠ మాసం పొలం దున్నడానికి అనువైనది అని ఎన్నో వేల సం, క్రితమే నిర్ణయించాయి..
  • ఉత్తరభారతం లో ఉద్వవృషభ యజ్ఞం (ఎడ్లు ను పూజించడమ్) ఇదే రోజు చేస్తారు. అలాగే సీతాయజ్ఞం (సీత అంటే నాగలి తో దున్నినపుడు వస్తున్న గీత) కూడా ఇదే రోజు చేస్తారు. శుద్దోధన మహారాజు రైతులకు ఈ రోజున బంగారు నాగళ్ళు బహుకరించేవారని  లలితావిస్తరం గ్రంధం చెప్తోంది..
  • అధర్వణ వేదం లో దీనిని అనడోత్సవం అని పిలిచేవారు, హాలకర్మ, మేదీని ఉత్సవం, భూమిపూజ అంటూ పశువులను, నాగళ్లను పూజించేవారు
  • భారతీయ వ్యవసాయ గ్రంధాలు అయిన బృహత్సంహిత, కృషిపరాసరం లో ఈ పూజల గురించి ఉన్నాయ్.
  • మన భారతీయ సంస్కృతిని పరిరక్షించడం లో గ్రామీణ అన్నదాతలది ఎనలేని పాత్ర..
  • ఇలా మనకు వ్యవసాయం లో చేదోడుగా ఉంటున్న పశువులకు, పనిముట్లకు కూడా కృతజ్ఞత లు తెలుపుతూ పూజించే సంస్కారం ఏ దేశం లో ఉంది?? ఏ మతం లో ఉంది?? ఒక్క భారత్ లో తప్ప, హిందువులలో తప్ప..
  • మన అందరికి మెతుకు పెట్టి బతుకు నిచ్చే రైతు సోదరులు కి ఈ రోజు పండుగ రోజు
  • రైతు క్షేమమే దేశ క్షేమమ్
  • మన నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళడానికి మనకోసం పగలు రాత్రి కష్టపడుతున్న రైతన్నలు కు ఈ సంవత్సరం పంటలు బాగా పండి, గిట్టుబాటి ధర వచ్చి వారు సుఖంగా బ్రతకాలని కోరుతూ...
  • అన్నదాతలకు,శ్రేయోభిలాషులకు, మిత్రులకు ఏరువాక పూర్ణిమ   శుభాకాంక్షలు...
అభినందనలతో............
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

  • 1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
  • 2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
  • 3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
  •  4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
  •  5. కక్ష కన్నా క్షమ గొప్పది క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
  •  6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
  •  7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
  •  8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
  • 9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
  •  10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
  • 11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
  • 12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
  • 13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
  •  14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
  •  15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
  • 16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
  • 17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
  • 18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
  •  19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
  •  20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
  • 21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
  • 22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
  • 23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
  • 24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
  • 25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
  • శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
  •  ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
  •  నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Wednesday, June 7, 2017

అమ్మ - నాన్న

కళ్ళు మూసుకుని ప్రేమించేది *ప్రియురాలు*
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది *స్నేహితురాలు*
కళ్ళు ఉరిమి ప్రేమించేది *భార్య*
కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"*
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న.
నాన్నకి అంకితం*
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది - జీవనం నాన్నది.*
ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత - నాన్న బాధ్యత.*
పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
నడక అమ్మది - నడవడిక నాన్నది.*
తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన-నాన్న ఆచరణ*
అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
But... కానీ ....
నాన్న ప్రేమను నువ్వు *నాన్నవు*అయ్యాకే తెలుసుకోగలవు...




 కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న
నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు
కొడుకు :i love u నాన్న
నాన్న :i love u too ra చెపుతూ
 ఏడ్చాడు
Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు
కొడుకు :మా నాన్న ఎక్కడా
ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !
కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా
కొడుకు :i miss you నాన్న
మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న


I love you నాన్న



Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం

ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం


ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు . ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగు ను చిలికీ పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే . కాని కమ్మని గడ్డ పెరుగు ను వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగ ను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు . ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం .

ఆధునిక భారతం లో - పెరుగు వాడకం

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారం లో మజ్జిగ ను పూర్తిగా మానేశారు. రోజూ రెండు పూటలా పెరుగు ను మాత్రమే వాడుతున్నారు. పెరుగు ను చిలికి వెన్న తీసి మజ్జిగ ను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి . కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నము లో పెరుగు ను కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసి పోతున్నారు. అయితే పెరుగు ఆయుక్షిణం. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజూ రోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతు బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగ ను తయారు చేసి వాడడం కన్నా పెరుగు ను వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మజ్జిగ లో 5 రకాలు

1 మధితము అనే మజ్జిగ: పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగ ను మధిత మజ్జిగ అంటారు . ఇది చిక్కగా జిడ్డు గా ఉంటుంది ఈ మజ్జిగ ను ఆహారం లో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుక కు రుచి తెలియక పోవడం , మూత్రము ఆగిపోవడం , నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది . ఈ రకమైన మజ్జిగ ను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రిష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.

2 మిళితమను మజ్జిగ : పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరం లో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తం లో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.

3 గోళము అను మజ్జిగ : ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే వీర్య వృద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది . కంటికి మంచి మేలు చేస్తుంది . ఉదరము లో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫ రోగము ఆమ రోగము పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్షం బుుతువులయందు తీసుకోవాలి .

4 షాడభము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఇది శ్లేష్మ రోగాలను , గుల్మ రోగాలను , రక్త మూల వ్యాధి ని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.

5 కాలశేయము అను మజ్జిగ : ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఈ మజ్జిగ బంకా విరోచనాలు , విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూల వ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది .
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

నివేదన

నివేదన

అంతరంగంలోకి తొంగిచూడడమే మార్గం!

మీరు ఇంతవరకు జీవితంలో పడిన శ్రమ అంతా ఒక్కదాని గురించే. మీరు మంచి ఉద్యోగం కోసం వెతికినా, వ్యాపారం ప్రారంభించినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, వీటన్నిటి వెనకా ఉన్న ఒకే ఒక్క కోరిక: ‘ఆనందం’. కానీ, ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట జీవితం సంక్లిష్టమైపోయింది. ఈ భూమి మీద మీరు, మరే ఇతర ప్రాణిగా పుట్టినా, జీవితం ఎంతో సరళంగా ఉండేది. మీ అవసరాలన్నీ శారీరకమై ఉండేవి. కడుపు నిండితే ఆ రోజు గొప్పరోజు అని లెక్క. మీరు మీ పెంపుడు కుక్కనుగాని, పిల్లిని గాని గమనించండి. ఆ పూటకు వాటి కడుపు నిండితే చాలు, అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ, మీరు మనిషిగా ఈ భూమ్మీద పడిన తర్వాత, అన్ని విషయాలూ మారిపోతాయి. కడుపు ఖాళీగా ఉంటే ఒకే సమస్య: ఆకలి. కడుపు నిండితే? వంద సమస్యలు. మన మనుగడే ప్రశ్నార్థకమైనపుడు మన జీవితాల్లో అదే పెద్ద సమస్య. ఒకసారి ఆ అవసరం తీరితే, అది పెద్ద విషయమేమీ కానట్టనిపిస్తుంది. మనిషికి అతని మనుగడకు అవసరమైనవి సమకూరడంతో జీవితం ముగిసిపోదు, జీవితం అక్కడి నుండే మొదలవుతుంది. అసలు దానితోనే ప్రారంభమవుతుంది.

ఈ రోజుల్లో, అంటే మన తరంలో, మన ముందర తరాల వారికంటే, మన మనుగడకు అవసరమైనవన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతున్నాయి. మీరిప్పుడు సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళి ఒక సంవత్సరానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోగలరు. అది మీరు గడప దాటి బయటకి కాలు పెట్టకుండా కూడా చేసుకోగలరు. మానవ జీవిత చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా సాధ్యపడలేదు. ఒక వంద సంవత్సరాల క్రిందట రాజులకీ మహరాజులకీ కూడా దొరకని వస్తువులు ఇపుడు సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రహం మీద జీవించిన మనుషులందరిలోకీ మన తరమే ఎంతో సుఖమైన జీవితం గడపగలుగుతున్నది. కానీ, మనం ఇప్పటివరకు జీవించిన వాళ్ళలో, ఎక్కువ ఆనందంగా ఉన్నవాళ్ళమూ, జీవితాన్ని ఎక్కువగా జీవించిన వాళ్ళమూ, ఎక్కువ ప్రశాంతతగలిగిన వాళ్ళము మాత్రం కాదు.

ఇలా ఎందుకు జరుగుతోంది? మన చుట్టూరా ఉన్న వాటిల్లో లోపాలనన్నిటినీ సరిదిద్దగలిగాం. ఇక ఏ మాత్రం చక్కదిద్దినా ఈ భూమి మిగలదు అన్నంతగా. కానీ వెయ్యి సంవత్సరాల క్రిందటి మన పూర్వీకులకన్నా మనం ఏమంత ఎక్కువ ఆనందంగా లేము. ఇవేవీ జరగటం లేదంటే, ఎక్కడ పొరపాటు ఉందో అని వెనుతిరిగి చూసుకోవలసిన సమయం కదా? మనం వేసుకున్న ప్రణాళికలు మనల్ని గమ్యానికి చేర్చకపోయినా, వాటినే అంటి పెట్టుకుని ఎన్నాళ్ళు వేళ్లాడతాం? ఇది మనలో సమూలమైన మార్పులను తీసుకురావలసిన సమయం.

-ప్రేమాశీస్సులతో, సద్గురుCourtesy: Andhrajyothi
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

జూన్ (JUNE) ముఖ్యమైన దినోత్సవాలు

జూన్ (JUNE) ముఖ్యమైన దినోత్సవాలు


 జూన్-01:
వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జన్మదినం

ప్రపంచ పాల దినోత్సవం

 జూన్-2:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

 జూన్-4:
అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం

 జూన్-5:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం

 జూన్-8:
ప్రపంచ సముద్ర దినోత్సవం

 జూన్-12:
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

 జూన్-14:
ప్రపంచ రక్తదాతల దినోత్సవం

 జూన్-19:
అంగ్ సాన్ సూజి జన్మదినం

 జూన్-20:
ప్రపంచ శరణార్థుల దినోత్సవం

 జూన్ 3వ ఆదివారం: ప్రపంచ తండ్రుల (Father's Day)

 జూన్-21:
అత్యధిక పగటికాలం ఉండే రోజు
ప్రపంచ యోగా దినోత్సవం
ప్రపంచ సంగీత దినోత్సవం

జూన్-23
ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం

జూన్-25:
ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం

 జూన్-26:
మాదక ద్రవ్యాల వాడకం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం.

 జూన్-27:
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
విధిని జయించిన హెలెన్ కెల్లర్ జయంతి

జూన్-28:
మన తెలుగు ప్రధాని పి.వి.నరసింహరావు జయంతి (పేదల దినోత్సవం)

జూన్-29:
జాతీయ గణాంక దినోత్సవం


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

కలియుగం ఎలా ఉంటుంది

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం.


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.

శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు.  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు.  నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.

అర్జునుడికి బాణం దొరికింది.   ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు.  ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.

భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న  నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు.  కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.

నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు.  నకులుడికి ఆశ్చర్యమేసింది.  వెనుదిరిగాడు.

ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది.  సహదేవుడికి అర్థం కాలేదు.

నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  

ఆయన చెప్పనారంభించాడు.

కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.

కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు. 

కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం
చేస్తారు.

కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.

- ఉద్ధవ గీత, శ్రీమద్భాగవతం
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

వయసు మళ్లే కొద్దీ తీవ్ర స్థాయిలో ఉండే శబ్దాలు వినపడవు, ఎందుకు?

ప్రశ్న: వయసు మళ్లే కొద్దీ తీవ్ర స్థాయిలో ఉండే శబ్దాలు వినపడవు, ఎందుకు?

జవాబు: మన వినికిడి శక్తి ఎదుటి వారి మాటలు వినేందుకు ఉపయోగపడుతుంది. అలా వినబడే శబ్ద తరంగాల పౌనఃపున్యం 1500Hz నుంచి 5000Hz వరకు ఉంటుంది. (పౌనఃపున్యం అంటే సెకెనుకు ఒక కంపించే వస్తువు వెలువరించే శబ్ద తరంగాల సంఖ్య. దాని ప్రమాణాన్ని హెర్జ్ట్‌ ‘Hz’ ల్లో కొలుస్తారు) మన వినికిడి శక్తి 16 నుంచి 18000Hz ఉండే పౌనఃపున్యాలను కూడా గుర్తిస్తుంది. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తి మధ్య, లోపలి చెవి భాగాలు క్షీణిస్తాయి. తీవ్ర స్థాయిలో అంటే ఎక్కువ పౌనఃపున్యాలు కలిగి ఉండే శబ్దాలను గ్రహించే స్పర్శ సంబంధిత కణాలు అతి త్వరగా అరుగుదలకు గురవుతాయి. దీంతో ఆ వ్యక్తి వినికిడి శక్తి తగ్గుతుంది. చెవిలో ఉండే ‘కొచ్లియా’ (cochlea) ముందు ప్రాంతాల్లో ఉండే అతి సన్నని వెంట్రుకలకు సంబంధించిన కణాలు ఎక్కువగా ఉండే పౌనఃపున్యాలకు స్పందిస్తే, తక్కువ పౌనఃపున్యాలకు దాని వెనక ఉండే ప్రాంతం స్పందిస్తుంది. వయసుతో పాటు వచ్చే రుగ్మతలు చెవిలోపలి రక్త ప్రసరణలో కలిగే మార్పులు, అక్కడి రసాయనాలు వినికిడి శక్తికి తోడ్పడే కణాలను నాశనం చేస్తాయి. ఒకసారి అవి క్షీణిస్తే మళ్లీ యాధాస్థితికి తీసుకురావడం కష్టం. లాండ్‌లైన్‌ టెలిఫోన్‌ రిసీవర్‌ని చెవి దగ్గర పెట్టుకుని చూడండి. అందులో డయల్‌ చెయ్యకముందు ‘గుయ్‌’మంటూ వచ్చే శబ్దం వినపడకపోతే ఆ చెవికి వినికిడి లోపం వచ్చిందని చెప్పవచ్చు.

నిర్జలా ఏకాదశి

బలభీమసేనుడు ఆచరించిన " నిర్జలా ఏకాదశి 


తేది : 05 - 06 - 2017 , సోమవారము* రోజు నిర్జల ఏకాదశి కలదు.నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశి తిథులు వస్తాయి.ఈ 24 ఏకాదశిలలో *నిర్జలా ఏకాదశి* వైశిష్ట్యమేమిటో *శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్* మాటల్లో తెలుసుకుందాం.

ఈ ఏకాదశిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు ?*
నిర్జలా ఏకాదశిని " పాండవ ఏకాదశి " లేదా " భీమ ఏకాదశి అని పిలుస్తారు .

నిర్జల ఏకాదశిని ఎప్పుడు ఆచరించాలి ?*
జ్యేష్ట మాసము , శుక్ల పక్షములో వచ్చే ఏకాదశిని నిర్జలా ఏకాదశి అంటారు.జ్యేష్ట శుద్ధ ఏకాదశి తిథి రోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శక్తి పీఠం స్వామీజీ తెలుపుతున్నారు.

నిర్జల ఏకాదశి అంటే ఏమిటి ?*
ప్రతి మాసములో వచ్చే ప్రతి ఏకాదశి తిథి రోజు ఉపవాస వ్రతమును ఆచరిస్తారనే విషయము అందరికీ విదితమే.ఉపవాస వ్రతమును ఆచరించడమంటే ఎటువంటి ఘన పదార్థమును స్వీకరించకుండా ఉండుట. మిగితా ఏకాదశి తిథులలో ఉపవాస దీక్షలో భాగంగా ఘన పదార్థము త్యజించి అవసరార్థము ద్రవ పదార్థములను స్వీకరిస్తుంటారు.కాని జ్యేష్ట శుద్ధ ఏకాదశి రోజు ఘన పదార్థాలనే కాదు ఎటువంటి ద్రవ పదార్థాలను కూడా స్వీకరించకూడదు.ఈ ఏకాదశి రోజు కనీసం నీటిని కూడా తాగకూడదు.ఈ రోజు కనీసం జలమును కూడా స్వీకరించరు కావున ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అనే పేరు వచ్చింది.జలము అంటే నీరు.నిర్జలము అంటే నీరు లేకుండా అని అర్థము.

నిర్జల ఏకాదశి మిగితా ఏకాదశుల కంటే ఎందుకు విశిష్టమైనది ?*
ప్రతి ఒక్కరు తప్పని సరిగా ప్రతి నెలా వచ్చే ఏకాదశి తిథిన ఉపవాస దీక్షను ఆచరించాలని శాస్త్రాల్లో పేర్కొనబడినదని శక్తి పీఠం స్వామీజీ తెలుపుతున్నారు.నిర్జల ఏకాదశి వ్రతాన్ని శ్రధ్ధా భక్తులతో ఆచరిస్తే సంవత్సరములో వచ్చే మిగితా అన్నీ ఏకాదశి వ్రతాలను ఆచరించిన పుణ్య ఫలము ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వస్తుందని సాక్షాత్తు వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు కావున సంవత్సరములో వచ్చే మిగితా అన్నీ ఏకాదశుల కంటే నిర్జల ఏకాదశి విశిష్టమైనదని స్వామి శాంతానంద పురోహిత్ తెలుపుతున్నారు.

ఈ ఏకాదశికి పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది ?*
ఈ నిర్జల ఏకాదశి మహత్వాన్ని స్వయంగా వేదవ్యాస మహర్షి భీముడికి తెలియ చేసాడు.వేదవ్యాసుల ద్వారా నిర్జల ఏకాదశి విశిష్టతను తెలుసుకొని భీముడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు కావున ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు వచ్చింది.భీముడు పాండవ ద్వితీయుడు కావున పాండవ ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది.
స్వామి శాంతానంద పురోహిత్_శక్తి పీఠం వ్యవస్థాపకులు_ నారాయణపేట
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

మనషులలాగే జంతువులు, మొక్కలు కూడా నవ్వుతాయా? ఏడుస్తాయా?

ప్రశ్న: గడియారంలో మూడుముళ్లు వేర్వేరు వేగాలలో ఎలా తిరుగుతాయి?

జవాబు: ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్‌ సర్క్యూట్‌ ద్వారా క్వార్ట్‌ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.
ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్‌ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం (toothwheel). దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక






ప్రశ్న: ఫిట్స్‌ వచ్చిన వారి చేతుల్లో ఇనుప వస్తువులు, తాళపు గుత్తి పెట్టగానే తగ్గిపోతాయంటారు. నిజమేనా?*
జవాబు: ఫిట్స్‌ రావడం ఓ మానసిక రుగ్మతకు, నరాల బలహీనతకు చిహ్నం. ఇలాంటి వారికి చాలా జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. తాళపు గుత్తి పెట్టితేనో, ఇనుప వస్తువులు చేతుల్లో పెడితేనో ఫిట్స్‌ తగ్గిపోతాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే! ఇలా చేయడం వల్ల ఏవిధమైన ప్రయోజనం లేదు. కేవలం కాలయాపన వల్ల రోగికి అందవలసిన చికిత్స మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఫిట్స్‌ వల్ల రోగి నోటిలో వచ్చే నురగను వెను వెంటనే తీసెయ్యాలి. అది గొంతు ద్వారా శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఉండేందుకు, నాలుక అపస్మారకంగా వెనక్కి మడుచుకుని గొంతులోకి అడ్డుగా పడకుండా ఉండేందుకు, రోగిని బోర్లా పడుకోబెట్టాలి. వూపిరితిత్తుల మీద ఒత్తిడి రాకుండా ఉండేలా ఎడమ భుజం కింద మెత్తటి దిండు అమర్చాలి. ఫిట్స్‌ వచ్చిన వ్యక్తి తాత్కాలికంగా మానసిక విచక్షణ కోల్పోవడం వల్ల విపరీతమైన గందరగోళానికి లోనై పళ్లను గట్టిగా బిగపడతాడు. ఎంతగానంటే చాలాసార్లు పళ్లు కూడా పగిలిపోయి గొంతులోకి వెళ్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మెత్తటి గుడ్డ చుట్టిన కర్ర చివరను రెండు దవడల మధ్య ఉంచాలి. ఆహారం, నీరు ఏ మాత్రం ఇవ్వకూడదు. ఆయా పదార్థాలు సరాసరి పొట్టలోకి కాకుండా శ్వాసనాళంలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. తక్షణమే డాక్టరును సంప్రదించి త్వరగా చికిత్స చేయించాలి.






ప్రశ్న: మనషులలాగే జంతువులు, మొక్కలు కూడా నవ్వుతాయా? ఏడుస్తాయా?

జవాబు: భావాలను వ్యక్తీకరించడం చాలా జంతువుల్లో ఉంది. ఇది ఏకకణజీవులు, మెదడు లేని జీవులకు సాధ్యం కాదు. ఎందుకంటే భావం అంటేనే పరిసర పరిజ్ఞానాన్ని పొందడం, దాన్ని జ్ఞాపకంగా పదిల పరుచుకోవడం, ఆ సమాచారం ఆధారంగా తోటి జీవితో తన ప్రవర్తనను నిర్ణయించుకోవడం అన్నమాట. మెదడున్న జీవులన్నీ వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. మనుషుల్లో కన్నీరు, ఏడుపు, దిగులు మొహాన్ని చాటే కండరాల ప్రవృత్తిలాంటి రూపాల్లో దుఃఖం ప్రదర్శితమైతే, నవ్వు, మెరిసే కళ్లు లాంటి ప్రవృత్తుల ద్వారా ఆనందం ప్రకటితమవుతూ ఉంటుంది. కొన్ని జంతువుల్లో భావాలను రసాయనిక పదార్థాలను స్రవించడం ద్వారా కూడా వ్యక్తపరుస్తాయి. హార్మోను వ్యవస్థ ఉన్న జంతువుల్లో భావ వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా ఉంటుంది. అయితే మొక్కలకు మెదడు, వినాళగ్రంథి (endochrine system) ఉండకపోవడం వల్ల ఏడుపులు, నవ్వులు ఉన్నట్టు ఆధారాలేమీ లేవు. అయితే కొన్ని రసాయనాలను వెదజల్లడం ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక


మొక్కలు నాటే పద్ధతి ఇలా

రాళ్లు,చెట్లు లేని ప్రాంతంలో నాటాలి.

ఒక్కో మొక్క మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి.

నాలుగు వైపులా కనీసం 60 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా గుంత తవ్వాలి.

ఫాలిడాల్‌ డస్ట్‌, నీమ్‌ కేక్‌ గుంతలో వేయాలి.

పెరటి ఎరువును ఎర్రమట్టితో కలిపి అర అంగుళం మేర వేయాలి.

మొక్క వేర్లకు ఉన్న మట్టి విడిపోకుండా అడుగు భాగంలో జాగ్రత్తగా పట్టుకొని గుంతలో ఉంచాలి.

వేర్లు మునిగేలా మట్టి వేయాలి.

అనంతరం తుంపర్లుగా నీళ్లు చల్లాలి.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

మన కర్తవ్యం - ఆత్మ పరిశీలన

మన కర్తవ్యం - ఆత్మ పరిశీలన


ఇంటా బయట  పాఠశాల లో కూడా  మానవ సంభాందాలు  దెబ్బ తినకుండా  ఉండాలంటే  మన ఆలోచనధోరణి ,  మన బావోద్వాగాలు మొండి  పట్టుదలకు వీడ్కోలు  పలకాలి.

విమర్శలు అనేవి   ఎదుట  వారికి  ఆత్మీయ  సలహాలు గా వుండాలి.
ఎదుట వారు  సరిగా చేసుకోనే విధంగా  వుండాలి.  నలుగురు లో విమర్శలు   చేయడం అనేవి  పరోక్షంగా  అది  కసి తో కూడిన  విమర్శే
విమర్శ అనేది ఒక  రకమైన అసంతృప్తి. అయిష్టత ను అసూయ ను తెలుపుతుంది.

ఇంటా బయట  పాఠశాల లో కూడా  మానవ సంభాందాలు  దెబ్బ తినకుండా  ఉండాలంటే  మన ఆలోచనధోరణి ,  మన బావోద్వాగాలు మొండి  పట్టుదలకు వీడ్కోలు  పలకాలి.

పిల్లలు తప్పు  చేస్తే  సరిదిధ్ద వచ్చు కానీ  ఆ తప్పు ను  అదే  పనిగా  గుర్తు  చేయకండి తప్పులు అందరూ చేస్తారు.

ఆత్మ విశ్వాసము  కలిగేలా  డ్రస్ లు  ధరించనివ్వండి. ఏ చిన్న  విజయం  సాధించిన  కుటుంబంలోని  అందరూ  మెచ్చుకోండి . ఫ్రతిభను గుర్తుంచండి.  ఏ నైపుణ్యం కలిగి  వున్నారో  గుర్తించండి.

తల్లి దండ్రులు,  ఉపాధ్యాయులు:-
కొంత మంది  తమ పిల్లలను  వారి  సామర్థ్యాలను తక్కువ  అంచనా  వేస్తూ  వారిని  హేళన  చేస్తూ  ఇతరులు  ముందు  మాట్లాడుతూ వుంటారు,  వీరికి  పిల్లల్లో  ఉన్న  బలహీనతలు  మాత్రమే  కనిసిస్తాయి. పిల్లల లోని పాజిటివ్  అంశాలు  వీరికి  గుర్తుకు  రావు.  ఇలా  మాట్లాడితే వారి  ఆత్మ విశ్వాసము  దెబ్బ తినును.

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకే భోధనా మాధ్యమం ఉండాలి. మేథావులు , ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ఆంగ్లం మాధ్యమం నకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల ఆ అవకాశం ప్రభుత్వపాఠశాలల్లో లేకపోవడం వల్ల అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని పట్టణాలకు పోయి ప్రవేటు పాఠశాలల్లో చదివించడం ,పుట్టిన 3years కే మానసిక శారీరిక ఎదుగుదల చూడకుండా prepraimary పేరు తో ప్రవేటు పాఠశాలల్లో చదివించడం వంటి కారణాలు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలలు తగ్గుతున్నాయి.ఈ సంవత్సరం పాఠశాలల హేతుబద్ధీకరణ వల్ల  9000 పాఠశాలాలు రాష్ట్రంలో మూత పడుతున్నాయి. ఒకే సిలబస్ ,ఒకే పరిక్షా విధానం ,ఒకే మూల్యాంకనం  ప్రభుత్వ ప్రవేటు పాఠశాలల్లో ఉన్నపుడు ఒకే బోధనామాథయమం ఎందుకు లేదు?

మనం  అందరం  ప్రభుత్వ  పాఠశాలల్లో చదివిన వారమే  మనకు  English, knowledge  వుంది. కొంచెంసేపు practice  చేస్తే  దారాళంగా, మనము English లో   మాట్లాడగలం, ఇది తెలిసి కూడా   ఇంగ్లీషు  మీడియం  లో   ప్రైవేటు  పాఠశాలలకు  మన  పిల్లలు ను  పంపటంలో ఔచిత్యం ఏమిటో,

స్మార్ట్‌ఫోన్‌ వాడటంతో మానసిక రుగ్మతలు;-

మెల్‌బోర్న్‌: అర్ధరాత్రి దాటినా కూడా మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా!  అయితే మీరు మానసిక రుగ్మతలకు లోను కాబోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువత నాణ్యమైన నిద్రను పొందలేకపోవడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం వంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలతో బాధపడతారని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 1,100 మంది 8 నుంచి 11 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులపై అధ్యయనం నిర్వహించి వెల్లడించారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎనిమిదేళ్ల వయసు కలిగిన విద్యార్థుల్లో దాదాపు 85q శాతం మంది స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, వీరిలో 1/3 వంతు మంది అర్ధరాత్రి దాటిన తర్వాత తాము ఫోన్‌ వినియోగించబోమని చెప్పారని వెర్నన్‌ తెలిపారు. మూడేళ్ల తర్వాత వీరిలో 93 శాతం మంది సొంత స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, కేవలం 22 శాతం మంది మాత్రమే అర్ధరాత్రి అనంతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగించబోమని చెప్పినట్లు తెలిపారు. అయితే వీరి వయసు పెరిగే కొద్దీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌ను వాడటం పెరిగిందని, వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించడంతోపాటు, నిద్రలేమి సమస్యలు తీవ్రం అయ్యాయని వెర్నన్‌ వివరించారు.

పిల్లలు  వయస్సు . గురించి కొన్ని విషయాలు.;-

8,9,10 చదివే విద్యార్థులు బాల్యం నుంచి యవ్వనం లోకి వెళుతున్నారు. వారికి అందవలసిన విషయాలు రోజూ చదివే విద్యా వ్యవస్థ లో కంఠస్తం‌, పరీక్షల లో మార్కులు తప్ప వారికి కావలసిన నైతిక విలువలు, వయస్సు లోమార్పు, కుటుంబ విలువలు, సంస్కారం చెప్పే అవకాశం , మాట్లాడే అవకాశాన్ని ఉపాధ్యాయులు తల్లి దండ్రులు  , కల్పించాలి.,

లేకుంటే  పిల్లలు ,  భ్యవిషత్తులో,  నన్ను  అర్థం  చేసుకునే  జ్ఞానం  నా ఉపాధ్యాయులకు గానీ,  తలిదండ్రులు, గానీ లేదని భావించి     ఆత్మహత్య ఆలోచన లోకి పిల్లలు వస్తారు.

 ప్లేట్ లో భోజనాన్ని చేతితో  ,  తింటే  కలిగే తృప్తి  , తెలుగుమీడియం అంటారు.
అదే భోజనాన్ని  , స్పూను తో  తింటే  కలిగే తృప్తి  , ఇంగ్లీషు మీడియం అంటారు.





ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా?

Human body energy clock 

ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా?


ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌ల‌గుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే స‌మ‌యాల్లో యాక్టివ్‌గా ప‌నిచేస్తాయో, అవి ప‌నిచేసేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య*
ఈ స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు.

ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య*
ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి.

ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య*
ఈ సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది.

ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య*
ఈ స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందుతుంది.

మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు*
ఈ స‌మ‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి.

మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు*
ఈ స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు*
 ఈ స‌మ‌యంలోనూ మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి.

రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య*
 ఈ స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది.

రాత్రి 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య*
 ఈ స‌మయంలోభోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి.

రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య*
 ఈ స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది.

రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య*
 ఈ స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు.

ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్య*
 ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.
వాకర్స్ క్లబ్*
మహబూబ్ నగర్*

ప్రేమ్‌చంద్ కథ "కఫన్" - ఒక విశ్లేషణ

ప్రేమ్‌చంద్ కథ "కఫన్" - ఒక విశ్లేషణ

ప్రేమ్‌చంద్ పేరు భారతదేశంలో చాలా మందికి తెలుసు. ఆయన సాహిత్యం తెలుగులోకి కూడా విరివిగా అనువాదమయింది. 1880లో పుట్టిన ప్రేమ్‌చంద్ 1936లో తన 56 ఏళ్ల వయసులోనే మరణించారు.ప్రేమ్‌చంద్ 1936లో రాసిన కఫన్ కథ.
- కథకుడిగా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి పరిణతి సాధించిన మేధావి ప్రేమ్‌చంద్. దేశమంతా ఉన్నట్టు గానే ప్రేమ్‌చంద్ కాలం నాటి హిందీ సాహిత్యం కూడా మబ్బుల్లోనే విహారం చేస్తుండేది. ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా కథను కిందకి దించి నేలమీద నడిపించిన రచయిత ప్రేమ్‌చంద్. పేద రైతులూ కూలీలూ గ్రామీణ జీవితం… వీటి మీద ప్రేమ్‌చంద్ దృష్టి పెట్టారు. దేశానికి స్వాతంత్యం రావాలంటే గాంధీ నాయకత్వం అవసరమని నమ్మి, తను గాంధీ శిష్యుడినని చెప్పుకున్నారు. కానీ గాంధీ చెప్పిన ధర్మకర్తృత్వం – ధనికుడు తన డబ్బుకి సొంతదారుడిగా కాదు ధర్మకర్తగా వ్యవహరించాలి – అనే కీలకమైన చిక్కుముడి దగ్గర గాంధీని ఒప్పుకోలేదు ప్రేమ్‌చంద్. అలాగే మతం, ఆచారాలు గ్రామీణుల అమాయకత్వం మీద ఆడుకుంటున్నాయని కూడా గ్రహించారు. ఉత్తర భారతదేశంలో భూమి, డబ్బు, చేతుల్లో ఉన్నవాళ్ళు వడ్డీ వ్యాపారం లోకి దిగి పేదలను పీడించడం, మతాచారాల పేరుతో అజమాయిషీ, వాటి ప్రకారం నడచుకోకపోతే నరకానికి పోతామనే నమ్మకంతో ఉండే అమాయకమైన రైతులూ… ఇలాటివాళ్ళంతా ఉన్న గ్రామీణ సమాజాన్ని చూశారు ప్రేమ్‌చంద్. జమీందార్లూ దోచుకునేవాళ్ళూ లేని గ్రామీణ భారతం కావాలని ఆశించారు. రైతులు పటిష్టంగా ఉండే భారతదేశం కావాలని కోరుకున్నారు.
- కఫన్ కథను ప్రేమ్‌చంద్ 1936లో రాశారు. కథ క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఒక ఊర్లో ఇద్దరు తండ్రీ కొడుకులు. చమార్ అనే దళిత కులానికి చెందిన వాళ్ళ పేర్లు ఘీసూ, మాధవ్. సోమరిపోతులు. పనిదొంగలు. మాధవ్‌కు పెళ్లవుతుంది. భార్య పేరు బుధియా. బుధియా పురుటినొప్పులు పడుతుండగా కథ మొదలౌతుంది. కాన్పు కష్టమై ఆమె చచ్చిపోతోందని తెలిసి కూడా వీళ్ళిద్దరూ ఏమీ పట్టించుకోకుండా, గొప్పవాళ్ళ ఇళ్ళలో జరిగే పెళ్లి విందుల గురించి మాట్లాడుకుంటూ, బంగాళాదుంపలు కాల్చుకు తింటూ, ఇలా గుడిసె బయటే కాలం గడిపేస్తారు. రాత్రంతా బాధపడి, కనలేక, తెల్లారేసరికి ఆమె చచ్చిపోతుంది. దహనసంస్కారం కోసం అందర్నీ అడిగి ఒక అయిదు రూపాయలు సంపాదిస్తారు తండ్రీకొడుకులు. శవానికి కొత్తబట్ట కప్పి దహనం చెయ్యాలి. (ఆ బట్టను కఫన్ అంటారు.) ఆ కఫన్ కోసం దుకాణాలు తిరుగుతూ మద్యం దుకాణం దగ్గరికి వస్తారు. ఇంకేముంది, ఇద్దరూ ఆ డబ్బుతో శుభ్రంగా తిని తాగి పడిపోతారు.
--  బుధియా చావుని తప్పించే ప్రయత్నమైనా కనీసం జరగదు. ఘీసూ మాధవ్‌లు నలుగురినీ కేకెయ్యటం, డబ్బుకోసం ప్రయత్నించటం లాంటివేవీ చెయ్యరు. ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూస్తూ కూచుంటారు.
-- ఈ కథ చదివితే ‘అమ్మో ఇంత మానవత్వం లేకుండా మనుషులు బతుకుతారా!’ అని సగటు మధ్యతరగతి మనుషులకు వెగటు పుట్టొచ్చు. కానీ, మనుషుల్లో అమానుష లక్షణాలని వేటిని అనుకుంటామో అవి చావు సందర్భాల్లో బాగా బైటపడతాయి. ఎకనామిక్ ఈక్వేషన్స్ అంతో కొంతో లేకుండా ఒట్టి దుఃఖమయంగా ఏ చావూ వెళ్ళదు. మనిషి బతుకులాగే మనిషి చావు కూడా లాభనష్టాల లెక్కే.
 ('ఈమాట ' జాలపత్రిక  మార్చ్, 2017 సంచికలొ ప్రచురించిన
   ల.లి.త.గారి వ్యాసం "ఇద్దరు కథకులు – రెండు చెదిరిన బ్రతుకుల కథలు" నుండి సంగ్రహణ)


మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది?

ప్రశ్న: మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది?


జవాబు: మామూలు నార, దూది, పాత గుడ్డ వంటి వాటిని లుంగచుట్టినా అవి కూడా స్పాంజిలాగే పనిచేస్తాయి. మనం వాడే తువ్వాలు, జేబురుమాలు, వంటింటి మసిగుడ్డ కూడా స్పాంజి పనిచేసే సూత్రం ఆధారంగానే పయోగపడుతున్నాయి. స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే ముద్దగా ఉన్న పాలిమర్‌ పదార్థంలో అత్యధికంగా గాలి గదులు ఉంటాయి. ఒక గదికి, మరొక గదికి కూడా మార్గాలు ఉంటాయి.అందువల్ల చూడ్డానికి పెద్దగానే ఉన్నా అందులో ఉండేది ఎక్కువ ఖాళీనే. దీని తయారీ దశలోనే ద్రవస్థితిలో ఉండే పాలిమర్‌లోకి నైట్రోజన్‌ను కానీ, గాలిని కానీ, కార్బన్‌డయాక్సైడును కానీ నురగ రూపంలోపంపుతారు. అందువల్లనే రంధ్రాలతో స్పాంజి ఏర్పడుతుంది. ఇక అది నీటిని పీల్చుకోవడానికి కారణం ద్రవాలకుండే తలతన్యత అనే ధర్మమే. సన్నపాటి సందుల్లోకి ద్రవాలు పాకడాన్నే కేశనాళికీయత (capillarity) అంటారు. ఈ లక్షణం వల్లనే అద్దుడు కాగితం ఇంకుని, సుద్దముక్క నీటిని, తువ్వాలు తడిని, స్పాంజి నీటిని పీల్చుకుంటాయి. దీపంలో వత్తి ద్వారా నూనె పైకి పాకడానికి, చెట్ల వేర్ల ద్వారా నీరు ఆకుల్లోకంటా చేరడానికి కూడా ఇదే కారణం.

మూలకాలు - ప్రత్యేకతలు

మూలకాలు - ప్రత్యేకతలు


  • యురేనియం  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.
  • హైడ్రోజన్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.
  • కార్బన్ డైమండ్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
  • కార్బన్  :- మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.
  • ఆక్సిజన్  :- మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.
  • క్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.
  • ఫ్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.
  • హీలియం  :- మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.
  • ఫ్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.
  • సీజియం  :- మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.
  • కాల్షియం  :- మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
  • ఆస్మియా  :- అత్యధిక సాంద్రత ఉండే లోహం.
  • లిథియం  :- ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.
  • సిల్వర్  :- అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
  • రేడియం  :- అత్యధిక రేడియోధార్మికత గల లోహం.
  • అల్యూమినియం  :- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.
  • టంగ్‌స్టన్  :- అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
  • పాదరసం  :- అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
  • నైట్రోజన్  :- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.
  • మాంగనీస్  :- మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.
  • ఇనుము  :- మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.
  • బంగారం  :- రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
  • వెండి  :- అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.
  • మాంగనీస్  :- స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.
  • నికెల్  :- నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.
  • జిర్కోనియం  :- వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.
  • టైటానియం  :- ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది.
  • హీలియం  :- అన్నింటికంటే తేలికైన జడ వాయువు.
  • » బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం
  • బొగ్గురకం :- కార్బన్ శాతం
  • ఆంత్రసైట్ :- 90
  • బిట్యు మినస్: - 80
  • లిగ్నయిట్ :- 70
  • పీట్ :- 60

‌MORALITIES అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ..

‌MORALITIES అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ..

ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలవుతున్నది. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

ప్రియమైన ఉపాధ్యాయులారా..
నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి. కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా. మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ - మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ - వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని - ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి.

అదే సమయంలో... ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.
వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే.

సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.

మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి. వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి. అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.

సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.

ఇదంతా పెద్ద పట్టికే. తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి. వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి..
-అబ్రహం లింకన్

బరువు తగ్గాలా

బరువు తగ్గాలా? ప్రతి రోజూ ఉదయాన్నే ఇలా చేయండి..

. గ్రీన్ టీ తాగండి.
 3 టమోటాలు తినండి
నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోండి.
 నానబెట్టిన 5 బాదం పలుకులు తినండి.
10 కరివేపాకు ఆకులను తిని గ్లాసుడు మంచినీరు తాగండి.
5 వెల్లుల్లిపాయలను తీసుకోండి.
కప్పు దానిమ్మ గింజలను ఆరగించండి.
వీటిలో ఏ రెండింటినైనా క్రమం తప్పకుండా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకున్నట్టయితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.






వేరుశెనగ.
గుడ్‌ఫుడ్‌

వేరుశనక్కాయల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి, 25.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అవి శక్తినివ్వడంలోనూ, గాయాలు మాన్పడంలోనూ బాగా ఉపయోగపడతాయి.

వీటిల్లో కార్పోహైడ్రేట్లు 13 – 16 శాతమే. వంద గ్రాముల్లో 16.1 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి.                   

అందుకే డయాబెటిస్‌ రోగులు చిరుతిండిగా నిర్భయంగా తినవచ్చు.100 గ్రాముల్లో 49.2 గ్రాములు కొవ్వుపదార్థాలే. వాటిల్లో మోనో–అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు 24.43 గ్రాములు, పాలీ–అన్‌శాచ్యురేటెడ్‌ 15.46 గ్రా‘‘, శాచ్యురేటెడ్‌ కొవ్వులు 6.28 గ్రాములు. కాబట్టి ఇది ప్రధానమైన శక్తివనరు.

వీటిల్లో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్‌ చాలా ఎక్కువ. గర్భవతులకు మేలుచేస్తాయి. విటమిన్‌–బి3గా పరిగణించే నియాసిన్‌ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది.
.