Pages

Friday, June 9, 2017

గణితం అంటే ఆలోచనా పద్ధతి


గణితం అంటే ఆలోచనా పద్ధతి

గణితం అన్ని సబ్జెక్టుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రక్రియకు మూలం అంటారు. గణితం మనం ఏ విధంగా క్రమబద్ధంగా ఆలోచించాలో చెబుతుంది. ఈనాడు గణాతాన్ని సమస్యా పరిష్కారానికి వేదిక అంటున్నారు. గతంలో కన్నా ఇప్పటికి తేడా ఏమిటంటే?
గతంలో గణితాన్ని ఎక్స్‌ర్‌సైజ్ కోసం ఉపయోగించారు. సమస్యను ఎలా పరిష్కరించాలో నియమితమై ఉంటుంది. ఆలోచనలో కలిసిన సమస్యా పరిష్కారం వల్లనే ఈనాడు సమస్యలకు విరుగుళ్లు దొరుకుతాయి. ఈనాడు దీన్ని కాల్పనికమైన సమస్యా పరిష్కారం అంటున్నారు. అంటే ఆలోచన కలిసిన సమస్యా పరిష్కార విధానం కాబట్టి విద్యార్థి తనదైన కొత్త ఆలోచనలు చేయటం జరుగుతుంది.
ఒక కొత్త ఆలోచనతో సమస్యను పరిష్కరించటాన్ని క్రియేటీవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఇదివరకు నలుగురు నడిచిన బాటపైన కాకుండా కొత్త బాటను వేసుకుని దానిపై నడుచుకుంటూ గమ్యాన్ని చేరాలి. కొత్త బాటను ఎలావేయాలి.. దానిపై ఎట్లా నడవాలి? గమ్యాన్ని ఎట్లా చేరాలి?
గమ్యాన్ని చేరుతున్నప్పుడు అది సరైన బాట అవునా? కాదా? అని నిశితంగా మూడు రకాలుగా పరీక్షిస్తాడు. ఒకటి- ఎత్తుగడ సమస్య పరిష్కారానికి దారి చూపుతుందా? లేదా? రెండవది- ఆ ఎత్తుగడ కొన్ని లాండ్‌మార్క్‌లను నిర్ణయించగలుగుతుందా? లేదా? మూడవది- అనుకున్న గమ్యానికి చేరుకున్నామా? లేదా? క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే- ఆలోచనను కూడా అది క్రమంగా చేసేస్తుంది. ఇది మ్యాథమ్యాటికల్ థింకింగ్. ఈనాడు క్రియేటీవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తరగతి గదిలో ఎందుకు చెబుతున్నారంటే ప్లాన్ వేయటం ఎంత ప్రధానమో, మధ్యలో దాన్ని చూసుకోవాలి. అది అయిన తర్వాత దాన్ని ఫైనల్ అవాల్వింగ్ చేస్తారు. అంటే అది అనుకున్న మనిషికి చేరిందా? లేదా?
అందుకే
మ్యాథ్స్‌ను- 'అన్ని సబ్జెక్టులకు మూలం' అని అంటారు. ప్రతి సబ్జెక్టుకు ఈ మూలాలను అన్వయించవచ్చు. దానికి ఆరు అడుగులు వేయాలి.
1. సమస్యను అర్థం చేసుకోవటం
2. సమస్యను అర్థం చేసుకోవటానికై ఎత్తుగడలను నిర్ణయించాలి
3. కనుక్కోవలసిన విషయానికి తక్కువ స్టెప్స్ ఉండాలి అంటే మార్గం దీర్ఘంగా ఉండకూడదు
4. వచ్చిన సమాధానం సమాజంలో ఒప్పించబడాలి
5. దీనికి కావాల్సిన క్యాలిక్యూలేషన్స్, సాధనాలు ఏమిటి?
6. దీనిలో ఎక్కడ క్రాసింగ్స్ ఉంటాయి? ఎన్ని క్రాసింగ్స్ ఉన్నాయి? ఈ సమయంలో కరెక్ట్ ఛాయిస్ ఎట్లా తీసుకోవాలి? అందుకే గణితం ఆలోచించే పద్ధతిని చూపిస్తుంది.

No comments:

Post a Comment

.