రాష్ట్రపతిని ఎవరు, ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందామా..!
భారత రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు (ఎంపీలు), రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
ప్రస్తుతం రాజ్య సభలో 233 మంది, లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉండగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం 4120 మంది ఉన్నారు.
ఈ క్రమంలో అందరినీ కలిపితే ఆ సంఖ్య 4896 అవుతుంది.
వీరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. . రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ మెంబర్లు అని పిలుస్తారు.
వీరో పోలింగ్ రోజున ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేస్తారు.
ఈ క్రమంలో ఎంపీలకు గ్రీన్ బ్యాలెట్ స్లిప్‌లను, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ స్లిప్‌లను ఇస్తారు.
వారు ఆ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేయాలి. అయితే ఆ ఓటు ఎవరికో ఒకరికి మాత్రమే వేసేలా ఉండదు.
అంటే… అందులో ఉండే అభ్యర్థులకు సభ్యులు తమ ప్రాధాన్యత ఓటును వేయాలి. .
ఉదాహరణకు 4 అభ్యర్థులు బరిలో ఉన్నారనుకుంటే వారిలో ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారో ఎంచుకుని స్లిప్‌లో 1, 2, 3, 4 ఇలా రాయాలన్నమాట.
ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు విలువ కడతారు. అది నియోజకవర్గాలకు వేర్వేరుగా ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో అయితే ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208 గా ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ విలువ 8 మాత్రమే.
ఇలా అభ్యర్థుల ఓట్లకు విలువ వేస్తారు.
ఈ క్రమంలో మొత్తం 4896 మంది సభ్యుల ఓట్ల విలువ కలిపి 10,98,903 అవుతుంది.
అందులో సగం ఓట్లు అంటే 5,49,442 వస్తే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
అయితే మొత్తం పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు గనక ఈ విలువ మారుతుంది.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment