పెట్రోల్ ధరలు రోజూ ఛేంజ్..తెలుసుకోండిలా!
న్యూఢిల్లీ : ఇక నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ వారీ మారతాయి. మారుతున్న ధరలకు అనుగుణంగా వినియోగదారులు రోజుకో ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇంధన సంస్థలు ఈ మార్పులు చేపడతారు. ఇన్ని రోజులు అంతర్జాతీయ ఇంధన ధరలు, డాలర్ తో రూపాయి మారకం రేటుకు అనుగుణంగా 15 రోజులకు ఒకసారి ఇంధన సంస్థలు ఈ రేట్లలో మార్పులు చేపట్టేవి. కానీ నేటి నుంచి రోజువారీ మార్పునకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటే, వాటిని తెలుసుకోవడం ఎలా? ప్రాంతానికి బట్టి కూడా ధరల మార్పు ఎలా ఉంటుంది? వీటన్నింటిన్నీ తెలుసుకోవడం కొన్ని మార్గాలున్నాయంట. అవేమిటో ఓ సారి చూడండి...
*మొబైల్ యాప్*
మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను రూపొందించారు. అది Fuel@IOC - IndianOil. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే, నగరాల్లో రోజూవారీ మారుతున్న ధరల అప్ డేట్ ను ఇది అందిస్తోంది. బీపీసీఎల్ కూడా ఇదే తరహాలో SmartDrive, అలాగే హెచ్పీ కూడా MYHPCL యాప్ లను తీసుకొచ్చాయి. ఈ యాప్స్ ద్వారా కూడా మీరున్న ప్రాంతంలోని పెట్రోల్ బంకుల్లో ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
*అప్ డేట్ కోసం ఎస్ఎంఎస్...*
పెట్రోల్ బంకుల్లో ధర తెలుసుకోవడం కోసం 9224992249 నెంబరుకు (రిటైల్ సేల్ ప్రైజ్)RSP< SPACE >DEALER CODEగా మెసేజ్ పంపితే చాలు. వెనువెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలిసిపోతాయి. భారత పెట్రోలియం కూడా ఇదే ఫార్మాట్ లో 9223112222 నెంబర్ ను తీసుకొచ్చింది. హిందూస్తాన్ పెట్రోలియం కస్టమర్లు అయితే 9222201122 నెంబర్ కు HPPRICEDEALERCODE అని మెసేజ్ చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తాయి.
వెబ్‌సైట్ ద్వారా..
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ www. iocl.comలో ఆర్‌ఓ లొకేటర్ ద్వారా మీరు ఏ ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ధర తెలుసుకోవాలనుకుంటున్నారో చూసుకోవచ్చు. అయితే దేశంలోని మొత్తం పెట్రోల్ బంకుల్లో 20 శాతం వరకూ మాత్రమే ఆటోమేటెడ్ విధానంలోకి మారాయని తెలుస్తోంది. రేట్లను చెక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. కొన్ని బంకుల యజమానులు వీటిని ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా రోజువారీ ధరల మార్పులను తెలుసుకోవచ్చని తెలుస్తోంది.
No comments:
Post a Comment