ప్రశ్న: వయసు మళ్లే కొద్దీ తీవ్ర స్థాయిలో ఉండే శబ్దాలు వినపడవు, ఎందుకు?
జవాబు: మన వినికిడి శక్తి ఎదుటి వారి మాటలు వినేందుకు ఉపయోగపడుతుంది. అలా వినబడే శబ్ద తరంగాల పౌనఃపున్యం 1500Hz నుంచి 5000Hz వరకు ఉంటుంది. (పౌనఃపున్యం అంటే సెకెనుకు ఒక కంపించే వస్తువు వెలువరించే శబ్ద తరంగాల సంఖ్య. దాని ప్రమాణాన్ని హెర్జ్ట్ ‘Hz’ ల్లో కొలుస్తారు) మన వినికిడి శక్తి 16 నుంచి 18000Hz ఉండే పౌనఃపున్యాలను కూడా గుర్తిస్తుంది. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తి మధ్య, లోపలి చెవి భాగాలు క్షీణిస్తాయి. తీవ్ర స్థాయిలో అంటే ఎక్కువ పౌనఃపున్యాలు కలిగి ఉండే శబ్దాలను గ్రహించే స్పర్శ సంబంధిత కణాలు అతి త్వరగా అరుగుదలకు గురవుతాయి. దీంతో ఆ వ్యక్తి వినికిడి శక్తి తగ్గుతుంది. చెవిలో ఉండే ‘కొచ్లియా’ (cochlea) ముందు ప్రాంతాల్లో ఉండే అతి సన్నని వెంట్రుకలకు సంబంధించిన కణాలు ఎక్కువగా ఉండే పౌనఃపున్యాలకు స్పందిస్తే, తక్కువ పౌనఃపున్యాలకు దాని వెనక ఉండే ప్రాంతం స్పందిస్తుంది. వయసుతో పాటు వచ్చే రుగ్మతలు చెవిలోపలి రక్త ప్రసరణలో కలిగే మార్పులు, అక్కడి రసాయనాలు వినికిడి శక్తికి తోడ్పడే కణాలను నాశనం చేస్తాయి. ఒకసారి అవి క్షీణిస్తే మళ్లీ యాధాస్థితికి తీసుకురావడం కష్టం. లాండ్‌లైన్ టెలిఫోన్ రిసీవర్‌ని చెవి దగ్గర పెట్టుకుని చూడండి. అందులో డయల్ చెయ్యకముందు ‘గుయ్’మంటూ వచ్చే శబ్దం వినపడకపోతే ఆ చెవికి వినికిడి లోపం వచ్చిందని చెప్పవచ్చు.

No comments:
Post a Comment