Pages

Friday, June 30, 2017

మీకు తెలియని విషయాలు

మీకు తెలియని విషయాలు

ప్రశ్న:* కొబ్బరి కాయను పగలగొట్టినప్పుడు అది రెండు ముక్కలే ఎందుకు అవుతుంది?
జవాబు:* ఏదైనా ఘనపదార్థాన్ని పగలగొట్టాలంటే శక్తి కావాలి. ఎంత కావాలనేది ఆ వస్తువు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. అలా కొట్టేటప్పుడు వేగం, కాలం కూడా పరిగణనలోకి వస్తాయి. ఎంత శక్తిని ఎంత కాలంలో ఎంత వేగంతో ఉపయోగించామో తెలిపేదే తాడనం (impact) అవుతుంది. గట్టిగా ఉండే కొబ్బరి కాయ పెంకు పగలాలంటే తాడన తీవ్రత అధికంగా ఉండాలి. అది పెంకులో పగుళ్లను తీసుకువస్తుంది. దీని మీదనే పగులు విస్తారం (spread of crack) ఆధారపడి ఉంటుంది. కొబ్బరి కాయ ఎక్కువ ముక్కలవ్వాలంటే ఎక్కువ విస్తారపు పగుళ్లు కావాలి. కానీ మనం సాధారణంగా ప్రయోగించే తాడన తీవ్రత కొబ్బరి కాయను కేవలం రెండు ముక్కల్నే చేయగలదు. అలా కాకుండా చాలా తీవ్ర శక్తితో నేలకేసి ఠపీమని కొడితే అది అనేకముక్కలవడాన్ని గమనించవచ్చు.

..


ప్రశ్న: చీమలు తమ కన్నా ఎక్కువ బరువును ఎలా మోస్తాయి?
జవాబు: ఒక ప్రాణి ఎత్తగల బరువు ఆ ప్రాణి పరిమాణాన్ని బట్టి, సొంత బరువును బట్టి మాత్రమే ఆధారపడదు. వందల కిలోగ్రాములున్న జెల్లీ చేప మీద 30 కిలోగ్రాముల బరువు ఉంచినా కుచించుకుపోతుంది. రైలు పట్టాల సొంత బరువు తక్కువే, అయినా వాటి మీద వేల టన్నుల బరువున్న రైలు స్థిరంగా ఉండగలుగుతోంది. ఒక వస్తువు మీద మరో వస్తువు నిలబడగలిగే సామర్థ్యం నిలబెట్టుకునే వస్తువుకున్న నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. ఒలింపిక్‌ క్రీడల్లో బరువునెత్తడం కష్టమే కానీ ఎత్తిన బరువును నిలుపుకోవడం చాలా సులభం. ఎందుకంటే ఎత్తిన తర్వాత తమ శరీరాన్ని అందుకనుగుణంగా నిలుపుకుంటారు. చీమల బరువు తక్కువే ఉన్నా వాటి శరీరాకృతిలో గట్టి కైటిన్‌ అనే పదార్థం ఉంటుంది. మనుషులు తదితర సకశేరుక జంతువులకు శరీరం లోపల అస్థిక నిర్మాణం వల్ల ఆకృతి, స్థిరత్వం వస్తాయి. చీమలు, తాబేళ్లు, గవ్వలు మొదలయిన అకశేరుక జంతువులకు బాహ్య నిర్మాణం గట్టిగా ఉండటం ద్వారా స్థిరత్వం, స్వరూపం కలుగుతాయి. అందువల్లే చీమలు తమ కన్నా ఎక్కువ బరువును కూడా ఎత్తగలవు. కానీ అవి ప్రతిసారీ తమకన్నా ఎక్కువ బరువును మోసుకెళ్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. చీమలు తమకు ఉపయుక్తమయిన పదార్థాలను గోళాకారంలోకి మార్చి దొర్లించుకుంటూ వెళ్లడం తరచూ చూస్తాం. ప్రపంచంలో ఉన్న చీమల మొత్తం బరువు ప్రపంచంలో ఉన్న సకశేరుక జంతువుల మొత్తం బరువు కన్నా ఎక్కువ. చీమ చిన్నదేగానీ చీమల సీమ పెద్దదే!







ప్రశ్న:_కొబ్బరి నీళ్లు శరీరానికి మేలు చేస్తాయంటారు. ఎందువల్ల?

*జవాబు:* కొబ్బరి నీళ్లు నిజానికి కొబ్బరి మొలకల ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని ద్రవరూపంలో అందించడానికి ఏర్పడినవి. పారదర్శకంగా ఉండే తీయని కొబ్బరి నీళ్లలో నూనె, చక్కెర, నీరు, విటమిన్లు, పొటాషియం, భాస్వరం, సెలీనియం లాంటి పోషక పదార్థాలతో కూడిన ఖనిజ పదార్థాలుంటాయి. ఆ నీళ్లు తాగితే ఇవన్నీ శరీరానికి అందినట్టే. కొబ్బరి కాయ ముదిరే కొద్దీ లోపల ఉండే కొబ్బరి ఆ నీళ్లను పీల్చుకుంటుంది. అందువల్లనే ముదురుకాయలో కన్నా లేతకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు క్రిమిరహితమైన పరిశుభ్రమైన ద్రవం కావడంతో వాటిని తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా రక్తస్రావం ఎక్కువై శరీరంలోని సీరం చాలా తక్కువైన సందర్భాల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తారు. మూత్రపిండ వ్యాధులున్నవారికి, వాంతులవుతున్నవారికి, రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారికి, చర్మం పొడిబారిపోయి ముడతలు పడుతున్నవారికి, గ్లూకోమాలాంటి కంటి జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.








Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.