Father s day messages in Telugu
నాన్నంటే నడయాడే దైవం కల్లలో కఠినత్వం దాచి....గుండెలో ప్రేమ ప్రవాహం....తో అనురాగపు ఎదపై మనల్ని మోస్తూ.....మన కళల సాధనకు....తన రక్తాన్ని నిరంతరాయ ఇంథనంగా మార్చి మనల్ని నడిపించే ఎనలేని ....ఆత్మబలం....అనంత....ఆకాశం సైతం నాన్న ప్రేమకు అనక తప్పదు దాసోహం...అన్నీ నాన్నే
బుడి బుడి నడక తడబడకుండా
వేలుపట్టి నడిపించే దైవం నాన్న
అమ్మ కలల వెలుగైతే ,తాను కాలుతూ ఆవెలుగుకు కారణమవుతున్న చమురు నాన్న
ప్రతి పనిలో మెళకువలను నేర్పుతూ నిష్ణాతులను చేయాలన్న తపన కల్గిన కఠోర శిక్షకుడు నాన్న
అమ్మ అక్షయపాత్ర అయితే,
ఆ పాత్రలోని పదార్థాలు తరిగిపోకుండా సమకూర్చే విశ్రమించని శ్రామికుడు నాన్న
ఆశలు చంపుకుని, బాధలు దిగమింగకుని, నీ ఆనందం కోసం చిరు నవ్వును చిందించే
త్యాగశీలి నాన్న
ప్రతి క్షణం పరికిస్తూ, గమనిస్తూ
సవ్యమైన గమ్యానికి దారి చూపి, ధరిని చేర్చే మార్గదర్శి నాన్న
మంచి చెడులు తప్పటడుగులు, సవరిస్తూ సన్మార్గం బోధిస్తూ
మార్గాన్ని నిర్దేశించే గురువు నాన్న
త్యాగం తపన తోడు నాన్న
భద్రత భరోసా బాధ్యత నాన్న
దారి దైవం దార్శనికత నాన్న
మంచి మమత మార్గం నాన్న
గురువు గమనం గమ్యం నాన్న
Nanna is an Encyclopedia.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
" కనిపించే దైవం నాన్న, నడిపించే స్థైర్యం నాన్న, పిల్లలకోసం అనుక్షణం దేవుడు నాన్న, నేనున్నానంటు భరోసా నిచ్చే జీవిత నిర్థేశకుడు అలాంటి నాన్నకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని భగవంతున్ని వేడుకుంటూ...
" అందరికీ ' ఫాదర్స్ డే శుభాకాంక్షలు మరియు శుభోదయం..💐
నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,
అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.
కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,
నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,
కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం అమ్మవంతు,
సరిచేయటం నాన్నతంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలుకూడా కనబడుతాయి.
ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.
ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.
అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మగుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.
నాన్నగుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.
అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,
నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే ఆరాటం అమ్మది,
కనిపించని పోరాటం నాన్నది.
అమ్మకి లైకులెక్కువ,
నాన్నకి షాకులెక్కువ.
అమ్మ ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద చెరువవటం కనిపించదు.
గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.
పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే,
నాన్న తళతళ.
కనిపించే దేవత అమ్మ అయితే,
కనపడని దేవుడు నాన్న.
పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,
నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.
( నాన్న ).
తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్ లోకి వెళ్ళాడు ఓ తండ్రి. కలెక్టర్ ఐన తన కొడుకు భుజం మీద చేయి వేసి "ప్రపంచం లో అత్యంత శక్తివంతుడు ఎవరు?" అని అడిగాడు . అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు ప్రపంచంలో అత్యంత శక్తి వంతుడిని నేనే అని. ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు. నిరాశగా వెనక్కుతిరిగి ఛాంబర్ లోనుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు. అప్పుడు ఆకొడుకు మానాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు...ఇంతకు ముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పావు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేం అన్నాడు. నాన్నా అప్పుడు నీచేతి నా భుజం మీద ఉండింది. అందుకే అప్పడు నేనే శక్తివంతమైన వాన్ని. ప్రపంచంలో ఏకొడుకు భుజంమీద తండ్రి చేయి ఉంటుందో ఆకొడుకే అత్యంత శక్తివంతుడు కాదా నాన్నా? తండ్రి కళ్ళలో నీళ్ళు! తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం. ఆ విత్తును మొలకగా, చెట్టుగా, మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పదనం. విత్తులాంటి వాడు కొడుకైతే మహా వృక్షంగా మలిచే తోటమాలి నాన్న!
నాన్నకు ప్రేమతో....
*మాతృదేవోభవ! పితృ......?*
వేరే సమూహం లోని ఒక కధానానికి స్పందించి దాని తెలుగు అనువాదాన్ని మీకు అందిస్తున్నాను.
*మనిషైతే మనసుంటే*అన్న కృష్ణశాస్త్రి గారి పాటే నా ఈ స్పందనకు స్ఫూర్తి.
అది నగరంలో నే అతి ప్రఖ్యాత కార్పొరేట్ స్కూల్. ఆ స్కూల్ ఆవరణలోని మొక్కలను అతి శ్రద్ధగా కత్తిరించటం ఎండు ఆకులను ఏరివేయటం,అన్ని మొక్కల కుదుళ్లకు నీరుపారేలా చేయడం ఇలా తోటపెంపకం పనిలో ఉన్నాడు మాలి గంగాదాస్. మండుటెండలో పని చేస్తున్నప్పటికీ ఆ ఎండ, ఆ వేడి అతని పై ఏమాత్రం ప్రభావం చూపినట్లు లేదు. ఈలోగా "గంగాదాస్! ప్రిన్సిపాల్ మేడం నిన్ను వెంటనే రమ్మన్నారు" అన్న పిలుపు విని ఒకింత భయపడ్డాడు.
నిజాయితీగా నియమబద్ధంగా పని చేసే తనవల్ల ఏం పొరపాటు జరిగిందో, తను తన కుమార్తె శ్వేత ప్రశాంతంగా జీవించటానికి తనకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ఇంత మంచి స్కూల్లో తన శ్వేత కు పైసా ఫీజు తీసుకోకుండా ప్రవేశం కల్పించిన ఈ స్కూల్ కు తన వల్ల ఏమి నష్టం వాటిల్లిందో అని భయపడుతూనే వెళ్లి ప్రిన్సిపాల్ మేడం గది ముందు నిలుచున్నాడు.
"కమిన్" అన్న అధికారస్వరానికి స్పందిస్తూ మేడం గదిలోకి వెళ్లి ఒదిగి నిలుచున్నాడు.
గంగాదాస్ 8వ తరగతి చదువుతున్న శ్వేత నీ కూతురేకదా! అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇస్తూనే అమ్మా! నా వల్ల కానీ మా అమ్మాయి వల్ల కానీ ఏమన్నా పొరపాటు జరిగితే ఈ తప్పు కాయండమ్మా!మీ దయవల్ల రోజుకింత తింటున్నాము. మా అమ్మాయి ఇంత గొప్ప స్కూల్ లో ఉచితంగా చదువుకుంటోంది. మన్నించండమ్మా .
అంటూ అర్ధించాడు.
ప్రిన్సిపాల్ మేడం అదికాదు గానీ Mother's day సందర్భంగా స్కూల్ పిల్లలకు essay competition పెట్టి mother గురించి వ్రాయమన్నాము. ఇదిగో మీ శ్వేత వ్రాసిన వ్యాసం. చదువు అన్నారు.
అమ్మా! నాకు చదువురాదు కదా! అనగానే ఒక టీచర్ ని పిలిపించి ఆ వ్యాసం చదివించారు మేడం.
ఆ వ్యాసం లో శ్వేత ఇలా వ్రాసింది.
Mother's day అనగానే అందరికీ అమ్మ గుర్తుకు వస్తుంది. కానీ నాకు మా నాన్నే గుర్తుకు వచ్చాడు. ఎందుకంటే నేను పుట్టిన మూడవ రోజునే మా అమ్మ చనిపోతే మా నాన్నే నన్ను పెంచారు. మా తాతగారు పెద్ద భూస్వామి. నాన్న యం.ఏ. చదివారు. మా తాత మా నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం చేసాడు. నాన్న ఒప్పుకోలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనన్న తండ్రి బెదిరింపుకు సమాధానంగా నన్ను తీసుకుని ఇంట్లోంచి వచ్చేసారు. బతకటానికి కాదు కాదు నన్ను బతికించటానికి బండలు కొట్టాడు. బరువులు మోసాడు. తను తిన్నా తినక పోయినా నాకు ఏ లోటు రానీయలేదు. నా పాదాలు కందకుండా నేలపై తన అరచేతులు ఉంచి నన్ను నడిపించాడు. చివరికి. .చివరికి.... నాకు మంచి చదువు రావాలని తను చదువు రానివాడనని చెప్పి ఇక్కడ తోటమాలిగా పని చేస్తున్నాడు. *నాకోసం అయినవాళ్ళను ఆస్తిని వదలుకొని వచ్చి నా కోసమే బతుకుతున్న మా నాన్నే నాకు అమ్మ*
*అమ్మ అంటే ఆడదే అయ్యుండ అవసరం లేదని మా నాన్న నిరూపించారు.*
ఇలా అమ్మ గురించి వ్రాయమంటే నాన్నగురించి వ్రాసినందుకు నన్ను తప్పుపడతారని తెలుసు.కానీ మా నాన్న గురించి వ్రాయకపోతే అమ్మదనానికే అన్యాయం చేసినదాన్నవుతాను.
అందుకే ..అందుకే. .
ఏడుపు ఆపుకోలేక ఆపై టీచర్ చదవలేకపోయింది.
ఒక్క నిమిషం నిశ్శబ్దం.
ఆ తర్వాత ప్రిన్సిపాల్ మేడం చెప్పింది.
గంగాదాస్! మీ శ్వేత వ్రాసిన ఈ వ్యాసం ప్రధమ బహుమతి పొందింది. అంతేకాక మా స్కూల్ విద్యార్థిని వ్రాసిన అత్యుత్తమ వ్యాసంగాన్ని దీనిని పటంకట్టి భద్రపరస్తున్నాము.
*కాకపోతే ఒక చిన్న కోరిక. రేపు జరిగే మా Mother's day celebrations కి నువ్వు ముఖ్య అతిథిగా వచ్చి ప్రధమ బహుమతిని నీ చేతుల మీదుగా శ్వేత కి అందించాలి. అంగీకరిస్తావా?
*ముగింపు మీ మనః స్పందనే!*

No comments:
Post a Comment