Pages

Friday, June 9, 2017

ప్రశ్న: వర్షం ఇతర గ్రహాల మీద కూడా పడుతుందా?

ప్రశ్న: వర్షం ఇతర గ్రహాల మీద కూడా పడుతుందా?


జవాబు: ఒక గ్రహం మీద వర్షం పడుతుందా, లేదా? అన్న విషయం ఆ గ్రహం పరిభ్రమణ కాలంపై ఆధారపడి ఉంటుంది. భ్రమణాక్షం పరిభ్రమణ కక్ష్య ఉపరితలానికి చేసే కోణాన్ని బట్టి, ఆ గ్రహం మీదున్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది. రుతువులకు కారణం కేవలం భ్రమణాక్షానికి, పరిభ్రమణ కక్ష్యోపరితలానికి మధ్య కోణమే. ఇది సున్నాగా ఉన్నా లేదా 90 డిగ్రీలు ఉన్నా రుతువులు తక్కువ. మన భూమికి ఉన్న కోణం సుమారు 23 డిగ్రీలు. అందువల్లే భూమికి ఆరు రుతువులు ఉన్నాయి. బుధగ్రహానికైతే అసలు రుతువులే లేవు. రేయింబవళ్లు, ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాలున్నాయి. ఆక్సిజన్‌ వర్షం, సోడియం వర్షం సంధ్యా సమయంలో వస్తాయి. శుక్రగ్రహం మీదైతే పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం అవుతాయి. ఇక్కడ కూడా భ్రమణాక్షానికీ, కక్ష్యా ఉపరితలానికీ ఉన్న కోణం చాలా స్వల్పం. కానీ రేయింబవళ్లు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వల్ల దాని పగలు, రాత్రి విస్తారం దాదాపు ఆరు నెలలు ఉంటుంది. అందువల్ల సంధ్యా సమయాల్లో అక్కడ కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ వర్షాలు పడతాయి. కుజ గ్రహం మీద నీటి ఆవిరి లేదు. అనేక ఉష్ణోగ్రతల్లో దాని వాతావరణంలో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌లు వాయురూపంలోనే ఉంటాయి. మిగిలిన సుదూర గ్రహాల ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉండటం వల్ల వాతావరణం వాయురూపంలోనే ఉంటుంది. అది ధ్రవీభవించి వర్షాలుగా మారటం కుదరదు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends



వర్షాకాలంలోనే జలుబెందుకు?

జలుబు, దగ్గులాంటివి వర్ష, శీతకాలాల్లోనే ఎందుకొస్తాయి. మిగిలిన కాలాల్లో ఎందుకు రావు?

 జలుబు సాధారణంగా వైరస్‌ వల్ల వస్తుంది. వాతావరణంలోనూ, తాగే నీళ్లలోనూ, దుమ్మూధూళి కణాలపైన వైరస్‌ ఉంటుంది. బ్యాక్టీరియా లేదా ఇతర జీవ కణాల ఆవాసం లేకుండా వైరస్‌లు వృద్ధి కాలేవు. మరో మాటలో చెప్పాలంటే జీవ కణాల లోగిట్లో కాకుండా బయట ఉంటే వైరస్‌లు దాదాపు నిర్జీవ పదార్థాల కోవకే చెందుతాయి. ఎండా కాలంలో విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మ జీవుల ఉనికి తక్కువగా ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు వాటిపై ఆధారపడే వైరస్‌లు కూడా తక్కువగానే ఉంటాయి. నీటి ఎద్దడీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడపడితే అక్కడ తడి ఉండదు. అందుకే వేసవిలో వైరస్‌ల వ్యాప్తికి అవకాశాలు తక్కువ. కాబట్టి జలుబు కలిగించే రైనో వైరస్‌ల ప్రభావం తగ్గుతుంది. వర్షాకాలంలో వర్షపు నీరు వివిధ పదార్థాల్ని మోసుకెళుతుంది. అవి తాగునీటి వనరుల్నీ కలుషితం చేస్తాయి. వైరస్‌ల వ్యాప్తికి దోహదపడతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత బ్యాక్టీరియా, దోమలు తదితర సూక్ష్మ జీవుల పెరుగుదలకు అనుకూలిస్తుంది. తద్వారా వైరస్‌ల వ్యాప్తీ ఎక్కువే.

No comments:

Post a Comment

.