బలభీమసేనుడు ఆచరించిన " నిర్జలా ఏకాదశి
తేది : 05 - 06 - 2017 , సోమవారము* రోజు నిర్జల ఏకాదశి కలదు.నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశి తిథులు వస్తాయి.ఈ 24 ఏకాదశిలలో *నిర్జలా ఏకాదశి* వైశిష్ట్యమేమిటో *శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్* మాటల్లో తెలుసుకుందాం.
ఈ ఏకాదశిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు ?*
నిర్జలా ఏకాదశిని " పాండవ ఏకాదశి " లేదా " భీమ ఏకాదశి అని పిలుస్తారు .
నిర్జల ఏకాదశిని ఎప్పుడు ఆచరించాలి ?*
జ్యేష్ట మాసము , శుక్ల పక్షములో వచ్చే ఏకాదశిని నిర్జలా ఏకాదశి అంటారు.జ్యేష్ట శుద్ధ ఏకాదశి తిథి రోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శక్తి పీఠం స్వామీజీ తెలుపుతున్నారు.
నిర్జల ఏకాదశి అంటే ఏమిటి ?*
ప్రతి మాసములో వచ్చే ప్రతి ఏకాదశి తిథి రోజు ఉపవాస వ్రతమును ఆచరిస్తారనే విషయము అందరికీ విదితమే.ఉపవాస వ్రతమును ఆచరించడమంటే ఎటువంటి ఘన పదార్థమును స్వీకరించకుండా ఉండుట. మిగితా ఏకాదశి తిథులలో ఉపవాస దీక్షలో భాగంగా ఘన పదార్థము త్యజించి అవసరార్థము ద్రవ పదార్థములను స్వీకరిస్తుంటారు.కాని జ్యేష్ట శుద్ధ ఏకాదశి రోజు ఘన పదార్థాలనే కాదు ఎటువంటి ద్రవ పదార్థాలను కూడా స్వీకరించకూడదు.ఈ ఏకాదశి రోజు కనీసం నీటిని కూడా తాగకూడదు.ఈ రోజు కనీసం జలమును కూడా స్వీకరించరు కావున ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అనే పేరు వచ్చింది.జలము అంటే నీరు.నిర్జలము అంటే నీరు లేకుండా అని అర్థము.
నిర్జల ఏకాదశి మిగితా ఏకాదశుల కంటే ఎందుకు విశిష్టమైనది ?*
ప్రతి ఒక్కరు తప్పని సరిగా ప్రతి నెలా వచ్చే ఏకాదశి తిథిన ఉపవాస దీక్షను ఆచరించాలని శాస్త్రాల్లో పేర్కొనబడినదని శక్తి పీఠం స్వామీజీ తెలుపుతున్నారు.నిర్జల ఏకాదశి వ్రతాన్ని శ్రధ్ధా భక్తులతో ఆచరిస్తే సంవత్సరములో వచ్చే మిగితా అన్నీ ఏకాదశి వ్రతాలను ఆచరించిన పుణ్య ఫలము ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వస్తుందని సాక్షాత్తు వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు కావున సంవత్సరములో వచ్చే మిగితా అన్నీ ఏకాదశుల కంటే నిర్జల ఏకాదశి విశిష్టమైనదని స్వామి శాంతానంద పురోహిత్ తెలుపుతున్నారు.
ఈ ఏకాదశికి పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది ?*
ఈ నిర్జల ఏకాదశి మహత్వాన్ని స్వయంగా వేదవ్యాస మహర్షి భీముడికి తెలియ చేసాడు.వేదవ్యాసుల ద్వారా నిర్జల ఏకాదశి విశిష్టతను తెలుసుకొని భీముడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు కావున ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు వచ్చింది.భీముడు పాండవ ద్వితీయుడు కావున పాండవ ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది.
స్వామి శాంతానంద పురోహిత్_శక్తి పీఠం వ్యవస్థాపకులు_ నారాయణపేట
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
No comments:
Post a Comment