Telugu Friendz Book.
messages in telugu,
news in telugu,
gk in telugu, whats app messages in telugu, wishes in telugu, quotations in telugu, short stories in telugu, neeti kathalu, biography in telugu, whatsup in telugu,
రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!
ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.
ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.
కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....
ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....
ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది.....
అందం అంటే కంటికి కనిపించే
ముఖంలోనూ,మేనులో కాదు..
ఉన్నతమైన అలోచనలు
ఉన్నతమైన భావాలు ఉన్న
మంచి మనసులో ఉంటుంది...
సర్వే జనఃసుఖినో భవంతు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.
18 పురాణాల పేర్లు ...
1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11.అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం
15. బ్రహ్మవైవర్త పురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండ పురాణం
18. భవిష్యపురాణం
ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
*మత్స్యపురాణం*: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
*కూర్మపురాణం*: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
*వామన పురాణం*: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
*వరాహపురాణం*: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
*గరుడ పురాణం*: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి.
*వాయుపురాణం*: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
*అగ్నిపురాణం*: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.
*స్కాందపురాణం*: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
*లింగపురాణం*: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
*నారద పురాణం*: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
*పద్మపురాణం*: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
*విష్ణుపురాణం*: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
*బ్రహ్మపురాణం*: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
*భాగవత పురాణం*: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
*బ్రహ్మాండ పురాణం*: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
*భవిష్యపురాణం:* సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
*బ్రహ్మాపవైపర్తపురాణము*
ఇందులో గోలోకప్రశంస . భోజననియమాలు.రోగనివృత్తిసాధనాలు.తులసీ, సాలగ్రామమహత్త్వాలు.హోమములోస్వాహకార ప్రాధాన్యము మొ. విషయాలు ఇందువివరించబడ్డాయి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
ఒక బీద కుటుంబంలో 5గురు సభ్యులు ఉన్నారు.
ఒక తండ్రి, తల్లి, ముగ్గురు పిల్లలు. తండ్రికు ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు.
ఒక రోజు తండ్రి చనిపోయాడు. 3రోజుల వరకు బంధువులు ఆహరం పంపించారు.
తరువాత
ఆకలితో భరించాల్సిన రోజులు వచ్చాయి.
తల్లి కొన్ని రోజులు ఎలాగో అవస్థలు పడి పిల్లలకి ఆహారం పెట్టగలిగింది.
కానీ తరువాత ఆహారం లేక ఆకలితో ఉండవలసి వచ్చింది.
ఆకలితో ఉండటం వలన 8 సం,, బాబుకి జ్వరం వచ్చింది
ఆ బాబు మంచంలో ఉన్నాడు.
ఒకరోజు 5సం,, పాప వాళ్ళ అమ్మని అడిగింది
అమ్మ!! అన్నయ్య ఎప్పుడు చచ్చి పోతాడు.....??
అప్పుడు అమ్మ, పాపని అడిగింది ఎందుకు అలా అడుగుతున్నావు అని
అమ్మాయి బాధతో సమాధానం చెప్పింది
.ఆ సమాధానం విని అందరికీ అప్పుడు ఏడుపొచ్చింది..
సమాధానం ఏంటంటే!
"ఆన్నయ్య చచ్చిపోతే మన ఇంటికి ఆహారం వస్తుంది కదా...!"
ప్రియమైన సోదర సోదరీ మణులరా! మన దగ్గర ఉన్న ఆహారం బీద ప్రజలకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వటం మన హక్కు కూడా.
మీరు ప్రతి మెసేజ్ షేర్ చేస్తారు. అయితే
కొంచెం మీ సమయాన్ని ఈ మెసేజ్ షేర్ చేయటానికి కేటాయించండి.
పైన ఉన్న భగవంతుడు మన అందరి కష్టాలు తీరుస్తాడు
అందరు చదవండి, షేర్ చేయండి.
మీ ఇంట్లో ఎప్పుడైనా ఏవైనా విందులు, వినోదాలు జరిగితే
ఆహారం ఏమైనా మిగిలితే
మీరు వెంటనే 1098 కి కాల్ చేయండి.
..."ఇది హాస్యానికి కాదు -
చైల్డ్ హెల్ప్ లైన్"....!
వాళ్ళు వచ్చి మీ ఆహారాన్ని తీసుకుంటారు.
దయచేసి ఈ మెసేజ్ త్వరగా షేర్ చేయండి.
ఈ మెసేజ్ పంపటం వలన బీదవారికి ఆహారం దొరుకుతుంది
దయచేసి..... షేర్ చేయండి
తెలియజేయండీ....
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు
వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం
ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .
చీకటి పడితే ఎలా?
దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు
( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది ..
అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?
ఏమి చేస్తాడు .?
ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?
టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని
గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు
ఆమె భయపడుతూనే ఉంది .
" నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి
కారులో పెట్టాడు ..
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు...
మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ...
అదొక చిన్న హోటల్ .
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ
తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర
తేవడానికి వెళ్ళింది .
తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు
సహాయపడు . " అని రాసి ఉంది..
ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని....
ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!
భగవంతుడే మనకు సహాయం చేశాడు .
ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా..
మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!
మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.. థాంక్స్..
Iam not the writer ... Received from one of the friends... Message is good Hence forwarding as received....
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిభందనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file
" e-filing "
e-filing ను Pan No తో Register చేసుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు సంస్ధలు, వ్యక్తులు e-filing ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక సాదనం.
ఉపాయోగాలు :
* తమ వ్యక్తిగత ఖాతా లలో జమ అయ్యె ప్రతి మొత్తానికి Tax చెల్లించనవసరం ఉండదు.
*ఉద్యోగులు నెలవారి చెల్లించే Advance Income Tax వలన Quarter లో చెల్లించవలసిని Tax కంటె ఎక్కువ / తక్కువ చెల్లించినవారికి IT Dept. నుండి Notice లు రావు.
*Tax ఎక్కువ చెల్లించవసినా రాబోవు తదుపరి Quarters లో చెల్లించవచ్చు.
*Tax ఆదనంగా చెల్లించిన వారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది.
DDO లు తమ ఉద్యోగులు నెలవారిగా చెల్లించిన Advance Tax ను ప్రతి Quarter లో TDS update చేయించుండాలి.
అలా చేయని DDO లకు రోజుకు Rs.200/- అపరాద రుసుము చెల్లించవలసి ఉంటుంది.
💐💐Income tax return e- Filing Anywhere Anytime💐💐
*ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:*
పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు జులై 31 లోగా
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.
ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.
*దాఖలు చేయవలసిన విధానం:*
వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.
ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.
*పేరు రిజిస్టర్ చేసుకొనుట:*
incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
*ఫారం 26 AS:*
ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.
*ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:*
ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.
*ఇ- ఫైలింగ్ చేయడం:*
ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.
*PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.* లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.
అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
*ఎకనాలెడ్జ్మెంట్:*
ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.
ఆదాయపు పన్ను *రిటర్నుల దాఖలుకు.. సిద్ధమయ్యారా?*
ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2016-17 ఆర్థిక సంవత్సరానికి (2017-18 అసెస్‌మెంట్ ఇయర్)గాను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి, రిటర్నులు దాఖలు చేసేప్పుడు పరిశీలించాల్సిన అంశాలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం!
చెల్లించాల్సిన పన్ను చెల్లించాం.. ఇక రిటర్నులు దాఖలు చేయకపోతే ఏమిటి? చాలామంది ఇలాంటి ఆలోచనతో ఉంటారు. కానీ, ఇది పొరపాటు. ఆదాయం రూ.2,50,000 (60ఏళ్ల పైబడిన వారికి రూ.3,00,000) దాటిన ప్రతి ఒక్కరూ.. పన్ను చెల్లించినా.. చెల్లించకపోయినా కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. భవిష్యత్తులో ఇంటి, వాహన, ఇతర రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించిన ఆధారమే కీలకమవుతుంది. ముఖ్యంగా పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉండి, పన్ను చెల్లించినప్పుడు, పన్ను మొత్తాన్ని బట్టి.. అందులో నుంచి గరిష్ఠంగా రూ.5వేలు రాయితీ లభిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలు సరళం చేసే విధానంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటోంది. ఆదాయాలు, అవి వచ్చిన మార్గాలను బట్టి, సరైన ఫారం ఎంచుకోవాలి. గతంతో పోలిస్తే.. ఇప్పుడు రిటర్నుల ఫారాల సంఖ్యను కూడా తగ్గించింది. ఉదాహరణకు వృత్తి, వ్యాపారం మార్గాల ద్వారా ఆదాయం ళవచ్చిన వారు కాకుండా మిగతా ఎవరైనా సరే.. ఐటీఆర్ 2ను నిరంభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకాలస్యం... రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని వివరాలతో సిద్ధమవ్వండి. ఐటీఆర్ 1/సహజ్ ఉద్యోగం, ఒక ఇంటిపై ఆదాయం, పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నప్పుడు ఈ ఫారాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతో సులభమైన పత్రం. లాటరీ ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారం వర్తించదు. వేతన జీవులు కొన్ని నిబంధనలకు లోబడి ఈ ఫారాన్ని వినియోగించుకోవాలి. * మొత్తం ఆదాయం రూ.50లక్షల లోపు ఉండాలి. * కేవలం ఒక ఇల్లు ఉన్నప్పుడు * వడ్డీ ద్వారా ఆదాయం వస్తున్నప్పుడు ఈ రిటర్నులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్లు: 80ఏళ్లు, ఆపైన ఉన్నవారు తమ ఆదాయం రూ.5లక్షలలోపు ఉన్నప్పుడు సహజ్ (ఐటీఆర్ 1)లో తమ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే తప్పనిసరిగా చేయాలనే నిబంధన లేదు. ఐటీఆర్ 2: ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్)లు అందరూ ఈ ఫారాన్ని వినియోగించుకునే వీలుంది. ఈ ఫారాన్ని వినియోగించుకునేప్పుడు.. అసెసీలు అన్ని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాలను ఇందులో తెలియజేసేందుకు వీలుంటుంది. వేతనం, ఇంటి ద్వారా వచ్చిన ఆదాయం, మూలధన రాబడి, వడ్డీ, లాటరీ ద్వారా ఆదాయం ఇలా ఏ ఆదాయాలనైనా ఇందులో చూపించుకోవచ్చు. అయితే, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయం ఉన్నవారికి ఈ ఫారం వర్తించదు. అసెసీకి తమ ఆదాయాన్ని వెల్లడించే క్రమంలో ఏ ఫారం వర్తిస్తుందోననే అనుమానం ఉన్నప్పుడు ఐటీఆర్ 2 ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులను దాఖలు చేయడం ఉత్తమం.
నగదు జమ చేశారా?*
ఈసారి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేమిటో తెలుసా? పాత పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత అంటే.. నవంబరు 9, 2016 నుంచి డిసెంబరు 30, 2016 వరకూ బ్యాంకులో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేశారా? అనేది.. ఒకవేళ మీరు రూ.2లక్షల విలువకు మించి ఈ నోట్లను జమ చేసినప్పుడు ఆ వివరాలను కచ్చితంగా పేర్కొనాల్సిందే. ఇవీ ముఖ్యమే... * షేర్లలో లావాదేవీలు నిర్వహించినప్పుడు లాభం వచ్చినా.. నష్టం వచ్చినా తప్పనిసరిగా పేర్కొనాల్సిందే. మీరు తెలియజేయకపోయినా.. ఎక్స్ఛేంజీల ద్వారా ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. * ఆర్థిక సంవత్సరంలో రూ.30లక్షలకు మించి ఏదైనా ఆస్తిని కొన్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేయాలి. * ఆస్తిని అమ్మినప్పుడు: ఏదైనా ఆస్తిని అమ్మినప్పుడు దానిపై వచ్చే మూలధన రాబడిని గణించి, ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను రిటర్నులలో దాఖలు చేయాలి. మూలధన లాభంపై పూర్తి మినహాయింపు పొందుతున్నా రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం.
ఆస్తి అమ్మిన వివరాలు వెల్లడించేప్పుడు.. సెక్షన్ 50సీ ప్రకారం రిజిస్ట్రేషన్ విలువనే కనీస అమ్మకపు విలువగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధరకన్నా తక్కువకే అమ్మినట్లు చూపించినా.. నిబంధనలు అంగీకరించవు. అదే సమయంలో కొనుగోలుదారులు కూడా రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధర మేరకే, దస్తావేజు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఈ రెండింటి మధ్య తేడా ఉంటే.. ఆ మేరకు కొనుగోలుదారుడి ఆదాయంగా పరిగణిస్తారు. పన్ను భారం పడే అవకాశం కూడా ఉంది. * ఈ లావాదేవీలను పేర్కొనేప్పుడు సంబంధిత పత్రాలు, ఆధారాలను ఒకసారి నిశితంగా పరిశీలించండి. ఆధారాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి.
మీ రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు ఎంచుకున్నప్పుడు ఈ ఆధారాలు మీకు ఉపయోగపడతాయి. అనుసంధానం చేయాల్సిందే... మీ పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేస్తేనే ఈ ఫైలింగ్ చేయగలరు. ఆదాయపు పన్ను శాఖ ఈఫైలింగ్ వెబ్‌సైటులోకి ప్రవేశించగానే.. మీ పాన్‌ను, ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిందిగా అడుగుతుంది. ఇక్కడ మీ పాన్ కార్డులో ఉండే సమాచారం అంటే.. పుట్టిన తేదీ, పేరు తదితర వివరాలు ఆధార్ సమాచారంతో సరిపోవాలి. పేరు వివరాలు కొంత అటుఇటూగా ఉన్నా.. పుట్టిన తేదీ.. స్త్రీ/పురుష వివరాలు, మొదటి, మధ్య, చివరి పేర్లలో ఏ రెండు సరిపోయినా ఆధార్ అనుసంధానం తేలికగానే పూర్తవుతుంది. ప్రధానంగా పుట్టిన తేదీలో తేడా ఉంటే మాత్రం అనుసంధానం కష్టమే. ఆధార్ అనుసంధానం సాధ్యం కాకపోతే.. వెంటనే మీ పాన్ కార్డు వివరాలతో, ఆధార్ కార్డు వివరాలు సరిపోయేలా ఆధార్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోండి. రిటర్నులు దాఖలు చేసేప్పుడు కూడా కచ్చితంగా ఆధార్ నెంబరును పేర్కొనాల్సిందే.
ఈ వెరిఫై చేయండి! ఆదాయపు పన్ను శాఖ పన్ను వెబ్‌సైటు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైటులో మీరు రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. మీరు, ఇప్పటికే ఈ వెబ్‌సైటులో నమోదు చేసుకొని ఉంటే.. మీ యూజర్ ఐడీ(పాన్), పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఆధారంగా వెబ్‌సైటులోకి వెళ్లవచ్చు. ఒకవేళ మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోతే.. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను పెట్టుకోవచ్చు. మీరు ఇప్పటికే ఈ ఫైలింగ్ వెబ్‌సైటులో నమోదు చేసుకొని ఉన్నారనుకోండి... మీ బ్యాంకు ఆన్‌లైన్ ఖాతా నుంచి కూడా ఈ వెబ్‌సైటులోకి ప్రవేశించే వెసులుబాటు ఉంది. (బ్యాంకు ఖాతాకు పాన్ అనుసంధానమై ఉండాలి). గతంలోలాగా రిటర్నులు దాఖలు చేయగానే వచ్చే అక్నాలజ్‌మెంట్‌ను సీపీసీ, బెంగళూరు కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదిప్పుడు. రిటర్నులు సమర్పించిన వెంటనే ఈ వెరిఫై చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు ఉంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ప్రవేశించినప్పుడు ఈ వెరిఫై చేసుకోవడం ఎంతో సులభం. ఈ వెరిఫైను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సిందిగా క్లిక్ చేస్తే చాలు. వెంటనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేనివారు, ఆధార్ ఆధారిత ఈ వెరిఫై చేసుకునే వీలుంది. రూ.5లక్షలలోపు ఆదాయం ఉండి.. ఎలాంటి రిఫండ్ కోరకపోతే.. ఈ ఫైలింగ్ వెబ్‌సైటు నుంచి ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ)ని పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా ఈ వెరిఫై చేసుకోవచ్చు. మినహాయింపులు చూసుకోండి.. ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాన్ని పూర్తి చేసే ముందు వివిధ సెక్షన్ల కింద కోరాల్సిన మినహాయింపులన్నీ క్లెయిం చేసుకున్నామా లేదా సరిచూసుకోవాలి.
*🔸కొన్ని ముఖ్యమైన మినహాయింపులను పరిశీలిస్తే...*
సెక్షన్ 80C: ఆదాయపు పన్ను మినహాయింపు కోరేందుకు కీలకమైన సెక్షన్ ఇది. ఇందులో పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం, జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియం, గృహరుణానికి చెల్లించిన అసలు, పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజులతోపాటు, పన్ను ఆదా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఇవన్నీ ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ దీని కింద మినహాయింపు కోరవచ్చు. దీనికి అదనంగా సెక్షన్ 80-C-C-D(1) కింద రూ.50వేల వరకూ అదనపు మినహాయింపు ఎన్‌పీఎస్‌లో మదుపు చేయడం ద్వారా పొందవచ్చు. సెక్షన్ 80CCG: రాజీవ్ గాంధీ ఈక్విటీ పొదుపు పథకం (ఆర్‌జీఈఎస్‌ఎస్)లో మీరు మదుపు చేసి ఉంటే.. ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరవచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.50వేల వరకూ మదుపు చేసే వీలు ఉండేది. మదుపు చేసిన మొత్తంలో 50శాతం వరకూ పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. వార్షిక స్థూల ఆదాయం రూ.12లక్షల లోపు ఉండి, కొత్తగా మార్కెట్లో మదుపు చేసే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. పెట్టిన పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది.
*🔸సెక్షన్ 80D:*
60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి రూ.25వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లయితే ఈ పరిమితి రూ.30వేలు. మీపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియానికీ రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. వారు సీనియర్ సిటిజన్లయితే రూ.30వేల వరకూ మినహాయింపును అనుమతిస్తారు. వీటికి అదనంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెచ్చించిన మొత్తానికి రూ.5వేల వరకూ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. అంటే, ఈ సెక్షన్ కింద దాదాపు రూ.55వేల వరకూ (వాస్తవంగా ఖర్చు చేసినప్పుడు) మినహాయింపు పొందే వెసులుబాటు ఉంది. వీటితోపాటు.. వైద్య చికిత్స కోసం వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తాన్ని రూ.30వేల వరకూ కూడా మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. సెక్షన్ 80DD: వైకల్యం ఉండి, తనపై ఆధారపడిన వారికి వెచ్చించే వైద్య ఖర్చులకు ఈ సెక్షన్ కింద మినహాయింపులు పొందవచ్చు. పాక్షిక వైకల్యం ఉన్నప్పుడు రూ.75వేల వరకూ.. తీవ్ర వైకల్యం ఉన్నప్పుడు రూ.1,25,000 వరకూ ఈ మినహాయింపు లభిస్తుంది.
*🔸సెక్షన్ 80DDB*:
పన్ను చెల్లింపుదారుడు లేదా అతని మీద ఆధారపడిన వారికి రూల్ 11డీడీ(2)లో పేర్కొన్న తీవ్ర వ్యాధులు ఉన్నప్పుడు వెచ్చించే ఖర్చులపై గరిష్ఠంగా రూ.40 వేల వరకూ మినహాయింపు కోరవచ్చు. 60ఏళ్లు దాటిన వారైతే గరిష్ఠంగా రూ.60 వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. సెక్షన్ 80E: సొంతంగా విద్యాభ్యాసం కోసం రుణం తీసుకున్నా.. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యారుణంపై చెల్లించే వడ్డీకి ఈ సెక్షన్ కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80EE: గృహరుణం తీసుకొని, దానికి వడ్డీ చెల్లిస్తున్నప్పుడు మినహాయింపు ఈ సెక్షన్ కింద ప్రత్యేక మినహాయింపు పొందే అవకాశం ఉంది. అదెప్పుడంటే.. * రుణం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు నుంచి రూ.35లక్షల లోపు గృహరుణం తీసుకొని ఉండాలి. * మీరు తీసుకున్న ఇంటి విలువ రూ.50 లక్షలకు మించి ఉండకూడదు. * రుణం మంజూరైన తేదీ నాటికి అసెసీ పేరు మీద మరో ఇల్లు ఉండి ఉండకూడదు. * వడ్డీ మొత్తం రూ.50వేల వరకూ ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరవచ్చు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
బ్రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడు...తన వన్ మిలియన్ డాలర్ ఖరీదుగల
బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే..
నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని...
వన్ మిలియన్ డాలర్ కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా తిట్టారు కూడా..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని..
చాలామంది చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఉన్నారు..!!
పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు..!!
ఆ తతంగాన్నిఅందరూ ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఉన్నారు..!!
కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..??
మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!!
దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!!
దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం
తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!!
కానీ మీరు మాత్రం...
వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..ఎత్చ్..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి..!!
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి..!!
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..??
కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??
.
.
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేము..!!
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!!
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..??
ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడాను..!! " అని చెప్పాడు.
నవ్వుతూ ఉన్నవాడు...నాలుగు రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు...భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు...చనువుతో మాట్లాడతాడు కోపంతో ఉన్నవాడు...కేకలు వేసి మాట్లాడతాడు మంచివాడు...మార్పుకోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు...చులకనగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది మౌనం మన మనస్సుని మారుస్తుంది.
కాళ్ళతోనే !!
2. కాళ్ళు కష్టపడితే , ఒళ్ళు సుఖపడుతుంది !
3. కాళ్ళు ముందడుగువేస్తే
రోగం వెనుకంజ వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు ,
పరిచయాలనీ మెరుగుపరుస్తుంది
5. కాళ్ళు రోడ్డునపడితే ఒళ్ళు తేలికపడుతుంది
6. నవ్వుతూ నడవండి సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే
కాళ్ళమీద ప్రయాణం కావాలోయ్ !
8. కలసి నడుద్దాం , వెతలు మరుద్దాం !
9. కాళ్ళు రోడ్డున పడితే జబ్బులు దిగాలు పడతాయి !
10. రోగానికి లింగభేదం లేదు!
వయోభేదం లేదు !
కులమతాల రిజర్వేషన్లు అసలులేవు !
నడకకూ అంతే !
11. ఉదయపు నడకకు రారండి !
ఉచితంగా విటమిన్ " డి " పొందండి !
12. stay fit , walk a bit
13. long walk everyday !
keeps ది medicin away !
15. కాళ్ళు రోడ్డెక్కి తే
రోగం అటకెక్కుతుంది !. Yes a good message, WALKING is
Mother of Health
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది.
ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు.
అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది.
వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు. వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని
‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్.
మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు.
ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి. అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్.
ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.
లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు.
నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు.
కానీ అదీ సంస్కారం అంటే..
అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే...
అదీ తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడమంటే...
లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ ‘‘ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తుచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే.
మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు.
అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు.
అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు.
ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు.
నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను.
ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు.
అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
సినారె పేరు తలవగానే గురుతొచ్చే మధుర సమాస బంధుర గేయం 'చెల్లెలి కాపురం' చిత్రంలోని 'చరణకింకిణులు' పాట.
ఈ చిత్రంలోని నాయకుడు ఓ అమాయకుడైన కవి. తన చెల్లెలి పెళ్ళి చేయడానికి తన కవితలను పబ్లిషర్లకిచ్చి ఆ వచ్చే డబ్బును ఉపయోగించుకుందామనే ఆశతో పట్నం వస్తాడు.పట్నం వచ్చాక గాని అసలు విషయం బోధపడదు. ఓ మోసగాడి చేతిలో కీలుబొమ్మవుతాడు. అదీ చెల్లెలి కోసం!
నాయిక అసలు విషయం పసిగట్టేస్తుంది.అసలు కవిని బయటపెట్టటానికి ఓ ఛాలెంజ్ విసురుతుంది.
ఆ సందర్భంలో పాట ఇది.
నాయిక నృత్యధర్మంగా కాళ్ళు కదిలిస్తుంది. గజ్జె ఘల్లుమనిపిస్తుంది. వెంటనే కవి వేగంగా స్పందిస్తాడు......
నర్తకి పదవిన్యాసాలకు తగిన పదాలతో పాదాలల్లి
సంగీతనృత్యభారతి పాదాలకు సమర్పించాడు సినారె.
ఇక్కడ మనకు ఓ చిన్న సందేహం వస్తుంది. నృత్యం చేసేది మగ నెమలి ఆడ నెమలి కాదు. మరి కవి సమయాలు బాగ తెలిసిన సినారె ఎందుకిలా రాశారు. అప్పటికే 'నాట్యమయూరి' లాంటి పదప్రయోగాలుండడం, నాట్యానికి స్త్రీత్వానికి ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా స్త్రీ వాచకంగానే ప్రయోగించానన్నారు సినారె.
'నీ కులుకును గని నా పలుకు విరియ
నీ నటనను గని నవకవిత వెలయగా
ఆడవే మయూరీ'
కథా సన్నివేశం నటనకు తగ్గ కవిత కాబట్టి నీ కులుకుకు తగ్గ కవితనే విరియజేస్తానన్నాడు నాయకుడు. సాత్వికంగానే ప్రారంభించి మెల్లమెల్లగా కరుణ రసం చిలికించి ఇక రౌద్రరసాన్ని పలికిస్తాడు. రౌద్రానికి అనువైన సంస్కృత సమాసాలను అలవోకగా అవలీలగా గుప్పించేశాడు సినారె.
ఒక్కసారిగా సినారె లోని కవి సుడిగాలిలా బయటపడిపోయాడు. వినేవాళ్ళకు ఏమీ అర్ధం కాకపోయినా ఒక్క ముక్క పలకలేకపోయినా సరే మనలనందరినీ కైలాసశిఖరాన ప్రమదుల మధ్యన లయతాండవాన్ని చేస్తున్న పరమశివుని సన్నిధిని చేర్చేశాడు సినారె.
ఆయనే వేరే పాటలో చెప్పినట్టు 'ఏ కొండ కొమ్ముపైనో దైవమ్ము దాగెనంటూ తపియించనేల' చందాన మనందరికీ శ్రమ లేకుండానే కైలాసాన్ని చూపించేశాడు. కవి సమర్ధుడైతే ప్రేక్షకుడ్ని ఎక్కడికైనా తీసుకుపోగలుగుతాడు.
ఈ చరణంలో ప్రతీ సుదీర్ఘసమాసానికి మధ్యన కొంత విరామముంది. నర్తకి భావాన్ని అభినయించడానికి! మరి పందెం నెగ్గాలంటే నర్తకి తడబడాలి. అలా చెయ్యాలంటే నర్తకిని ఊపిరి సలుపనీయకూడదు.
అందుకే ఎలా విరుచుకు పడుతున్నాడో చూడండి ...
'కనులలోన కనుబొమలలోన
అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటిసీమలోన
కరయుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన
అభినయించి ఇక
ఆడవే..ఆడవే..ఆడవే..'
చివరివరకూ పదాలకు సరిసమానంగా అభినయించిన నర్తకి ఈ పదాల ఉప్పెనకు తట్టుకోలేక పోయింది. గజ్జెలొదిలేసింది...దాసోహమంది.
సినిమాపరంగా ఎలాగున్నా సినారె పదచాలనానికి లోకం దాసోహమంది. సినిమా ప్రజాహృదయాలలో హత్తకు పోయింది.
ఇక్కడ ఇంకొన్ని ముచ్చట్లు:
ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన కెరీర్ కు మైలురాయి. సంస్క్రత సమాసాలను ఘంటసాల తప్ప వేరెవరూ పలకలేరు అనుకుంటున్న ఆ తరుణంలో బాలుగారు ఈ పాటతో అటువంటి ఆలోచనలను పటాపంచలు చేశారు. ఈ సంస్కృత సమాసాలను ముందుగా సినారె చేత అనిపించి రికార్డ్ చేసి తరువాత బాలుగారి చేత పాడించారట! సినారె గారి కంఠం పలుకులు ప్రముఖ నటుడు ఈ చిత్రనిర్మాత
అయిన బాలయ్య గారి దగ్గర ఉన్నాయట!
వాటిని శ్రోతలకు అందిస్తే బాగుణ్ణు!!!
జయహో సినారె!
జయజయహో సినారె!!!
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం. దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా.
నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.....నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది దివికి దివికి దిమాడి.....గుబుకు గుబుకు గుమాడి.....దివికి దివికి దిమాడి ....గుబుకు గుబుకు గుమాడి....... అంటూ పెద్ద గా ఈల వేసుకుంటూ, ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. ఒరేయ్....ఇలా రారా ! మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. భయం తో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత ఆతృత తోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని. అంతలోనే ధామ్...ధామ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడేసరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా.
వెధవా......నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే, నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది.
తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక , పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు.
ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. అతనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. ఆ తరువాత శీను వాళ్ళ నాన్నగారికి వేరే వూరు బదిలీ అవడంతో , ఆ వూళ్ళో కాలేజీ లో చేరిపోయేడు.
రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి.
తెలుగు మాస్టారి చిన్న అమ్మాయి కి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేరు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం, తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.
కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియా లో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమి ని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు.
అబ్బే.....కుదరదండి. రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి. మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయం లో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి.......అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్. చేసేది లేక మాష్టారు, మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న ఆ కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు.
సర్....ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు....కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట....ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.....అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ.
కాసేపు ఫైల్ ని క్షుణ్ణం గా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.
రండి....కూచోండి. మీ వివరాలన్నీ చూసాను. అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు, అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీ ని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు.
మాస్టారు ఉప్పొంగిపోయేరు. గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది. అంటూ కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు.
అయ్యో.....మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు. కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టారు.
కొఱకున్, కై ......ప్రజల కొరకు , ప్రజల కోసం పోరాడటం..... చతుర్ధీ విభక్తి ...!
వలనన్, కంటెన్, పట్టి.....ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....పంచమీ విభక్తి ....!
కిన్, కున్, యొక్క, లోన్, లోపల.....వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే.....షష్టీ విభక్తి...!
అందున్, నన్.......అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.....సప్తమీ విభక్తి...!
ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం.....అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!! అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు (కన్) నీటి కుండల్లా వున్నాయి.
అవును మాస్టారు.....నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి......అన్నాడు మంత్రి శీనయ్య!!!
నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసక గా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.
కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు.....అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో , మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....చూస్తున్నారుగా......ఇపుడిలా
మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......ఆ భూమి ని మాత్రం అమ్ముకోవద్దు. మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి .....ఇది నా విన్నపం. కాదనకండి....అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య ఉరఫ్ శీను. గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.
సార్ .....మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట. మరేమి ఫరవాలేదు ....హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట .....అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ .....వచ్చి చెప్పాడు సెక్రటరీ.
మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ ......తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.
ఆ ఇద్దరూ అంతలా పకా,పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.....
college నుంచి ఇంటికి వస్తూనే smartఫోన్ తీసుకుని వేగంగా గదిలోకి వెళ్తున్న కూతుర్ని చూసిన .అమ్మ ..ఆరోజు సాయంత్రం ఇంటి మీద ఇలా తన కూతురి తో అన్నది.
friends నుంచి ఏమి msg ..requests వచ్చాయి ..whatsapp లో ఏమి వీడియోస్ send చేసారో ఇవన్నీ నీ జీవిత ఎదుగుదలకు ఏమి ఉపయోగ పడవు.*
facebook లో అనవసర స్నేహితుల లిస్టు పెంచుకొనేకొద్దీ వాళ్ళు పోస్టు చేసే అనవసరమైనవన్నీ ...వారితో సొల్లు కబుర్లు (goodmorning నుంచి goodnight ) ఇవేవి నీకు కీర్తిని గెలుపును ఇవ్వవు .*
నీకు తెలుసా అనవసరమైన ఆందోళనలు అలోచనలు ఈ chating వల్ల వస్తాయి*
గ్రద్దలా ఎగరాలంటే వాటి గురించి తెలుసుకోవాలి వాటితోనే స్నెహం చెయాలి కానీ కోళ్ల వెంటే తిరిగితే ఎప్పటికీ ఎగరలేవు*
.గెలుపు గురించి ఆలోచించు గెలిచే వారిగురించి తెలుసుకో అదే విజయ సూత్రం .*
college లో మంచి చెడు స్నేహాలు రెండు వుంటాయి ..మంచి స్నేహితుల ను ఏర్పరుచుకో. lecturers ను గౌరవించు. ఏమి doubt వచ్చిన clarify చేసుకో ..అతిచనువు ఆరాధన ప్రమాదకరం ..*
ఇప్పుడున్న కాలం లో ...అమ్మాయిలు చాల తెలివిగా ఉండాలి*
ఎవరినైనా ఏ విషయాన్ని అయిన అనేక కోణాల్లో ఆలోచించాలి.*
సాధారణంగా టీనేజ్ లోవచ్చే ...అన్నీ నాకు తెలుసు అనే భావన వదిలేయాలి.*
ప్రతి విషయాన్ని తల్లి తండ్రి దగ్గర దాచే గుణం ప్రమాదకరం.*
కోపం విసుగు చిరాకు తగ్గించుకోవాలి*
ఆకర్షణలకు దూరంగ ఉండాలి.*
సినిమా ల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి . సినిమా కల్పితం అని జీవితం నిజమైనది అని గ్రహించాలి.*
ముఖ్యంగా సెల్ phone వాడటం లో ఎన్నో మెళుకువలు నేర్చుకోవాలి. అవసరమైతేనే ఉపయోగించే నేర్పురావాలి .*
Facebook లో అనవసర ఫ్రెండ్స లిస్టు పెంచుకొవడం థానిని వ్యసనంగా మార్చుకోవడం మానివేయాలి. ఇన్స్పిరేషనల్ బుక్స్ స్టోరీస్ ...విజేతల గురించి తెలుసుకోవడం చెయాలి*
నీ విలువైన సమయాన్ని ఇతరులు వాడుకొనే విధంగా చెసుకోవద్దు*
ఇలాంటివి ఎన్నో మన knowledge ను మానసిక వికాసాన్ని కలిగిస్తాయి ☆గెలుపు అనందం చూడాలంటె శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది .
చివరగా ఒక మాట కాలక్షేపం అంటే నీ కాలాన్నీ వృథా చేసే friends కన్నా నీ శ్రేయోభివృద్ధికీ అహర్నిశలు శ్రమించే అమ్మ నాన్నను ప్రేమించు ...
వారి కలలు నిజం చేయి ..
వారినీ మోసం చూస్తే నీవే మోసపోతావు ...
కస్టపడి కాదు ఇష్టపడి చదువు ....విజయం నీదే ....
రాష్ట్రపతిని ఎవరు, ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందామా..!
భారత రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు (ఎంపీలు), రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
ప్రస్తుతం రాజ్య సభలో 233 మంది, లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉండగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం 4120 మంది ఉన్నారు.
ఈ క్రమంలో అందరినీ కలిపితే ఆ సంఖ్య 4896 అవుతుంది.
వీరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. . రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ మెంబర్లు అని పిలుస్తారు.
వీరో పోలింగ్ రోజున ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేస్తారు.
ఈ క్రమంలో ఎంపీలకు గ్రీన్ బ్యాలెట్ స్లిప్‌లను, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ స్లిప్‌లను ఇస్తారు.
వారు ఆ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేయాలి. అయితే ఆ ఓటు ఎవరికో ఒకరికి మాత్రమే వేసేలా ఉండదు.
అంటే… అందులో ఉండే అభ్యర్థులకు సభ్యులు తమ ప్రాధాన్యత ఓటును వేయాలి. .
ఉదాహరణకు 4 అభ్యర్థులు బరిలో ఉన్నారనుకుంటే వారిలో ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారో ఎంచుకుని స్లిప్‌లో 1, 2, 3, 4 ఇలా రాయాలన్నమాట.
ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు విలువ కడతారు. అది నియోజకవర్గాలకు వేర్వేరుగా ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో అయితే ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208 గా ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ విలువ 8 మాత్రమే.
ఇలా అభ్యర్థుల ఓట్లకు విలువ వేస్తారు.
ఈ క్రమంలో మొత్తం 4896 మంది సభ్యుల ఓట్ల విలువ కలిపి 10,98,903 అవుతుంది.
అందులో సగం ఓట్లు అంటే 5,49,442 వస్తే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
అయితే మొత్తం పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు గనక ఈ విలువ మారుతుంది.
ప్రశ్న:* కొబ్బరి కాయను పగలగొట్టినప్పుడు అది రెండు ముక్కలే ఎందుకు అవుతుంది?
జవాబు:* ఏదైనా ఘనపదార్థాన్ని పగలగొట్టాలంటే శక్తి కావాలి. ఎంత కావాలనేది ఆ వస్తువు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. అలా కొట్టేటప్పుడు వేగం, కాలం కూడా పరిగణనలోకి వస్తాయి. ఎంత శక్తిని ఎంత కాలంలో ఎంత వేగంతో ఉపయోగించామో తెలిపేదే తాడనం (impact) అవుతుంది. గట్టిగా ఉండే కొబ్బరి కాయ పెంకు పగలాలంటే తాడన తీవ్రత అధికంగా ఉండాలి. అది పెంకులో పగుళ్లను తీసుకువస్తుంది. దీని మీదనే పగులు విస్తారం (spread of crack) ఆధారపడి ఉంటుంది. కొబ్బరి కాయ ఎక్కువ ముక్కలవ్వాలంటే ఎక్కువ విస్తారపు పగుళ్లు కావాలి. కానీ మనం సాధారణంగా ప్రయోగించే తాడన తీవ్రత కొబ్బరి కాయను కేవలం రెండు ముక్కల్నే చేయగలదు. అలా కాకుండా చాలా తీవ్ర శక్తితో నేలకేసి ఠపీమని కొడితే అది అనేకముక్కలవడాన్ని గమనించవచ్చు.
..
ప్రశ్న: చీమలు తమ కన్నా ఎక్కువ బరువును ఎలా మోస్తాయి?
జవాబు: ఒక ప్రాణి ఎత్తగల బరువు ఆ ప్రాణి పరిమాణాన్ని బట్టి, సొంత బరువును బట్టి మాత్రమే ఆధారపడదు. వందల కిలోగ్రాములున్న జెల్లీ చేప మీద 30 కిలోగ్రాముల బరువు ఉంచినా కుచించుకుపోతుంది. రైలు పట్టాల సొంత బరువు తక్కువే, అయినా వాటి మీద వేల టన్నుల బరువున్న రైలు స్థిరంగా ఉండగలుగుతోంది. ఒక వస్తువు మీద మరో వస్తువు నిలబడగలిగే సామర్థ్యం నిలబెట్టుకునే వస్తువుకున్న నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. ఒలింపిక్ క్రీడల్లో బరువునెత్తడం కష్టమే కానీ ఎత్తిన బరువును నిలుపుకోవడం చాలా సులభం. ఎందుకంటే ఎత్తిన తర్వాత తమ శరీరాన్ని అందుకనుగుణంగా నిలుపుకుంటారు. చీమల బరువు తక్కువే ఉన్నా వాటి శరీరాకృతిలో గట్టి కైటిన్ అనే పదార్థం ఉంటుంది. మనుషులు తదితర సకశేరుక జంతువులకు శరీరం లోపల అస్థిక నిర్మాణం వల్ల ఆకృతి, స్థిరత్వం వస్తాయి. చీమలు, తాబేళ్లు, గవ్వలు మొదలయిన అకశేరుక జంతువులకు బాహ్య నిర్మాణం గట్టిగా ఉండటం ద్వారా స్థిరత్వం, స్వరూపం కలుగుతాయి. అందువల్లే చీమలు తమ కన్నా ఎక్కువ బరువును కూడా ఎత్తగలవు. కానీ అవి ప్రతిసారీ తమకన్నా ఎక్కువ బరువును మోసుకెళ్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. చీమలు తమకు ఉపయుక్తమయిన పదార్థాలను గోళాకారంలోకి మార్చి దొర్లించుకుంటూ వెళ్లడం తరచూ చూస్తాం. ప్రపంచంలో ఉన్న చీమల మొత్తం బరువు ప్రపంచంలో ఉన్న సకశేరుక జంతువుల మొత్తం బరువు కన్నా ఎక్కువ. చీమ చిన్నదేగానీ చీమల సీమ పెద్దదే!
ప్రశ్న:_కొబ్బరి నీళ్లు శరీరానికి మేలు చేస్తాయంటారు. ఎందువల్ల?
*జవాబు:* కొబ్బరి నీళ్లు నిజానికి కొబ్బరి మొలకల ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని ద్రవరూపంలో అందించడానికి ఏర్పడినవి. పారదర్శకంగా ఉండే తీయని కొబ్బరి నీళ్లలో నూనె, చక్కెర, నీరు, విటమిన్లు, పొటాషియం, భాస్వరం, సెలీనియం లాంటి పోషక పదార్థాలతో కూడిన ఖనిజ పదార్థాలుంటాయి. ఆ నీళ్లు తాగితే ఇవన్నీ శరీరానికి అందినట్టే. కొబ్బరి కాయ ముదిరే కొద్దీ లోపల ఉండే కొబ్బరి ఆ నీళ్లను పీల్చుకుంటుంది. అందువల్లనే ముదురుకాయలో కన్నా లేతకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు క్రిమిరహితమైన పరిశుభ్రమైన ద్రవం కావడంతో వాటిని తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా రక్తస్రావం ఎక్కువై శరీరంలోని సీరం చాలా తక్కువైన సందర్భాల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తారు. మూత్రపిండ వ్యాధులున్నవారికి, వాంతులవుతున్నవారికి, రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారికి, చర్మం పొడిబారిపోయి ముడతలు పడుతున్నవారికి, గ్లూకోమాలాంటి కంటి జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.
ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది.
(ఆ అమ్మాయికి పెళ్లి అయి ఆరు నెలల కొడుకు ఉన్నాడు)
నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డ్ మీద రాయమని చెప్పింది లెక్చరర్.
తను ఫ్యామిలీ మెంబర్లు.. బంధువులు.. స్నేహితుల పేర్లను వ్రాసింది.
వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్.
తను బోర్డ్ పైన వ్రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది.
నీ లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5గురి పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్.
తను ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది.
అలా చెరుపుకుంటు పోగా చివరకు బోర్డ్ మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ నలుగురి పేర్లు మిగిలాయి.
క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
ఇది ఆట కాదని అపుడు అర్దయింది అందరికి.
ఇపుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్..
ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది..
చాలా బాధ పడుతూ అమ్మా, నాన్నల పేర్లను చెరిపింది తను.
మిగిలిన రెండింటిలో మరోకటి చెరపమని చెప్పింది లెక్చరర్.
తనకు కళ్ళవెంట నీళ్లు కారసాగాయి.. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ..!!
వెళ్లి నీ సీట్ లో కూర్చోమని చెప్పింది లెక్చరర్..!!
తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది..
నీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను కాదని.. నువు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు..?
క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది..
తను ఏమి చెపుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరు.
తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది..
ఎదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు.. చదువు కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఎదో ఒకరకంగా నా కొడుకు కూడా నాకు దూరమవ్వక తప్పదు.
కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే..!!
ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
GST అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతుంది..
ప్రతి వ్యాపారి జాగ్రత్త వహించండి..
పాత తరం విధానాలకి చరమగీతం పాడండి..
లైసెన్స్ లేని వ్యాపారం ఇకపై కుదరదు..
భారత వాణిజ్య విధానం ఇప్పటిదాకా ఒకరకం అయితే ఇకపై పూర్తిగా భిన్నమైన పరిస్థితి..
ప్రతి అమ్మకం - కొనుగోలు పూర్తిగా పేపర్ పై చూపించాల్సి ఉంటుంది..
కట్టు తప్పితే వేటుకు సిద్ధంగా ఉండండి..
దేశవ్యాప్తంగా జులై 1 నుండి GST విధానం 100% అమలులోకి వస్తుంది.
ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉన్న VAT విధానం పూర్తిగా రద్దవుతుంది..
దేశ స్వతంత్రానంతరం నేటి వరకు లేని 4 ఉత్పత్తులపై కూడా ఈ GST విధానంలో చేర్చబడ్డాయి. అవి.. విద్య, వస్త్రాలు, ఔషధాలు, వృత్తి ద్వారా అందించే సేవలు. ఇకపై వీటిని కూడా వివిధ రకాలుగా పన్ను సేవలలో చేర్చడం జరిగింది.
ఇప్పుడున్న VAT విధానం నుండి GST కి మరాలనుకుంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.
GST విధానంలో పన్నులు 7 రకాలుగా విభజించబడ్డాయి. 0, 5, 8, 12, 18, 28, 40 శాతం శ్లాబులు ఉన్నాయి. వీటిలో FMCG వ్యాపారానికి 40% వర్తించదు.
CGST-SGST : ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునేవారికి వర్తిస్తుంది. ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు. కేవలం డిపో ట్రాన్స్ఫర్ విధానం మాత్రమే ఉంటుంది. దానికి ఎలాంటి పన్ను లేదు. అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి.
ఇకపై ప్రతినెలా మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు, మీరు చూపించే ఖరీదులు తప్పకుండా Match అవ్వాల్సి ఉంటుంది. Match కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకొని సవరించుకోవాల్సి ఉంటుంది. Match కాని పక్షంలో Input టాక్స్ కి ప్రమాదం సంభవిస్తుంది.
మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్ పోస్టులు ఉండవు. సేల్ టాక్స్ అధికారులు మొబైల్ చెక్ పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడా సరుకు రవాణా వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు, వేబిల్లు తప్పనిసరిగా జత చేసి ఉండాలి.
50వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్ కి అప్ లోడ్ చేసి ఆన్ లైన్ ద్వారా తప్పని సరిగా వేబిల్లు పొందాలి. తదుపరి మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి. ఇది ఒక ఊరి నుండి మరొక ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్న వేబిల్లు తప్పనిసరి. అది లేకుండా సరుకు మార్చుట తీవ్ర నేరంగా పరిగనించబడుతుంది. అనుసరించని వారికి కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య, జైలు శిక్ష విధించబడుతుంది
GST విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే VAT 200 కి బదులు కొత్తవిధానం అమలులోకి వచ్చింది. ఇందులో మనం ప్రతినెలా సేల్స్ ని 5 రకాల పద్ధతుల్లో ఆన్ లైన్ ద్వారా పంపాల్సి వస్తుంది.. తెలుసుకోవాల్సి వస్తుంది.. అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.
1. R1 Form ప్రతినెలా 10తేదీలోపు
2. R2 Form ప్రతినెలా 13తేదీలోపు
3. R3 Form ప్రతినెలా 15తేదీలోపు
4. R4 Form ప్రతినెలా 17తేదీలోపు
5. R5 Form ప్రతినెలా 20తేదీలోపు
1. మన ఖరీదుకి సంబంధించినది
2. దాని నిర్ధారణ (GST Dept ద్వారా వచ్చేది)
3, 4, 5 లు నెలనెలా అప్ లోడ్స్ చేయాల్సినవే.
ఇవన్నీ ప్రతినెలా అప్ లోడ్ చేయాల్సినవే. ఇలా చివరివరకు MATCH & MISMATCH తరువాత అమ్మకం మరియు కొనుగోలుదారుల Submission Comparision చేసుకునే ప్రక్రియ. ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ విషయమై మీ చార్టెడ్ అకౌంటెంట్ లేదా సంబంధిత సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ నుండి గానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవడం తప్పనిసరి.
ఈ GST విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెలా GST కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.
నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.
VAT విధానంలో ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగియుండాలి.
మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారాగానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకి వెళ్లి మార్చుకునే అవకాశంగానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమి చేయలేడు. ప్రతినెలా 20వ తేదీన అప్ లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పుచేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి..
ఒక యజమాని పేరుతో ఒకరికి ఒక ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటికంటే ఎక్కువ ఫర్ములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్ము PAN కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. కనుక ఒకరికి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త.
ఇక ముందు GST అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి గోడౌన్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి C & F కి గానీ, గోడౌన్ నుండి ఆఫీస్ కిగానీ, స్టాక్ ట్రాన్స్ ఫర్ అనే విధానం ఒక డెలివరీ చాలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి మరో డిస్ట్రిబ్యూటర్ కి కూడా సరుకు మార్పిడి (ట్రాన్స్ ఫర్ ) ఉండదు. దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాలి. కాబట్టి ఒక వేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా సరుకు పంపాల్సి ఉంటుంది.
ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది. కాబట్టి తరువాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్క కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీములకి మాత్రమే పన్ను ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు.
GST విధానం ద్వారా FMCG ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వేచి చూడాలి.
ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకులపైన MRP విధిగా ఉంటుంది.
ఇకపై GST పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ - C & F వ్యవస్థకి పెనుముప్పు రానుందని చెప్పాలి.
ఇంకో కొత్త విధానం ఏమిటంటే ధరల నియంత్రణ చట్టం. ఉదాహరణకి గులాబ్ జామ్ ధర రూ. 100/- అనుకోండి. అదే గులాబ్ జామ్ పైన మరో ప్యాకెట్ ఉచితంగా ఇస్తేగనుక దాని ధరను నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. కాలమే దీనికి సమాధానం చెబుతుంది.
ఇట్టి సవరణలను అర్ధం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి, తప్పు చేసేవాళ్లను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానం తీసుకువచ్చింది. అన్నీ సక్రమంగా నిర్వర్తించే వాళ్ళకి భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతేగాక భవిష్యత్ లో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాము అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారి పోవచ్చు కూడా. ఇది కాకుండా భవిష్యత్ లో ఈ రేటింగ్ పద్దతి ద్వారానే బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోను గానీ, ఇళ్లు లోన్ గానీ, వ్యాపార లోన్ గానీ ఈ విధానంలోనే చూడబడుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకి భవిష్యత్ ఉంది.
ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలావరకు FMCG కంపెనీలు మైగ్రేషన్(మార్పిడి) ద్వారా వచ్చే TAX డిఫరెన్స్ ని NET LOSS పద్దతిలో లెక్కగట్టి అట్టి నష్టాన్ని పూడుస్తామని వ్రాతపూర్వకంగా తెలిపాయి. అందుకని మీరందరూ క్లోజింగ్ స్టాక్ ని సక్రమంగా లెక్కచేసి పెట్టుకోండి. అట్టి ప్రొడక్ట్ లపై ఉన్న టాక్స్ ని కూడా లెక్కచేసి పెట్టుకోండి. ఇది వ్యాపారి సబ్మిషన్ లో చెప్పాల్సి ఉంటుంది. అట్టి టాక్స్ సంస్థ ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పద్దతిలో GST లోకి మారిపోతుంది. ఇది కాకుండా 18% లోపు ఉన్న టాక్స్ లకు 40% ఎక్సయిజ్ టాక్స్ పద్దతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ 18% పైన గనుక టాక్స్ ఉంటే అట్టి ప్రొడక్ట్ కి టాక్స్ + 60% రిఫండ్ ఉంటుంది. దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు.
ఇకముందు మనం అమ్మే ప్రతి ప్రొడక్ట్ కి HSN CODE విధానం ఉంటుంది. ఇది ఏమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి GST ఫార్మాట్ లో ఒక కోడ్ ఇస్తుంది. అది మనం క్యాంపెయిన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అది లేనిదే బిల్లు చేయలేరు. కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. దాటవేత ధోరణిని అంగీకరించకండి. వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మకం కలిగిన తరువాతనే వారితో లావాదేవీలు జరపండి. లేదంటే ప్రమాదంలో పడతారు.
ఇప్పటి వరకు మీరు లావాదేవీలు నెరపిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్, డామేజ్ స్టాక్, గడువుతీరిన సరుకు, సేల్స్ మ్యాన్ జీతభత్యాలు, పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి (GST మొదలయ్యేలోపు అన్నింటికీ సంబంధించిన క్రెడిట్ నోట్స్ తయారుచేసుకొని ఆయా కంపెనీలకు పంపండి). ఆ డాక్యుమెంట్ ని జాగ్రత్త చేయండి. వీలయినంతవరకు కంపెనీల ద్వారా రావలసిన బెనిఫిట్స్ త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే GST తరువాత అట్టి క్లెయిమ్స్ కి 18% టాక్స్ పడే అవకాశం ఉంది.
ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్, లాడ్జ్ బిల్స్ మరియు ఇతరములపై కట్టే టాక్స్ లను input క్రెడిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ ఖరీదు, అద్దెలు పైన గానీ టాక్స్ లు కట్టిన యెడల అది కూడా ఇన్ పుట్ టాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇది రిఫండ్ గా లెక్క చూసుకోవాలి. దానిని నెల అంతంలో నింపే రిటర్న్ లో క్లుప్తపరచాలి. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ఒకవేళ ఇంటర్మ్ సేల్స్ మేన్స్ కిగానీ, డిస్ప్లే ఖర్చుకి గానీ, కంపెనీ తరఫున చేసిన ఖర్చునుగానీ కంపెనీలనుండి క్లెయిమ్ చేయునప్పుడు తప్పకుండా invoice రైజ్ చేసి టాక్స్ జోడించి పంపించాలి. అట్టి టాక్స్ ని ఇన్పుట్, ఔట్ పుట్ లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి.
సాధారణంగా న్యాయపరమైన విధానాలు..
GST ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని పుస్తకాల ద్వారా గానీ, కంప్యూటర్ ద్వారాగానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనిఖీ సందర్భంలో GST అధికారి అడిగిన దరిమిలా అన్నిటినీ రోజువారీగా చూపించే విధంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన విషయం
దీనికిగాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంటెంట్ గానీ, ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానంగానీ కలిగి ఉండాలి.
మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాల లెక్క సరిగ్గా ఉండాలి. మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒక వేళ అలాచేయకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే అట్టి జీతాల ఖర్చును, ఖర్చుల క్రింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది.
మీ మీ ట్రావెల్ ఖర్చులు, ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫర్మ్ కింద క్లెయిమ్ చేయాలి.
మీదగ్గర ఉన్న, కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి. ఇతరత్రాకి ఇన్ పుట్ క్రెడిట్ రాదు. కనుక జాగ్రత్త వహించి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు అమ్ముకోవాలి. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు.
C & F - సూపర్ స్టాకిస్ట్ లు పాతవ్యాపారానికి సంబంధించి C Form గానీ, F Form గానీ డిసెంబర్ లోగా తమతమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైనా లేదా తదుపరి లావాదేవీల పైన టాక్స్ పడే అవకాశం ఉంది.
31 మార్చ్ 2017 క్లోజింగ్ స్టాక్ మరియు 30జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్కచేసుకొని అట్టి క్లోజింగ్ స్టాక్ ని క్వాంటిటీ రూపేణా లెక్కకట్టుకొని GST ఇంప్లీమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ కాపీని తప్పకుండా తెప్పించి పెట్టుకోవాలి. అట్టి ఖరీదులను మీ పుస్తకాలతో సరి చూసుకోవాలి. అశ్రద్ధ పనికి రాదు.
అలా సరిచేసిన స్టాక్ ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ GST లో ఇన్ పుట్ క్రెడిట్ జమ అవుతుంది.
మీకు వచ్చిన మీ GSTIN నెంబర్ ని మీ సరుకు సరఫరా దారులు అందరికీ ఇవ్వండి. అలాగే మీరు సరుకు సరఫరా చేసే కష్టమర్ల GSTIN నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి.
మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి HSN CODE ఉంటుంది. ఇది తప్పని సరి కాబట్టి అట్టి ప్రొడక్ట్స్ యొక్క HSN CODES యొక్క మోడల్ తెలుసుకొని ఒక షీట్ లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే GST తరువాత ప్రతి వస్తువు యొక్క HSN CODE ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.
జరిమానాలు - శిక్షలు
ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగా నిర్మించబడింది. మన తప్పులకు ఆడిటింగ్ గానీ, స్థానిక అధికారుల నుండి గానీ ఎలాంటి నోటీసులు ఇవ్వబడదు. ఇక మీదట ఏ అధికారికి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీమ్ రావొచ్చు. లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయవచ్చు. అలా అరెస్టు చేసే ముందు మనకు తగిన కారణాలను చూపుతారు. అరెస్టు అయిన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఆఫెన్సస్ U/S 132 యాక్ట్ కింద అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంది.
132 సెక్షన్ పరిధి : ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా బిల్లు లేదా సర్వీసు invoice లేకుండా ఆ సరుకు గానీ, సర్వీసు గానీ సప్లై చేస్తూ దొరికినచో లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించిననూ.. ఏ సరుకు గానీ, సర్వీసుగానీ ఇవ్వకున్నను కేవలం ఇన్ పుట్ టాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చి దొరికినచో.. తద్వారా ఎవరైనా లాభపడినచో... సదరు వ్యాపారి input tax credit చేసుకొని తరువాత అట్టి టాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో.. దానిని కావాలని చేసిన ద్రోహం క్రింద పరిగణించి శిక్ష వేసే అవకాశం ఉంది. అట్టి తప్పుల వల్ల నేరనిర్ధారణ జరిగితే జైలు తప్పదు.
మరో ముఖ్య విషయం.. GST అప్లోడ్ చేయడానికి GST అథారిటీ పొందిన సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే సాధ్యం. ఒక వేళ ఏ ఇతర చిన్నచిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు గానీ ఇంటర్నల్ GST బిల్లింగ్ కొరకు సాఫ్ట్ వేర్ ఇచ్చిననూ GST uploding మాత్రం తప్పకుండా అర్థరైజ్డ్ సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే చేయగలరు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. దేశంలో మొత్తం 34 కంపెనీలు మాత్రమే అధరైజేషన్ కలిగిన సాఫ్ట్ వేర్ కలిగిఉన్నాయి. వాటిలో ఆయా ట్రేడ్ కి సపోర్ట్ చేసే సాఫ్ట్ వేర్ ని జాగ్రత్తగా ఎంచుకోండి..
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-
*ఈవేళ విద్యావ్యవస్థలో ఉండే తేడాల కారణంగా యావత సమాజంలో పౌరజీవనం అస్తవ్యస్తం అయిపోయిన విషయం మనకు తెలుసు*
*మూలాలు ఎక్కడో ఉన్నాయి అనుకుంటాం కానీ, మూలాలు విద్యావ్యవస్థలోనే ఉన్నాయి*.
*నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. నిజమే! సరిగ్గా పెంచితే ఆ మాట నిజమే అవుతుంది. లేకపోతే నేటి దూడలే రేపటి దున్నపోతులు*! తేడా ఏం లేదు. కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. దూడ దున్నపోతు కావడానికి ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు.
*కానీ బాలుడు పౌరునిగా మారడానికి చాలా మంది కృషి చేయాలి. బాలునిలో దేశభక్తి, దైవభక్తి అనే స్ఫూర్తిని మనం కలిగించాలి. అది లేకుండా ఎవరి స్వార్థాలకు వారు పాల్పడి, యాజమాన్యాలేమో లాభాల కోసం, ఉపాధ్యాయులు పదోన్నతులు, జీతాల కోసం, తల్లితండ్రులేమో మా వాడు నాలుగు రూపాయలు సంపాదించే ఉద్యోగం చేస్తే చాలని చూస్తున్నారు*.
*విద్యార్థి కూడా వీలైనంత చదవకుండా పాసవ్వడం ఎలాగా... అని ఆలోచిస్తున్నాడు. ఇలా నాలుగువైపుల నుంచి స్వార్థపరమైన ఆలోచనలు ఉన్నప్పుడు సమగ్రమైన భారతీయ పౌరుడు తయారయ్యే అవకాశం ఉందా*?
*ఒక బాలుడు మంచి పౌరునిగా తయారు కావాలంటే మనం విద్య లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకుని, అన్వయించుకుని, ఆచరణలో పెట్టాలి.*
ఎందుకు చదవాలి? ఈరోజున అందరికీ చదువు అంటున్నారు. ఎందుకు? చదువు అందరికీ అవసరమే. ఎందుకంటే విద్య వల్ల వినయం వస్తుంది. ఇవ్వాళ
ఓ అబ్బాయిని ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు? అని అడిగితే ‘ఇంజనీరింగ్ చదవాలి కదండీ’ అంటాడు. ఇంజనీరింగ్ ఎందుకు అంటే ‘మంచి ఉద్యోగం దొరకాలి’ కదా అంటాడు. మంచి ఉద్యోగం ఎందుకు అంటే ‘బాగా సంపాదించాలి కదా’ అంటాడు. సంపాదన ఎందుకు అంటే ‘సుఖపడాలి కదా’ అంటాడు.
*సుఖమెందుకు అంటే ‘సుఖపడటానికే జీవితం’ అంటాడు. సుఖపడటానికే జీవితం కాదు, మనం సుఖపడుతూ మనచుట్టూ పదిమంది సుఖంగా జీవించేలా చేయడమే జీవితం*.
*నేను సుఖపడటానికే జీవితం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దేశం అక్కడే దెబ్బతింటోంది. సమాజం అక్కడే సర్వనాశనమవుతోంది. చరిత్ర, శాస్త్రసాంకేతికత, సాహిత్యం చదువుకున్న విద్యార్థికి వినయం రావాలి. ఈ రోజున విద్యార్థికి ఆ వినయం వస్తోందా? అది లేకపోగా పదోతరగతిలో 600 మార్కులకు 550 దాటగానే విద్యార్థి దగ్గరకు కాలేజీ ప్రిన్సిపాళ్లందరూ చేరి మా కాలేజీలో చేరు అని బతిమాలుతున్నారు.*
*దాంతో విద్యార్థి కాలు మీద కాలేస్తున్నాడు. గర్వం వచ్చేస్తోంది. 550 మార్కులు వచ్చిన వానికి వినయం రావాల్సింది పోయి గర్వం వచ్చింది*.
*విద్య వల్ల వినయం, వినయంతో యోగ్యత వస్తాయి. పూర్వం పెళ్లి చేసుకునే వారు కూడా వినయాన్ని చూసి చేసుకునే వారు. అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిది అని చేసుకునే వారు. ఇప్పుడేమో ఎంత జీతం? ఏ కంపెనీలో చేస్తున్నావు? అని అడుగుతున్నారు. యోగ్యత ఉన్నప్పుడు మనం వ్యాపారం చేశామా? ఉద్యోగం చేశామా? ఏదైనా ఫరవాలేదు. విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, ఆ యోగ్యత వల్ల ధనం వస్తాయి. మరి ధనం వల్ల ఏమొస్తుంది?*
*ఆనందం వస్తుందంటే కోటీశ్వరులందరూ ఆనందంగా ఉంటున్నారా? లేదు. రెండోపూట చపాతీ తింటున్నారు. అది కూడా ఒకటే. రెండోది వేసుకుంటే బరువు పెరుగుతారు*.
*అందులో చట్నీ వేయకూడదు, ఎందుకంటే బీపీ. పంచదార వేయకూడదు ఎందుకంటే షుగర్. మరి ఏమీ లేనిదానికి వంద కోట్లు ఎందుకు మహానుభావా? ఇదొక్కసారి ఆలోచిస్తే మనిషి సంపాదించడం మానేస్తాడు. సంపాదించడం తగ్గించుకున్నప్పుడు పని ఒత్తిడి కూడా ఉండదు. ధనం వల్ల సుఖం రాదు.*
*మరి ధనం సంపాదిస్తే ఏమొస్తుంది అంటే... *మనిషి తన అవసరాలకు సంపాదించుకున్నప్పుడు* *ధర్మంగా, నిజాయితీగా ఉండగలుగుతాడు. ధర్మంగా ఉండటం అంటే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు*. *బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల సుఖపడతాడు*.
*విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం కలుగుతుంది.*
*ఆ ధర్మాన్ని నేర్పడం కోసమే విద్య. మనం ఆ విద్య కోసమే పిల్లలను పాఠశాలలో చేర్పిద్దాం*.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions
Details;-